1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

12, జూన్ 2013, బుధవారం

భావనల మధ్య తారతమ్యం.

ఒకాయన అమెరికా లో ఉన్న తన కొడుకు దగ్గరికి వెళ్ళాడట. ఒకానొక వారాంతంలో కొడుకు తన స్నేహితుని ఇంట్లో భోజనానికి సకుటుంబంగా వెళ్ళుతూ తన తండ్రిని కూడా వెంట తీసుకుని వెళ్ళాడు. భోజనం అంతా ఐన తరువాత వెళ్లబోయే ముందర ఆ కొడుకు నెమ్మదిగా తండ్రికి ఒక సూచన చేశాడు. అది ఏమిటంటే "ఆ అబ్బాయి( ఇంటి యజమాని ) వీరిని సాగనంపడానికి వచ్చినప్పుడు మంచి భోజనము పెట్టారు చాలా బాగుంది అని చెప్పి కృతఙ్ఞతలు చెప్పమని". అట్లాగే ఆ స్నేహితుడు వీరు వెళుతున్నప్పుడు గుమ్మందాకా బయటకు వచ్చినప్పుడు తండ్రి అతనితో భోజనం చాలా బాగున్నది బాబు. I am so happy. So kind of you to have offered such a good dinner. We have enjoyed a lot. చాలా Thanks అని చెప్పాడు.

 
  అది విన్న గృహస్థు ఈవిధంగా చెప్పాడు. నేను అమెరికాలో పుట్టి పెరిగిన వాడినవడం వలన నాకు పెద్దగా తెలియదుకానీ, మన దేశంలో ఈ పద్ధతి ఇట్లా ఉండదు అని, మనం ఎక్కడ ఉన్నా మన సాంప్రదాయాన్ని మరువరాదని మా పెద్దలు చెప్పేవారు. అందువలన మా ఇంటికి ఎవరైనా భోజనానికి వస్తే వారు రాగానే కాళ్ళు కడుక్కో టానికి నీళ్ళు ఇస్తాము. కాళ్ళు తుడుచుకోటానికి టవలు ఇస్తాము. కూర్చోపెట్టి భోజనం వడ్డిస్తాము. భోజనము అయిన తరువాత వారిని సాగనంపే టప్పుడు వారితో .. "మీరు భగవత్ స్వరూపంగా మా ఇంటికి వచ్చారు. మా ఆతిధ్యం స్వీకరించారు మీకు మా ధన్యవాదాలు అని మేము చెప్పుతాము. వారికి మేము కృతజ్ఞతలు చెప్పుతాము.పరమేశ్వరునికి ప్రాధ్యానత ఇచ్చే భూమి మనది. అందుకనే అక్కడ భోక్తకి ప్రాధాన్యం ఇచ్చి అతణ్ణి పరమేశ్వర స్వరూపంగా భావిస్తాము. అక్కడ అతిథి సత్కారం అన్నది గృహస్తు ధర్మం. కర్త తను నెరవేర్చాల్సిన ధర్మం నేర వేరుస్తున్నాడు." అని పలుక మని మా పెద్దలు తెలిపారు. మీరు మామీద ప్రేమతో మమ్మల్ని సంతోషపరచడానికి మా స్థాయికి దిగివచ్చి ఆవిధంగా పలికారు కానీ మీకివి తెలియనివికావు. కనుక మేమే మీకు శతథా కృతఙ్ఞులము. మీ అనుగ్రహాన్నీ ప్రేమను మాయందు ఎల్లవేళలా ఇదేవిధంగానే ప్రసరిపచేయగలరు. అని నవ్వుతూ సాగనంపాడు.
ఆ గృహస్థు యొక్క వినయానికి, సత్ప్రవర్తనకు, పెద్దలు నేర్పిన ఆచారాలను చక్కగా పాటిస్తున్న అతని శ్రద్ధ ఎంతగానో సంతోషించి సంతృప్తిగా ఇంటికి వెళ్ళారు.
Courtesy : Satsangamu Google Group

కామెంట్‌లు లేవు: