సంఘం అంటేనే నలుగురి సంగమం, సావాసం, సహా జీవనం, సముదాయం....
సమాజం అంటేనే ఒకరి కోసం ఒకరు, ఒకరి మీద ఒకరు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఖచ్చితంగా ఆధారపడే సమిష్టి జీవనం...
నీకు పాలు కావాలి అంటే పాలవాడి సహాయం కావాలి, సరుకులు కొనాలి అంటే షాప్ వాడు సహాయం కావాలి, తిండి కోసం రైతు సహాయం కావాలి.....
చెత్త వేరుకొనే వారు, పాకి దొడ్డి చిమ్మేవారు, మంగలి, కుమ్మరి, క్షురకుడు, వ్యాపారి, పని మనిషి,

పోస్ట్ వాడు, ఫోన్ వాడు, అధ్యాపకులు, గురువులు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు,
హితులు, శ్రేయోభిలాషులు.. ఇలా ఎందరో....
ఏదో ఒక సమయంలో సహాయం చేస్తూ నిన్ను నీ తోడుగా వుంది నడిపిస్తున్న వీరెవరు లేకుండా,
నువ్వు నీ జీవితాన్ని కనీసం ఒక్క క్షణమైనా జీవించగలవా?
ఒక్క నిముషం అలోచించి...నిన్ను నువ్వే ప్రశ్నించుకో...
నేను ఖచ్చితంగా చెప్పగలను నువ్వు ఉండలేవు....
నువ్వే కాదు...సృష్టి లోని ఏ మనిషి అలా ఒకరి పై ఆధారపడకుండా,

ఒకరి సహాయం లేకుండా బ్రతకలేడు...
మనిషే కాదు... ఏ జీవి అలా ఆధారపడకుండా జీవించలేదు....
అదే సృష్టి రహస్యం, దాని నిర్మాణంలోని చమత్కారం....ఇదే సంఘ జీవనం...దానికి నిజమైన అర్ధం....
నువ్వు డబ్బులు ఇచ్చి వాటిని పొందుతున్నావ్ అని విర్ర వీగకు...
అవే డబ్బులు నీకిస్తే అ పనులు నువ్వు చెయ్య గలవా?
సమాధానం నీకే తెలుసు...?
సంఘం అంటే అన్ని రకాల వృత్తుల, వ్యక్తులు సముదాయం..
అందరు కలిసి అరమరికలు లేకుండా ఆనందంగా సాగిపోవాలనే ఉద్దేశ్యంతో నిర్మించబడిన

ఒక వసుధైక కుటుంబం
మరి అలాంటప్పుడు,
ఇతరుల సహాయం లేకుండా నువ్వు ఖచ్చితంగా బ్రతకలేవు అని తెలిసినప్పుడు,
నీ జీవితం అంత ఇతరుల సహాయ, సహకారాలతోనే బ్రతుకుతున్నావు అనే విషయం గుర్తులేదా? రాదా?
లేక... అలా తెలిసి కూడా నాది, నా వారు, నాకు మాత్రమే,

నేను ఒక్కడినే అనే చట్రంలో గిరికీసుకొని కూర్చున్నావా?
నీ జీవన పయనం నలుగురి కోసం, నలుగురిలో,నలుగురితో

ఏ అరమరికలు లేకుండా సంతోషంగా బ్రతకడమే.....
మనం జన్మించటానికి కావాలి ఓ నలుగురు
మనం ఆడుకోవడానికి కావాలి ఓ నలుగురు
మనం స్నేహం చెయ్యడానికి కావాలి ఓ నలుగురు
మనకి చదువు చెప్పడానికి కావాలి ఓ నలుగురు
మన బాధలను పంచుకోవడానికి, మనల్ని కష్టాల్లో ఆదుకోవడానికి కావాలి ఓ నలుగురు
మన ఆనందాన్ని, సంతోషాన్ని పెంచుకోవడానికి కావాలి ఓ నలుగురు
మనకి సహాయం చెయ్యడానికి కావాలి ఓ నలుగురు
మనం జీవించడానికి కావాలి ఓ నలుగురు
మన జీవన పయనంలో అడుగడున కావాలి మనకి ఓ నలుగురు
చివరికి మనం తనువు చాలించడానికి కావాలి ఓ నలుగురు
కాబట్టి అందరితో మంచిగా వుంటూ, అందరిని గౌరవిస్తూ, అందరికి సయం చేస్తూ ముందు సాగిపో.....నీకు సహాయం చేసే నలుగురిని గుర్తుపెట్టుకో... నీతో కడ దాక నడిచే ఆ నలుగురిని సంపాదించుకో.......
హృదయలోతుల్లోంచి, జీవిత అనుభవాల్లోంచి...మదిలో మెదిలే భావాల సంపుటి....నా అంతంలేని ఆలోచనల తరంగం....అదే....నా అనంతరంగం...అమ్మ శ్రీనివాస్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి