ఆర్టికల్ లోని ఒక భాగం ........
బడిలో వేశారు పిల్లాడిని ఆ తల్లితండ్రులు. వాడు పుస్తకం చదివే దాకా వచ్చాడు. బొమ్మలు కూడా ఉన్నాయి - ఇది నాన్న అని చదివాడు నాన్న బొమ్మ చూసి; ఇది అమ్మ అన్నాడు మరో బొమ్మ చూసి; ఇంకో బొమ్మని చూసి ఇది చెల్లి అన్నాడు. దాని కాప్షన్ - "ఇది నా కుటుంబం".
ఆ ఇంట్లో ఉన్న బామ్మ మనవడి దగ్గరకు వచ్చి మళ్ళా చదువు అంది. చదివాడు. అంటే నేను కుటుంబంలో లేనా? ఆ బామ్మ కళ్ళలో కన్నీళ్లు ఆగలేదు.
పిల్లల పాఠ్యాంశాలలో 'చిన్న కుటుంబం', 'పెద్ద కుటుంబం' అనేవి ఉన్నాయి. బామ్మ, తాత పిన్ని, బాబాయి, అత్తా ఇలా ఉంటే పెద్ద కుటుంబం; అమ్మా, నాన్న, తను, అక్క లేదా చెల్లి ఉంటే అది చిన్న కుటుంబం. కుటుంబం అనే మాట ఎంత కుదింపు అయిపోయిందో తెలుస్తోంది గా....
ఈ మధ్య కొత్త గొంతులు వినిపిస్తున్నాయి అందరికీ. బయోలాజికల్ పేరెంట్స్ అయినంత మాత్రాన మాపై మీకింత అధికారముందా? మీ గొప్పల కోసం మీరు లక్షలు లక్షలు కట్టి పెద్ద చదువులు చదివిస్తున్నారు .......... అమ్మ ఒడిలో పెరిగి నాన్న ప్రేమతో ఎదిగిన సంతానం నోటివెంట వినడం ఏ సంస్కృతికి మూలం? అర్ధం లేదు. ఆలోచిస్తే మనసు వికలమవుతోంది.
...................... బాబాయి కొడుకు పెళ్ళికి రా అంటుంది తల్లి. "అబ్బ, బోర్ నేను రాను" అంటాడు.
అమ్మమ్మ ఊరినుంచి వచ్చింది. రేపు వెళ్ళిపోతుంది. ఈరోజు సెలవే కదా అమ్మమ్మ దగ్గర ఉండు, సంతోషిస్తుంది అంటుంది తల్లి. "ఏంటి మమ్మీ హాలిడే అని నేను, నా ఫ్రెండ్సూ సినిమాకెళ్ళుతున్నాం. అమ్మమ్మతో కబుర్లేంటి - సుత్తి - నే వెళుతున్నా - స్కూటర్ స్టార్ట్ చేసింది ఇంటర్ చదువుతున్న అమ్మాయి".
ఏ పెళ్ళికీ, ఏ పేరంటానికీ, ఏ శుభ కార్యానికీ కుటుంబంతో కలిసి వెళ్లాలని, బంధువులను కలవాలని, ఆప్యాయతల్ని పంచుకోవాలని - ఉత్సాహంతో వస్తున్న యువత చాలా చాలా వరకు తగ్గింది.
దీనికి మూలం ఎక్కడ ..........
కళ్ళు మూసినప్పుడు దైవాన్ని ధ్యానంలోను, కళ్ళు తెరిచినప్పుడు
ప్రకృతిలోనూ చూడగలిగితే సాధన సార్ధకమైనట్లు
ఓం నమో భగవతే వాసుదేవాయ
సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు

కె.బి. నారాయణ శర్మ - నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.
2 కామెంట్లు:
due to busy life some are giving low priority and others are don't know the value/relationship of family members/relatives.
emi miss avutunnaamo ..okka chinna post lo bale cheppinaaru boss
కామెంట్‌ను పోస్ట్ చేయండి