1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

22, జులై 2012, ఆదివారం

ఉపనిషత్తుల గురించిన అతి కొద్ది సమాచారం


Gurukrupa


ఉపనిషత్తుల గురించిన అతి కొద్ది సమాచారం

Posted: 20 Jul 2012 09:07 PM PDT

నాలుగు వేదాలలో కలిపి 1180 ఉపనిషత్తులున్నాయి. ఋగ్వేదంలో 21, యజుర్వేదంలో 109, సామవేదంలో 1000, అధర్వణవేదంలో 50. వీటిలో వేదవిద్యతో పాటు చాలా ఉపనిషత్తులు అంతరించాయి.(లభ్యం కావడంలేదు). అయితే శ్రీరాముడు హనుమంతునికి 108 ఉపనిషత్తులని మాత్రమే సంగ్రహించి ఉపదేశించినట్లు గ్రంధాలు బోధిస్తున్నాయి. అవి సంగ్రహించి చెప్పినవే గాని, మిగిలిన ఉపనిషత్తులు లేవని అర్ధంకాదు. ఆది శంకరులు, ఇతర ఆచార్యులు పదింటికి భాష్యం వ్రాశారు.

అవి : ఈస, కేన, కఠ, ప్రశ్న, మండక, మాండుక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులు. ఐతే వీటిని మాత్రమే వ్రాయడంలో మిగిలిన వాటిని వారు అంగీకరించలేదని అర్ధం కాదు. వీటి భాష్యసరళిని గమనించి, ఉపనిషత్తులను ఆవగాహన పరచుకోవచ్చని వారి ఉద్దేశం.

వేదములు (వేద శాఖలన్నీ) నాలుగు భాగాలుగా ఉంటాయి. అవి : సంహిత, ఆరణ్యకం, బ్రాహ్మణం, ఉపనిషత్తు. నాలగవది వేదములకు చివర కనుక "వేదాంతం" అంటారు. అంతేకాక "చివరి మాట" అంటే "తీర్పు" అని అర్ధం. వేదముల తీర్పు అంటే పరమతాత్పర్యం - ఙ్ఞానం (ఆత్మఙ్ఞానం). డానిని ప్రస్ఫ్పుటముగా అందించే ఉపనిషత్తులను "వేదాంతం" అన్నారు.

ఉపనిషత్తులు బ్రహ్మ విద్యను బోధిస్తాయి. ఆత్మవిచారణగా కొన్ని, ఉపాసనగా కొన్ని, యోగపరంగా కొన్ని ఉపనిషత్తులున్నాయి. దీని అర్ధం, మూడింటి పరమార్ధం ఆత్మఙ్ఞానమేనని చెప్పడం.

ఆది శంకరులు పది ఉపనిషత్తులకే కాక శ్వేతాశ్వతర, నృసింహ తాపినీ ఉపనిషత్తులకు కూడా భాష్యం రచించారని కొందరు చెబుతారు. ఆ లెక్కలో ద్వాదశోపనిషత్తులు ప్రసిద్ధం
.
నాలుగు వేదాలలో ఎన్నో ఉపనిషత్తులున్నా, నాలుగు వేదాల నుండి నాలుగు ఉపనిషత్తులలోనూ, జీవ బ్రహ్మైక్యాన్ని చెప్పే నాలుగు మహా వాక్యాలను చెప్పారు.

అవి : 1. ప్రఙ్ఞానం బ్రహ్మ (ఋగ్వేదం, లక్షణ వాక్యం) 2. అహం బ్రహ్మాస్మి (యజుర్వేదం, స్వానుభవ వాక్యం) 3. తత్వమసి (సామవేదం, ఉపదేశవాక్యం) 4.ఆయమాత్మా బ్రహ్మ (అధర్వణవేదం, సాక్షాత్కార వాక్యం).

ఇవి గాక శ్రీరాముడు హనుమంతునకు 108 ఉపనిషత్తుల నుండీ 108 మహా వాక్యాలను ఉపదేశించినట్లు ఒక గాధ ఉంది. అవి కూడా లభ్యమవ్తున్నాయి. "మహావాక్య భాగ్యరత్నావళి" అని సమకూర్చారు.

అద్భుతమైన ఉపనిషద్విద్యను మనకు అందించడానికి మేధావులు చేసిన వివిధ ప్రయత్నాలివి. ఏదేమైనా, జీవ బ్రహ్మైక్యాన్ని తెలియచేసే మహావాక్యాలు నాలుగింటికి ఎక్కువ ప్రసిద్ధి.


కామెంట్‌లు లేవు: