రాయి -శిల్పంగా మారాలన్నా..
గొంగళిపురుగు -సీతాకోక చిలకలా కావాలన్నా..
గర్భంలోని పిండం -పసి పాపగా మారాలన్నా..
విత్తనం-మొలకెత్తి చెట్టుగా మారాలన్నా..
మనిషి చెడు స్వభావాలను వదులుకోవాలన్న, వాటికీ దూరంగా ఉండాలన్నా..
మంచి ప్రవర్తనను అలవాటు చేసుకోవాలన్నా…….
అన్నిటికి మార్పు అవసరం .ఇలా అవి ఉన్న స్తితి నుంచి ఉన్నత స్తితికి మారాలనుకున్నప్పుడు జరిగే పరిణామ క్రమంలో (మారే ప్రక్రియలో) కొంచెం/ఎక్కువగా తాత్కాలికమైన బాధ ఇమిడివుంటుంది...అ బాధను, నొప్పిని వోర్చుకొని మారగలిగితే.....నువ్వు ఉన్నత స్తితికి చేరుకొని అందరికి ఉపయోగపడుతావు, అందరిచేత పొగడబడుతావు....అలాకాక బాధకి భయపడి, నొప్పికి వోర్వలేక మార్పును అంగీకరించకపోతే నువ్వు ఉన్న స్తితిలోనే ఉంటావు .....నా అనంతరంగం అమ్మ శ్రీనివాస్ 15.03.11
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి