1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

19, జూన్ 2012, మంగళవారం

నువ్వే ఒక చరిత్ర కావాలి...

కొంత మంది  చేసే పనుల వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు (కనీసం వాళ్ళకి కూడా)

కొంత మంది చేసే పనుల వల్ల కనీసం వాళ్ళకైనా సంతృప్తి కలుగుతుంది

కానీ..... మనం చేసే పనుల వల్ల, మనకి సంతృప్తి కలగడంతో పాటు... ఎదుటి వారి లో ప్రేరణ కలగాలి.... ఇలాంటివి చెయ్యాలనే తపన పెరగాలి....

నువ్వు చరిత్ర చదివితే సరిపోదు......నువ్వే ఒక చరిత్ర కావాలి....నీ జీవనం ఇతరులకి ఉపయోగపడాలి.....నీ జీవితం ఒక ఆదర్శం కావాలి........

నీలో ఏదైనా సాధించగలిగే శక్తి సామర్ద్యాలు, వనరులు ఉన్నాయి.....వాటిని గుర్తించి...వెలికితీసే ప్రయత్నం చెయ్యి....

అంతే కానీ ఎవరి మీదనో ఆధారపడి, దేనికోసమో ఎదురు చూస్తూ .....

సమాజాన్ని నిందిస్తూ, నీ చేతకాని తనాన్ని కప్పిపుచ్చు కుంటూ... అందమైన జీవితాన్ని వ్యర్ధం చేసుకోకు..

తెలియలేదా... జీవితం యొక్క నిజమైన అర్ధం.....

తెలుసుకోలేవా... దాని సాధనకు సులువైన మార్గం.....

నేరవేర్చుకోలేవా ....నీ జీవిత లక్ష్యం......




నీకు ఏదైనా సాధ్యమే......నువ్వు దేన్నైనా సాధించగలవ్......నువ్వు చెయ్యాల్సిందల్లా నీ అజేయమైన శక్తిని, సామర్ధ్యాన్ని గుర్తించడమే....

నీ ఆలోచన, నీ లక్ష్యమే... నీ జీవిత గమనం..... అది మంచి కొరకు అయితే ఆనందమయ జీవితం.... కాకపోతే దుఖసాగరం.....



హృదయలోతుల్లోంచి, జీవిత అనుభవాల్లోంచి...మదిలో మెదిలే భావాల సంపుటి....నా అంతంలేని ఆలోచనల తరంగం....అదే....నా అనంతరంగం...అమ్మ శ్రీనివాస్

కామెంట్‌లు లేవు: