It's not a Song.....Its an inspiration.....Feel the lyrics instead just reading...
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
పల్లవి :
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో వుంది | | మౌనంగానే ఎదగమని | |
అనుపల్లవి :
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలినచోటే కొత్త చిగురు కనిపిస్తుంది | | మౌనంగానే ఎదగమని | |
చరణం 1 :
దూరమెంతొ ఉందని దిగులుపడకు నేస్తమా
దరికిచేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతొ ఉందని బాధపడకు నేస్తమా
బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషిచేస్తేనే అమృతమిచ్చింది
అవరోధుల దీవుల్లో
ఆనంద నిధి వున్నది
కష్టాల వారధి దాటినవారికి సొంతమౌతుంది
తెలుసుకొంటే తలుచుకొంటే సాధ్యమది | | మౌనంగానే ఎదగమని | |
చరణం 2 :
చెమటనీరు చిందగా నుదిటి రాత మార్చుకో
మార్చలేనిది ఏదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగుంచగా ను చేతిగీత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
తోచినట్టుగా అందరి రాతని బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతని నీవే రాయాలి
మా ధైర్యాన్ని దర్శించి దైవాలె తలదించగా
మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి | | మౌనంగానే ఎదగమని | |
Note : Telugu Font will not visible in Outlook-2007. Can be visible in HTML/Gmail
Love all - Serve all
AMMA Srinivas
9177999263
ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఒక రెహ్మాన్, ఒక సచిన్ కాలేకపొవచ్చు.... కాని ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిస్సా కాగలరు . ఇందుకు మేధస్సు,ప్రతిభ ,కృషి అవసరం లేదు, ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉన్నా, అవసరం లో ఆదుకునే మనసున్నా చాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి