1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

13, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఏది ఆధునికీకరణ- ఏది (అ)నాగరికత...

చాలా రోజుల తర్వాత (1 సంవత్సరం) సరస్వతి కరుణించి, ప్రశాంతంగా ఎప్పుడో రాసిన రాతలను పూర్తి చేద్దామని ఇదిగో ఇలా మొదలెట్టా...... 

ఆధునికీకరణ-నాగరికత అంటే .......

 • మతిపోగెట్టే మత్తుపానియాలకు అలవాటుపడుతూ, వాటిని సేవించి ఏమి చెయ్యాలో, ఏమి చేస్తున్నామో తెలియని స్తితిలో తూలడమా? లేక  
 • అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను, నిద్రా సమయాలను అలవరచుకోవడమా ? లేక
 • అర్దరాత్రులవరకు తప్పతాగుతూ పబ్బుల్లో, బార్ లలో వినోదాలు, విలాసాలా? లేక 
 •  అమాయకులపై యాసిడ్ దాడులా లేక కత్తులతో తెగ నరుక్కోవడాలా? లేక 
 •  తెలుసుకోలేని వయసులో, ఆలోచన లేకుండా, అర్ధంలేని కోరికలతో, జీవితాలతో ఆడుకోవడమా? లేక
 •  24 గంటలు T.V లకు, కంప్యూటర్ లకు లేక కృత్రిమ ఆనందాలను ఇచ్చే వాటికీ బానిసలుగా మారుతూ ...ప్రకృతిలో దొరికే సహజసిద్దమైన ఆనందాలకు దూరంకావడమా? లేక
 • ప్రేమో,ఆకర్షనో...దేనికి ఎంత ప్రాముక్యత ఇవ్వాలో తెలుసుకోకుండా ....జీవితాలను మధ్యలోనే నాశనం చేసుకోవడమా? లేక
 • ప్రతి చిన్న విషయానికి/కష్టానికి/బాధకు వోర్చుకోలేక, తట్టుకోలేక, వాటిని దైర్యంగా ఎదుర్కొనలేక ఆత్మహత్యలు చేసుకోవడమా? లేక
 • డబ్బుకోసం అహోరాత్రాలు ఇల్లు, పిల్లలు, కుటుంబం, ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు, సంబంధాలు, అభిమానాలు, సంతోషాలు, సరదాలు లేకుండా జీవితాన్ని భారంగా, నిరాశ, నిష్ప్రుహలతో యాంత్రికంగా లాగదీయడమా? లేక
 • మనకు జీవనాధారం ఐన ప్రకృతిని, సహజ వనరులను నాశనం చెయ్యడమా? లేక
 • విలాసవంతమైన భవనాలు, మేడలు, అలంకరించబడ్డ భవన్తులా? లేక
 • తల్లిదండ్రులపై, తోబుట్టువులపై నిర్లక్ష్యపు చూపులా? లేక విడిపోయి వంటరిగా సాగే చిన్న కుటుంబాలా? లేక
 • దూరమవుతున్న సహజమైన సంతోషాలా?  లేక పెరుగుతున్న బ్యాంకు బాలన్సులు, మానసిక వత్తిడులు, కృత్రిమమైన వసతులా?
 • సంస్కారంలేని పెద్ద పెద్ద చదువులా? లేక
 • పాత తరాల సాంప్రదాయాలకు, విలువలకు తర్పణం వదలడమా? లేక 
 • కులమతాలను రెచ్చగొడుతూ, కుళ్ళు రాజకీయాలను, అవినీతిని ప్రోత్సహించడమా?           
అసలు అభివృద్ధి అంటే ఏమిటో మీరే ఆలోచించండి


నా అనంతరంగం ...మీ అమ్మ శ్రీనివాస్...Started on 18th Sep, 2010

కామెంట్‌లు లేవు: