1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

9, జులై 2013, మంగళవారం

Chakras.....

శరీరమంతా విశ్వశక్తి నిరాటంకంగా ప్రసరించేందుకు ఉపయోగపడేవి'చక్ర'లు. అరచేతి వేళ్ల చివర్లలో సైతం చక్రాలు వుంటాయి. అరచేతిలో రెండు చక్రాలుంటాయి. శరీరంలో 31 ప్రధానమైన చక్రాలు వుంటాయి. ఇవి కాక ప్రధానమైనవి ఏడు చక్రాలు.
బహిర్గతంగా వుండే చెడుశక్తుల నుంచి శరీరంలోని ప్రాణశక్తిని ఇవి కాపాడతాయి. రోగనిరోధక వ్యవస్థ చురుకుగాపనిచేసేందుకు ఈ చక్రాలే కారణం . ఇవి బలహీనపడితే వ్యాధులు ప్రబలుతాయి. ఏ భాగంలో వుండే చక్ర బలహీనపడితే అక్కడ 6వుండే శరీరభాగం దెబ్బతింటుంది. సాధారణంగా ఏ వ్యక్తిలోనైనా కేవలం రెండు లేక మూడు చక్రాలు మాత్రమే బాగా క్రియాశీలకంగా వుంటాయి. మిగిలినవి సాధారణస్థితిలో వుంటాయి. ఏయే చక్రాలు చురుకుగా వుంటే ఆ శక్తులు మరింత ఎక్కువగా పని చేసి కొన్ని రంగాలలో బాగా రాణిస్తారు.
శరీరంలో వుండే ఏడు ప్రధాన చక్రాలలో మొట్టమొదటిది మూలస్థానంలో వుంటుంది. మొత్తం ఈ ఏడు చక్రాలు శక్తి తరంగాలను శరీరంలోని నిరంతరం పంపటం ద్వారా జీవశక్తిని అందిస్తాయి. ఈ ఏడు చక్రాలలో ఏ ఒక్కటి పూర్తిగా పనిచేయకపోయినా మరణం తప్పదు.
కాలివేళ్ళుచేతివేళ్ళలో ఏడు చిన్న చక్రాలున్నాయి. ఏడు చక్రాలు శక్తిమయ దేహంలోవున్న ఏడు పొరలతో అనుసంధానం కలిగివుంటాయి. విశ్వంలోని విశ్వశక్తి
శరీరంలోకి ప్రవేశించేందుకు ఏడు ప్రధానచక్రాలు కూడా ముఖ ద్వారాలుగా వ్యవహరిస్తాయి. చేప శరీరంలో మొప్పలు ఏ విధంగా అయితే ఆక్సిజన్‌ను గ్రహించి శరీరానికి అందిస్తాయో ఈసప్త చక్రాలు కూడా విశ్వమంతటా ఆవరించివున్న విశ్వశక్తిని గ్రహించి భౌతిక శరీరానికి అందించటం ద్వారా శరీరాన్ని సజీవంగా నిలుపుతున్నాయి. చక్రాలు మూలస్థానం నుంచి చివరివరకు చూస్తే ఒక శంఖు ఆకారాన్ని పోలి వుంటాయి. చక్రం చివరి భాగం శరీరం బైటకు వుండి శక్తి మయ శరీరంలోని ఏదో ఒక అంశతో అనుసంధానాన్ని కలిగివుంటుంది. 

శరీరంలోని నేత్రాలుమెదడుహృదయంజీర్ణవ్యవస్థఎండోక్రైన్‌ వ్యవస్థజననాంగ వ్యవస్థలతో చక్రాలు సంబంధాన్ని కలిగివుంటాయి. భౌతిక శరీరం మనుగడ సాధించేందుకు ఇవి అత్యంత ఆవశ్యకాలు. ఏయే చక్రాలు అత్యంత క్రియాశీలంగా వున్నాయో తెలుసుకోవటం ద్వారా ఆ వ్యక్తి మూర్తిమత్వాన్ని పూర్తిగా అంచనా వేయవచ్చు. వ్యక్తిత్వ లక్షణాలనుప్రవర్తనా తీరును నిర్దేశించేవి ఆయా భాగాలకు అనుసంధానం చేయబడిన చక్రాలు. ఏదైనా 'చక్రబలహీనపడినట్టైతే సంబంధిత శరీరభాగం కూడా బాగా దెబ్బతింటుంది.
ఇది బాగా క్షీణ దశకు చేరుకున్న సమయంలో వ్యాధి రూపంలో భౌతిక శరీరంలో బహిర్గతమవుతుంది. నిజానికి వ్యాధి మూలం భౌతిక శరీరంలో వుండదు. సంబంధిత 'చక్ర'కు విశ్వశక్తిని అందించటం ద్వారా  రక్షణ వ్యవస్థను మరింత శక్తిమంతం చేస్తుంది. ఫలితంగా భౌతిక శరీరం వ్యాధిని నిర్మూలించటమే కాకుండా చురుకుగా పనిచేస్తుంది. 









కామెంట్‌లు లేవు: