యవ్వనాన్ని ప్రసాదించే అమృత ఫలం ఉసిరి
ఉసిరిక పండు వయస్థాపన, రసాయనంగా చెప్పబడినది. అనగా ముసలితనము యొక్క లక్షణములు రానీయకుండా శరీరమును దృడంగాను, పటుత్వముగాను, ఉంచి యవ్వన వంతునిగా ఉంచుతుంది. మధుమేహ రోగికి ఉసిరిక రసం లేదా ఎండబెట్టిన ఉసిరిక పండ్ల చూర్ణములో పసుపును కలిపి ఒక గ్రాము చొప్పున తేనెతో కలిపి ఇచ్చిన మధుమేహము తగ్గును.
ఉసిరి పండు : ఆయుర్వేదము నందు ఉసిరిక పండునకు అత్యధిక ప్రాముఖ్యతను ఇచ్చిరి. ఉసిరిక పండు వయస్థాపన, రసాయనంగా చెప్పబడినది. అనగా ముసలితనము యొక్క లక్షణములు రానీయకుండా శరీరమును దృడంగాను, పటుత్వముగాను, ఉంచి యవ్వన వంతునిగా ఉంచుతుంది. ఉసిరిక కాయలను ప్రతిరోజూ సేవించుట వలన శరీరములో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఏ వ్యాధులను దరి చేరనివ్వదు.
అమృతముతో సమానమైన గుణములు కలిగి ఉండుట వలన దీనిని అమృత ఫలమందురు. నేత్రములకు మంచిది. మధుమేహము, కుష్టం, మూలశంక, స్త్రీలలో కలుగు ప్రదర రోగం (అధిక ఋతుస్రావం), రక్తస్రావ రోగం మొదలగు వ్యాదులలో అత్యుత్తమముగా పని చేయును. ఇందు అధిక మాత్రలో విటమిన్ సి ఉండును.
ఉసిరిక పండ్లతో చేసిన అత్యంత బలకరమైన, ప్రాచుర్యమైన మందు చ్యవనప్రాశావ లేహ్యం. మధుమేహ రోగికి ఉసిరిక రసం లేదా ఎండబెట్టిన ఉసిరిక పండ్ల చూర్ణములో పసుపును కలిపి ఒక గ్రాము చొప్పున తేనెతో కలిపి ఇచ్చిన మధుమేహము తగ్గును. ఈ రెండు కలిసిన మందు 'నిశాఅమలకి' టాబ్లెట్ గా మందుల షాపులలో లభ్యమగు చున్నది.
ప్రదర వ్యాధులందు (స్త్రీలలో వచ్చు అధిక ఋతుస్రావం) ఉసిరికాయల చూర్ణమును చక్కెర లేదా తేనెతో లేదా బియ్యం కడిగిన నీటితో ఇచ్చిన తగ్గును.
మూత్రం ఆగిపోయిన యెడల ఉసిరిక చూర్ణమును బెల్లంతో కలిపి ఇచ్చిన మూత్రం మరల సాఫీగా జారీ అగును. ఉసిరిక చూర్ణమును ప్రతిరోజూ సేవిన్చినచో నేత్ర వ్యాధులు తగ్గును.
ఈ విధముగా ఉసిరిక శ్వాస, క్షయ, దగ్గు, ఆమ్ల పిత్తము మొదలగు వ్యాధులయందు కూడా పని చేయును. శుక్ర వృద్ధిని చేయును. జ్ఞాపక శక్తిని పెంపొందిన్చును.
డా.పి.బి.ఏ.వేంకటాచార్య
Thanks & Regards
S. Sreenivasa Prasad Rao
Smiling, Sharing, Loving, Caring and Helping are my five main weaknesses
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి