1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

7, ఫిబ్రవరి 2012, మంగళవారం

ఆన్ లైన్లో పోస్టులను షేర్ చేసుకోవడం -మార్పుకోసం ప్రయత్నించడం చాలా మంచిపని...

ఆన్ లైన్లో  పోస్టులను లైక్ చెయ్యడం ద్వారానో , షేర్ చేసుకోవడం ద్వారానో లేక ఒక మంచి విషయాన్ని పోస్ట్ చెయ్యడం ద్వారానో మార్పుకోసం ప్రయత్నించడం చాలా మంచిపని...
కాని ఇది నరాలు చచ్చుబడి, లేవలేని, నడవ లేని వయస్సు మళ్ళిన వాళ్ళు చెయ్యాల్సిన పని కాని, మనలాంటి వయస్సులో ఉన్న యువత చెయ్యవలసిన పని కాదు...


యువత కాలం వెల్లదీయాల్సింది నెట్ చాట్లలోను, పబ్బులలోను, బార్లలోను కాదు మీ యొక్క కొంచెం సమయాన్ని కేటాయించండి,
మీ దగ్గర ఎక్కువగా ఉన్న దానిని అది లేని వారికీ పంచి పెట్టండి....

అది నీ ఆనందం కావచ్చు,నువ్వు నేర్చుకొన్న చదువు కావొచ్చు, నీ మిగిలిన పాత బట్టలు కావొచ్చు,మిగిలిన అన్నం కావొచ్చు...
రండి నేరుగా, ధైర్యంగా పనిలోకి దూకండి, నిమగ్నం కండి, ఏది ఆలోచించ కండి, ముందుకు కదలండి....
నువ్వు చేసేది నలుగురి మంచి  కోసం ఐనప్పుడు ప్రపంచం మొత్తం ఏకమై నీ ప్రతి అడుగులోను నీకు సహాయం చెయ్యడానికి కావలసిన అన్ని వనరులను సమకూరుస్తుంది,
నువ్వు చెయ్యాల్సిందల్ల మొదటి అడుగు వెయ్యడం, అ భాద్యతను తీసుకోవడమే.....



లేవండి...మేల్కోండి.....మీరు వెళ్ళాల్సింది ఐదు నక్షత్రాల హోటల్స్ లోకో, పెద్ద పెద్ద భవన్తులలోకో కాదు ..
మీ సహాయం అందాల్సింది ఏమి అందని గుడిసెలలో,
మురికి వాడలలో, మారు మూల గ్రామాలలో ....

రండి మీ వీధిలో,మీ ఊరిలో, మీ మండలంలో, మీ జిల్లాలో, మీ రాష్ట్రంలో, మీ దేశంలో, మీ ప్రపంచంలో తిరగండి.....
పరిసరాలను, పరిస్థితులను,ప్రజలను, వారి హావ  భావాలను, ఆనందాలను, వారి బాధలను  గమనించండి, తెలుసుకోండి, విశ్లేషించండి.
 మీకు తోచినది చెయ్యడానికి ప్రయత్నించండి.....అంతే కానీ మీకు మీరు ఒక గిరి గీసుకొని బావిలో కప్పలా అందులో ఉండకండి......
దేశమంటే మట్టికాదోయ్.....దేశమంటే మనుషులోయ్...... మన ఒక్కొక్కరి అభివృద్దే ....ఈ దేశాభివృద్ధి...నా అనంతరంగం...అమ్మ శ్రీనివాస్.... www.aswa.co.in

కామెంట్‌లు లేవు: