1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

22, ఆగస్టు 2013, గురువారం

కొబ్బరి చెట్టు.

కొబ్బరి చెట్టు.. చకచకా ఎక్కేస్తుంది.. కొబ్బరి కాయను చీల్చి తినేస్తుంది.. ఏంటో తెలుసా? పీత! ప్రపంచంలోనే పెద్దది!!

ఓసారి పీతను తల్చుకోండి. ఎంతుంటుంది? మహా అయితే అరచెయ్యంత అనబోతున్నారా? అయితే ఆగండి. ఏకంగా ఆరడుగుల పొడవుండే పీత ఒకటుందని తెలుసా! అదే కోకోనట్ క్రాబ్. మరి పేరులో కొబ్బరెందుకో వూహించగలరా? మహా పీత గారు చకచకా కొబ్బరి చెట్టెక్కేసి, అక్కడున్న కాయని చీల్చి మరీ తినేస్తుంది. దీనికుండే పది కాళ్లలో ముందరుండే రెండూ బలంగా, పొడవుగా, కత్తెరలాంటి కొండెలతో ఉంటాయి. వాటితో ఇది పచ్చి కొబ్బరి కాయ లోపలి కంటా చిల్లు చేసి, అందులో గుజ్జునంతా జుర్రుకోగలదు.

కొబ్బరి చెట్లు పెరిగే సముద్ర తీర ప్రాంతాల్లోనే బతికే ఇవి ప్రపంచంలోనే పెద్ద పీతలు. అందుకే ఒకోటీ ఆరడుగుల పొడవుతో ఏకంగా 17 కిలోల బరవు వరకూ పెరుగుతాయి. అన్నట్టు.. దీనికి మరో పేరు కూడా ఉంది. అదేంటో తెలుసా? దొంగపీత! దీన్ని ఆయా ప్రాంతాల వారు రాబర్ క్రాబ్ (Robber Crab) అంటారు. ఎందుకో తెలుసా? ఇవి తీరం దగ్గరుండే ఇళ్లు, గుడారాలలోకి దూరి చిన్న కుండల్లాంటి మట్టి పాత్రల్ని, మెరిసే వెండి వస్తువుల్ని ఈడ్చుకుని పోతుంది. ఎందుకో ఎవరికీ తెలీదు. బహుశా తినేవనుకుంటుందో ఏమో!

రాత్రి మాత్రమే సంచరించే వీటి జీవనం కూడా చిత్రమే. ఆడ పీతలు సముద్రంలో గుడ్లు పెడితే, అవి నీటిలో లార్వాలుగా మారతాయి. ఆపై అవి నీటి అడుక్కి చేరి వేరే జీవుల గుల్లల్లో చేరతాయి. దానంత ఎదిగాక ఇంకా పెద్ద ఆల్చిప్పలాంటి గుల్లను ఎంచుకుంటాయి. ఇలా కొంత కాలం అయ్యాక ఇక పూర్తిగా భూమి మీదకి వచ్చేస్తాయి. ఒక దశ వచ్చాక వీటి మొప్పలు, ఊపిరితిత్తుల్లాగా పనిచేయడంతో ఇక నీటిలో శ్వాసించలేవు. భూమ్మీదకి వచ్చాక కొబ్బరి చిప్పల్ని మోసుకుంటూ కొన్నాళ్లు తిరుగుతాయి. శరీరం గట్టి పడ్డాక దాన్ని వదిలేసి చకచకా విహరిస్తాయి. తీరాల్లో బొరియలు చేసుకుని, అందులో కొబ్బరి పీచును పరుచుకుని కాలక్షేపం చేస్తుంటాయి. కేవలం కొబ్బరి గుజ్జునే కాకుండా పళ్లు, ఆకులు, తాబేళ్ల గుడ్లని కూడా లాగిస్తాయి. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు వీటిని వండుకుని తింటారు. వీటి ధర కూడా ఎక్కువే.

 

 

ప్రశ్న:
పాముకి చెవులుండవంటారు. అయితే అవి వినగలవని విన్నాను. పాము పాలు తాగదంటారు కానీ దాని నోరు తెరిచి దారం ద్వారా పట్టడం గమనించాను. పాము కాటు వేస్తే ముంగిసకు విషం ఎక్కదా? వాటి పోరాటంలో పాము గెలవదా?

జవాబు:
పాముకి చెవులుండవంటే దానర్థం వినడానికి ఉపయోగపడే బాహ్య అవయవాలు దానికుండవని. కేవలం లోపలి చెవి భాగాల రూపాలుంటాయి కానీ అవి పని చేయవు. కేవలం పొట్ట చర్మం ద్వారానే పాములు శబ్దాలను గ్రహిస్తాయి. ఇక పగపట్టేంత తెలివి తేటలు, జ్ఞాపకశక్తి వాటికి లేవు. పాము నోటి నిర్మాణం ద్రవాలను పీల్చుకునేందుకు వీలుగా ఉండదు. అందుకే దారం ద్వారా పాలు పడతారు. ఇది దాని నైజానికి విరుద్ధం కాబట్టి పాలు పోస్తే వాటికి ప్రమాదం కల్గించినట్టే. విషపూరితమైన పాము కాటేస్తే ముంగిసకే కాదు, జంతువుకైనా విషం ఎక్కాల్సిందే. పిల్లీఎలుకల్లాగా పాము, ముంగిసలు ప్రకృతి సిద్ధమైన శత్రువులు కావు. అనుకోకుండా తారసపడితే గొడవపడవచ్చు. గొడవలో ఎవరికి పెద్ద గాయమైందనే విషయాన్ని బట్టి ఓసారి పాము, మరోసారి ముంగిస చనిపోవచ్చు. ఎక్కువ సార్లు ఇవి సర్దుకుని పారిపోతుంటాయి.

మనలో మూడు రకాల చెవులు కనబడతాయి -మనకు కనిపించే చెవినే బాహ్మచెవి అంటారు--కర్ణభేరి వెనకాల మధ్య చెవి వుంటుంది. ఇందులో మాలియస్, ఇన్కస్, స్టేపిస్ అనే మూడు చిన్న ఎముకల గొలుసు ఉంటుంది.స్టేపిస్ వెనకాల మొత్తని మృదులాస్థితో నిర్మించబడిన లోపలి చెవి కనిపిస్తుంది. దీనినే 'త్వచా గహనము' అంటారు.దీనినుండి బయలుదేరిన శ్రవణనాడి మొదడును చేరుకుంటుంది. శబ్ద తరంగాలను చేరవేస్తుంది. శబ్దాన్నే మనం వినగలుగుతాము.

పాములకు వెలుపలి చెవులులేవు . వెలుపలి చెవులు అదృశ్యమైన చోట 'కర్ణభేరీ రంధ్రం' అనే ఒక రంధ్రం ఉంటుంది. అది మధ్య చెవిలోకి దారితీస్తుంది. మధ్య చెవిలో 'కాలుమెల్లా ఆరిస్' అనబడే 'కర్ణస్తంభిక' అనే ఒక ఎముక ఉంటుంది. కర్ణస్తంభిక ఒకవైపు లోపలి చెవికి కలుపబడితే...మరో వైపు చర్మానికి కలిసి ఉంటుంది. పాము చర్మం నేలను తాకి ఉండడం వల్ల నేలలో ప్రయాణించే ధ్వని తరంగాలు మాత్రమే కర్ణస్తంభిక గ్రహించి లోపలి చెవికి చేరగలుగుతుంది. అందువల్ల నేలలోని తరంగాలు మాత్రమే అది గ్రహించగలుగుతుంది.గాలిలో తరంగాలు అది గ్రహించలేదు. గాలిలోని శబ్ద తరంగాలు అది ఏమాత్రం గ్రహించలేదు.నాగస్వరానికి ఊగుతున్న నాగుల్లా...అంటూ పడగవిప్పి నాగస్వరం ముందు ఆడే పాముల్ని చూపిస్తున్నారు అంతా అబద్ధమే. పాములవాడు నాగస్వరం ఊదేముందు నేలమీద చేతితో చరుస్తాడు. నేలద్వారా శబ్దతరంగాలు అందుకున్న నాగుపాము పడగవిప్పుతుంది.దాని కళ్ళముందు వస్తువు ఊగుతూ కనిపిస్తోంది. అది ఆగిన వెంటనే దానిని కాటు వేయాలని పాము చూస్తుంది. అందుకే అది ఎటు ఊగితే నాగుపాము పడగ అటు ఊగుతుంది. అంతేకానీ... నాగ స్వరానికి తల ఊపి ఆడడం మాత్రం కాదు.నాగస్వరం కాకుండా ఏది దానిముందు ఊపినా పడగ తప్పకుండా ఊపుతుంది. గుడ్డ చేతితో ఆడించి చూపినా పాము పడగ ఊపుతూనే వుంటుంది. నాగస్వరమే ఉండనక్కరలేదు. నాగస్వరానికి నాగుపాము తలాడించడం అంతా వట్టిదే. నేలపై తరంగాలను మాత్రమే గుర్తించగలదన్నది నిజము .

అందుకే...అతి సున్నితమైన శబ్దాన్ని వినగలిగిన సామర్థ్యమున్న వాళ్ళని ఇప్పటికీ ''పాముచెవులు'' వున్న వాళ్ళని అంటారు. కనుకనే ''పాముచెవులు'' అనే మాట ప్రసిద్ధి చెందింది.

 

 

 

నిద్రలో లేచి నడుచుకుంటూ వెళ్ళే వారున్నారు ... అయితే వారు అలానడిచి వెళుతున్న విసయము వారికి తెలియదు . 6 నుండి 12 సంవస్తరాలు వయసు పిల్లలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది . పిల్లల లో అప్పుడప్పుడు మాత్రమే ఇలా నిద్ర నడక రావడానికి కారణం -

  • 'అలసటతో' వచ్చే మొద్దు నిద్ర .
  • నిద్రలేమి తో భాదపడే వారిలో ,
  • వత్తిడికి గురైన వారిలో ను ,

విశ్రాంతి తీసుకోవలసిన సమయం లో కుడా మెదడు భాగాలు ఉత్తేజ భరితం గా ఉన్నందున నిద్రలో నడుస్తారు. కొందరిలో మాత్రమే వ్యాది వంశ పారంపర్యము గా వస్తుంది . పెద్ద వారిలోనూ అలవాటు ఉంటుంది ,

 

 

ప్రశ్న: కనురెప్పలను తరచు ఆర్పడం మూలంగా ఉపయోగమేంటి?
-
ఆరెస్సార్ మీనాశ్రీ, విజయవాడ
జవాబు: కంటి రెప్పలను ఆర్పడమనేది ఒక విధంగా మన ప్రమేయం లేకుండా అసంకల్పితంగా జరిగే ప్రక్రియ. మన అవయవాల్లో కన్ను చాలా ప్రధానమైనది. సున్నితమైనది. రెప్పలు తరచు ఆర్పడం వల్ల వాతావరణంలోని దుమ్ము, ధూళి, సూక్ష్మక్రిముల నుంచి కంటికి రక్షణ కలుగుతుంది. కంటి రెప్ప పడినప్పుడల్లా సన్నటి నీటి తెర కనుగుడ్డును శుభ్రపరుస్తుంది. కంటి లోపల ఉండే చిన్న గ్రంథుల్లో నుంచి స్రవించే నీటినే మనం కన్నీరు అంటాం. నీటితెర దుమ్ము, ధూళి కణాలను బయటకు నెట్టివేస్తుంది. కంటి మీదకు పడే సూక్ష్మమైన అవాంఛిత కణాలను కంటి కలికిలోకి చేరే విధంగా కంటి కదలికలు తోడ్పడుతాయి.

 

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


ప్రశ్న: వృత్తాన్ని ఎందుకు 360 డిగ్రీలుగా విభజించారు?

-
కె. రమణారావు, 10 తరగతి, కోరుకొండ

జవాబు: ప్రస్తుత కాలంలో మనం దశాంశ పద్ధతి (Decimal System)ను వాడుతున్నట్టే, బాబిలోనియన్లు 3000 సంవత్సరాల క్రితం షష్టిగుణక పద్ధతి (hexagesimal system)ను అనుసరించేవారు. పద్ధతిలో గణిత సంబంధిత సంఖ్యలన్నీ 6 చేత గుణించబడి ఉండాలి. ప్రకారం సంవత్సర కాలాన్ని 360 రోజులుగా, రోజును 24 గంటలుగా, రోజులోని గంటను 60 నిమిషాలుగా, నిమిషాన్ని 60 సెకన్లుగా, నెలను 30 రోజులుగా, సంవత్సరాన్ని 12 నెలలుగా విభజించారు. రాశి చక్రం సంజ్ఞలు కూడా పన్నెండే. ఇవన్నీ 6 గుణకాలే.

బాబిలోనియన్ల అంచనా ప్రకారం భూమి, గ్రహమండలం (zodiac)గుండా 360 రోజులు వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తుంది. అందువల్ల వృత్తాకారాన్ని 360 భాగాలుగా విభజించారు. ఒక్కో భాగం ఒక డిగ్రీ. అంటే భూమి గ్రహమండలంలో ఒక రోజుకు ఒక డిగ్రీ వంతున పరిభ్రమిస్తుంది. 60X6=360 కాబట్టి ఒకో డిగ్రీని 60 భాగాలుగా (ఒకో భాగం మినిట్), ఒక మినిట్ను 60 భాగాలుగా (ఒకో భాగం సెకండు)గా విభజించారు. త్రికోణమితిలో తరచూ ఉపయోగించే కోణీయ రూపకాలైన డిగ్రీలన్నీ ఆరు గుణకాలే. ప్రాథమిక భౌతిక రాశులైన పొడవు, ద్రవ్యరాశులు చాలా కాలం కిందటే దశాంశ పద్ధతి (మెట్రిక్)లోకి మార్పు చెందినా, ఇప్పటికీ కాలం (టైమ్) కొలతలు మాత్రం షష్టిగుణక పద్ధతిలోనే కొనసాగుతున్నాయి.

 

టీ షర్ట్ ఎలా పుట్టిందో ?, T-Shirt Origin Story?

  •  

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi_xGUvd-hm03YocPUMf1SuNiudrLHzfeY4Z_mbsYpP_LMyk7g1P1nJ-Sq-36Z4o7Weuz4pDNsP6DsVxy2PjaG5Dt6mwM114nQfl4tj5SB0_UY3r_9F-L4q16EE6aYMR2OFE1EeBP5tLos4/s400/T-Shirt---------.jpg

  •  


రంగు రంగుల టీషర్ట్స్ వేసుకొని షోగ్గా తిరగాలని మనందరికీ చాలా సరదా. మామూలు చొక్కాల కన్నా టీ-షర్ట్స్ చాలా ఫ్యాషన్‌గా ఉంటాయి. సౌకర్యంగా ఉంటాయి. మరి ఇవి ఎలా తయారయ్యాయి?
టీ షర్ట్ గురించి తెలుసుకోవాలంటే మొదటి ప్రపంచ యుద్ధకాలానికి వెళ్ళాలి. అప్పట్లో యూరోపియన్లు టీ-షర్ట్స్ వంటి లోదుస్తులను ధరించి యుద్ధం చేస్తుంటే అమెరికన్లు మాత్రం దళసరి యూనిఫాంలు ధరించి యుద్ధం చేసేవారు. కాని యూరోపియన్లు హాయిగా ఉంటే అమెరికన్లు చెమటలు కక్కుతూ ఉండేవారు. దాంతో కొన్నాళ్ళకు అమెరికన్లు కూడా టీ-షర్ట్స్ వైపే మొగ్గు చూపారు. దాంతో ఒక్కసారిగా టీ-షర్ట్స్‌కు డిమాండ్ పెరిగిపోయింది. చూడ్డానికి ఇంగ్లీషు 'టీ' ఆకారంలో ఉంటుంది. కనుక వీటికి టీ-షర్ట్స్ అనే పేరు వచ్చింది. 1960 నుంచి వీటి మీద డిజైన్లు, బొమ్మలు ముద్రించడం లేదంటే స్లోగన్స్ రాయడం మొదలయ్యాయి. ఇప్పుడు మనం చూస్తుంటాం. కొన్ని ఉద్యమాలప్పుడు అందరూ టీ-షర్ట్స్ మీద నినాదాలు రాసుకొని తిరుగుతుంటారు. అలా ఇవి ప్రచారానికి కూడా ఉపయోగపడే సాధనాలయ్యాయి. మాజీ అమెరికా ప్రధాని క్లింటన్‌కు టీ-షర్ట్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఆయన ధరించే అత్యుత్తమ నాణ్యత కలిగిన టీ-షర్ట్స్ ఎక్కడ తయారవుతాయో తెలుసా? మన హైదరాబాద్‌లో.

ఇప్పుడు తెలిసిందా రోజూ మనం వేసుకునే టీ-షర్ట్స్ ఎలా వెలుగులోకి వచ్చాయో. మాజీ అమెరికా ప్రధాని క్లింటన్‌కు నచ్చే టీ-షర్ట్స్ మన హైదరాబాద్ నుంచి తయారవుతున్నాయంటే మన కెంతో గర్వకారణం కదా. ఎవరైనా అడిగితే మనం ఠక్కున చెప్పవచ్చు.

క్యాలెండర్ కదా ఏమిటి? , Story of Calendar

  •  

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj_40ZJ_U9hjW3ejZkFrmCMuLpCHtaaBoQxyTmp5EBkIsZh8s3b9-6LWSYj1Sa6vqelTsTWtFQWV1GIm4d9jJyRvKxuROCfdqBV7qlKBLiKFm8_VAGCQLqc4ACwVlGoZFyORj06UeDXY1JW/s400/Calendar+telugu.jpg https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjo8nntHBQPEpipQeSHz1GOnVvytsvrwIuFL2EfBt9v7vLlVw6wk5Z-dsNc-i-FyEPrAnIl0oFyJKOPG3lnGQG11TZ-SdSiT5sUWmebdRlfYwncsRlna2mUxeILEx69PWPQ7qKiZLVOX4cV/s400/Calendar+English.jpg

  •  

ఈనాటి క్యాలండర్ కి తోలిరుపాలు ఏవని చూస్తే ముఖ్యము గా రోమన్ , ఈజిప్టు , గ్రేగేరియక్న్ విధానాల గురించి చెప్పుకోవాలి . 

రోం సామ్రాజ్యాన్ని పాలించే రోమన్ చక్రవర్తి కాలం లో ఏడాదికి 304 రోజులుగా నిర్ణయించారు . వీటిని పది నెలలు గా విభజించారు . అప్పట్లో మార్చి తో కొత్త ఏడాది ప్రనంభంయ్యేది . తర్వాత క్రీస్తుపుర్వము ఏడో శతాబ్దము దగ్గరికి వస్తే రోమ్ ని పాలించిన "సుమా పామ్పిలియాస్ " ఏడాదిని 12 నెలలు గా విభజించాడు . రోజుల సంఖ్య ఏడాదికి 354 రోజులు గా చెప్పాడు . అయితే సరిసంఖ్యలు శుభకరం కావనే నమ్మకం తో ఒక రోజును కలిపి ఏడాదికి 355 రోజులు గా నిర్ణయించారు .

క్రీస్తు పూర్వము 153 లో ఏడాది ప్రారంభాన్ని మార్చి నుంచి జనవరికి మార్చారు . కాని చంద్రుడి గమనము , సూర్యుడు గమనము ప్రకారము చుస్తే ఏడాదికి రోజుల లెక్కల్లో తేడాలు ఉండేవి . గందరగోలాన్ని సవరించడానికి రోమన్ చక్రవర్తి " జూలియస్ సీజర్ " ప్రయత్నించారు . క్రీస్తు పూర్వము 46 లో ఈజిప్టు వెళ్ళిన ఆయన అక్కడ ఏడాది విభజించిన విధానాన్ని తెలుసుకుని రోమ్ లో అమలు చేశాడు . దాని ప్రకారము ఏడాదికి 265.25 రోజులు గా లెక్కగట్టారు . జనవరి , మార్చి , మే , జూలై , ఆగష్టు , అక్టోబర్ , డిసెంబర్ , నెలలకు 31 రోజులుగా ... ఏప్రిల్ , జూన్ , సెప్టెంబర్ , నవంబర్ నెలలకు ౩౦ రోజులుగా ఫిబ్రవరి నెలకి28రోజులుగా నిర్ణయించారు . అయినా పావురోజు మిగిలిపోయింది . . దాన్ని నాలుగేళ్ల కొకసారి ఫిబ్రవరి కి కలపాలనుకున్నారు . (లీపు సంవత్సరమన్నమాట) . ఇదే జూలియస్ క్యాలెండర్ .

అయితే సీజర్ తర్వాత క్యాలన్డర్ల రూపకర్తలు తప్పుగా అర్ధం చేసుకుని ముడేల్లకోసారే ఫిబ్రవరికి ఒకోరుజును కలిపేయడం మొదలెట్టారు . ఇది క్రీస్తుశకము 8 వరకు కొనసాగింది . దేన్నీ గమనించిన అగస్తస్ అనే చక్రవర్తి అంతవరకూ జరిగిన తప్పును సరిదిద్దడానికి నాలుగేళ్ళకు ఒకసారి ఒకరోను కలిపే పద్ధతిని ఆపించాడు . పై క్రీస్తుశకము 567 లో తిరిగి కొత్త సంవత్సరాన్ని మార్చి కి మార్చేశారు .

తర్వాత రోజుల్లో లెక్కలో కచ్చితత్వము పెరిగి ఏడాదికి " 365.242199 రోజులు గా గుర్తించారు . ఇందువల ఏడాదికి 11 నిముషాల 14 సెకనులు వంతున తేడా వస్తు క్రీస్తుశకం 1572 మచ్చేసరికి ఏకంగా 10 రోజుల పాటు క్యాలెండర్ లెక్క తప్పింది . దీన్ని " 13 పోప్ గ్రెగొరీ " సరిదిద్దించారు . అయిన ఏటా .0078 రోజుల తేడా తప్పలేదు . అందువల్ల ప్రతి 400 ఏళ్ళకి లీపుసంవత్సరాని వదలివేయాలని నిర్ణయించారు . అందువల్లే 400 తో భాగించబడే శతాబ్ది సంవత్సరాలకే తీపు నిబంధన ఉండాలనే సవరింపు వచ్చింది . కాబట్టే 1700 , 1800 , 1900 , మామూలు సంవత్సరాలే .. 2000 మాత్రము లీపుసంవత్సరము .. అలాగే కొత్త సంవత్సరము జనవరి తో ప్రారంభ మవ్వాలని నిర్ణయించారు .

క్రీస్తుశకము 1582 లో అమలులోకి వచ్చిన గ్రెగోరియన్ క్యాలందరే ఇప్పటి మన క్యాలెండర్ కి నాంది .

 

 

Monday, November 01, 2010

కొబ్బరి నీళ్ల రహస్యమేంటి? , Secret of Coconut water?

  •  
  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhSQheDDX6SEIS8fabfbp6BjeqG5mH5EdgMgh5s1Giu_eFpfwJsj5E3nEPqedbs9xmKAmn6cEVZKDemXk_c08UH2JjTduKPE0VT-IM-CxR6EDxTtDYCw2757RvRudJ-T6XJav9Fn96EP28i/s400/CoconutWate.jpg
  •  



ప్రశ్న: కొబ్బరి నీళ్లు శరీరానికి మేలు చేస్తాయంటారు. ఎందువల్ల?

-
ఎమ్. సీత, 10 తరగతి, కొండపల్లి (కృష్ణా)

జవాబు: కొబ్బరి నీళ్లు నిజానికి కొబ్బరి మొలకల ఎదుగుదలకు కావలసిన ఆహారాన్ని ద్రవరూపంలో అందించడానికి ఏర్పడినవి. పారదర్శకంగా ఉండే తీయని కొబ్బరి నీళ్లలో నూనె, చక్కెర, నీరు, విటమిన్లు, పొటాషియం, భాస్వరం, సెలీనియం లాంటి పోషక పదార్థాలతో కూడిన ఖనిజ పదార్థాలుంటాయి. నీళ్లు తాగితే ఇవన్నీ శరీరానికి అందినట్టే. కొబ్బరి కాయ ముదిరే కొద్దీ లోపల ఉండే కొబ్బరి నీళ్లను పీల్చుకుంటుంది. అందువల్లనే ముదురుకాయలో కన్నా లేతకాయలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నీరు క్రిమిరహితమైన పరిశుభ్రమైన ద్రవం కావడంతో వాటిని తాగడం మంచిదని వైద్యులు చెబుతుంటారు. సాధారణంగా రక్తస్రావం ఎక్కువై శరీరంలోని సీరం చాలా తక్కువైన సందర్భాల్లో వైద్యులు కొబ్బరి నీళ్లను తాగమని సూచిస్తారు. మూత్రపిండ వ్యాధులున్నవారికి, వాంతులవుతున్నవారికి, రక్తపీడనం ఎక్కువగా ఉన్నవారికి, చర్మం పొడిబారిపోయి ముడతలు పడుతున్నవారికి, గ్లూకోమాలాంటి కంటి జబ్బులున్నవారికి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి.

-
ప్రొ||.వి. సుబ్బారావు, హైదరాబాద్

ఆడవాళ్లకు బట్టతల రాదేం? , Bald-head not seen in women-Why?

  •  

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhxf7VWI4KRo8mLbjAfB8eoX5gDxSQz078zxXKpFoidK6M6g-sbRQ32hYi9hh4r_3naMFd-yjQ8x1SqrQUxPHLhYuO8H57jufcU1URXseOyNpj74GnLL-XY0Q9wIRt59LX3SsLOEwqZ6GIJ/s400/women+hair.jpg https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiu3HIn4vnwB8hCOAm_S5Xe_XAQ99UVOTeqSxopLcxX-zhy_pxgJ1ZSo9NAle6iuJtK_RK4ZEUwpzttRT5AZtP_8sMblFQryvXbdUiG0ttJyhZfk4WUbZWWzC6gZzuXHzY4yjhg98GuJizP/s400/Hair+growth.jpg

  •  


ప్రశ్న: పురుషులలో బట్టతల వస్తుంది కానీ, స్త్రీలలో రాదు. ఎందుకని?

జవాబు: అత్యంత ప్రాధాన్యత ఉన్న మెదడు ఉండేది మన తలభాగంలోని కపాలం లోపల కాబట్టి, పరిణామ క్రమంలో భాగంగా తలపై వెంట్రుకలు పెరిగాయి. పరిసరాలలోని వాతావరణ పరిస్థితుల నుంచి ఇవి కొంత రక్షణ కల్పిస్తాయి. అయితే పరిమాణ క్రమంలో వచ్చిన మార్పుల వల్లనే వెంట్రుకల ప్రాధాన్యం కూడా బాగా తగ్గింది. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ వెంట్రుకలు లేని బట్టతల ఏర్పడ్డం మొదలైంది. అయితే దీనికి ఎక్కువగా జన్యువులు (genes), వంశపారంపర్యత (hereditory charecteristics) కారణమవుతున్నాయి. అలాగే లైంగిక హార్మోన్ల ప్రభావం కూడా ఉంటుంది. పురుషులలో యాండ్రోజన్‌ హార్మోను ఎక్కువగా ఉండడం వల్ల వయసును బట్టి వారిలో పురుష విశిష్ట లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. స్త్రీలలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఎక్కువ కాబట్టి స్త్రీ విశిష్ట లక్షణాలు కలుగుతాయి. హార్మోన్ల మోతాదులో తేడాల వల్లనే స్త్రీలకు బట్టతల సాధారణంగా ఏర్పడదు.

 

 

Wednesday, June 22, 2011

చదువుతుంటే నిద్రొస్తుందేమి?, Why do we get sleep while reading?

  •  
  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjd_rfLF5lFCDZMmDsSu7ZrcYXpZtVfQJBOfUfu9Y_D3vCax9qDLocGt5pJEHDqQd-t0aZQNkQIzE7jxnLGDSLgApxBSnN9NXYHJd1OSPGvKGW6v4e-rrTBrAckiZKjNJZuJdFhD3yIYmfx/s400/Sleeping+while+reading.jpg
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : చదువుకుంటున్నప్పుడు మనలో చాలా మందికి నిద్ర వస్తుంది . ఎందుకని?.

రాము . . దేశిల్ల వీధి -శ్రీకాకుళం టౌన్.

: చదివేటపుడు నిద్ర రావడమనేది మనము భంగిమలో ఉన్నాము ... ఎంతసేపు ఉన్నాము అనే దానిమీద ఆధారపడి ఉంటుంది . చదివేటప్పుడు శరీర కదలికలు తక్కువగా ఉండటం వలన కండరాలకు ప్రవహించే రక్తము తగ్గుతుంది . దాని ములాన కండరాలలోని జీవకణాలలో దహనచర్య (combustion) మందగించి " లాక్టిక్ యాసిడ్ " అనే ఆమ్లము తయారవుతుంది . ఆమ్లము ప్రాణవాయువైన ఆక్షిజన్ ను అతిగా గ్రహిస్తుంది . . దాంతో దేహములోని రక్తానికి కావలసిన ఆక్షిజన్ లో కొంత తగ్గుదల వస్తుంది . ఆక్షిజన్ తగినంతగా లేని రక్తం మెదడులోకి ప్రవహించడం వల్ల మగతగా , నిద్ర వస్తున్నట్లుగా ఉంటుంది . అందుకే చదివేటపుడు ఒకే భంగిమలో ఉండిపోకుండా అప్పుడప్పుడు అటు ఇటూ కదలడం , ఏకుబికిన చదవకుండా మధ్యలో కాస్త విరామము ఇవ్వడం చేస్తే నిద్ర రాదు 

 

సింగినాదం జీలకర్ర అని ఎందుకంటారు ?, Why some say singinadam jeelakarra?

  •  
  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiFm6Hs3HZa-bjDj7ASOO6NRTBhsuU08C7-cRs6qCZ_G0XhBJVwfgKDZLNDhnr1ohnSPASxjwaNI7hCo7pG9x7EYY3rlvFcxoRzfF0hR5OCEGEXqMtxROm4UAxEqQUIYEB1Q19GIwQkiLHc/s400/Siginadam+jeelakarra.jpg
  •  

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

సింగినాదం జీలకర్ర - ఒకప్పుడు జీలకర్ర వర్తకులు తమ రాకకు గుర్తుగా శ్రుంగనాదం (కొమ్ము బూర) ఊదేవారు.పాతకాలములొ జీలకర్ర వర్తకులు పడవలో వేసుకుని పడవలో కాలువలో వెళుతూ,ఏదైనా ఊరు వచ్చినప్పుడు బూర ఊదేవారట. అది విని కావలిసినవారు జీలకర్ర పడవ వచ్చిందని తెలుసుకొని కొనుక్కోవటానికి వెళ్ళేవాళ్ళు.

దీన్ని ఆసరాగా తీసుకుని దొంగలు కూడా బూర ఊది, వచ్చిన జనాల్ని దోచుకునేవారు. విధంగా శ్రుంగనాదం-జీలకర్ర వొకటయ్యాయి. కాలక్రమాన, శ్రుంగనాదం-జీలకర్ర కాస్తా సింగినాదం జీలకర్రగా వాడుకలో మారిపొయింది. ఇలా నిజమో అబద్ధమో తెలియని మాటలను సింగినాదం జీలకర్ర అని కొట్టి పారవేస్తుంటారు.

 

 

 

 

అసురులు తాగేది శురాపానం, దేవతలు తాగేది సోమపానం

అసురులు తాగేది శురాపానం, దేవతలు తాగేది సోమపానం (యజ్ఞంలో ఇచ్చేది సోమపానం).. సురాపానం తగినవారికి పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి అని శాస్త్రం!అది ఎలాగో క్రింద చెప్పబోయే ఇతిహాసం చుస్తే తెలుస్తుంది!

సృష్టి ప్రారంభం అయిన తరువాత ఒకసారి దేవతలకి, అసురులకి యుద్ధం జరిగింది! యుద్ధంలో దేవతలు అసురులని చంపుతున్నారు! కానీ అసురులు మళ్లి దాడులు చేస్తున్నారు ఇలా కొన్నాళ్ళు జరిగింది! అయితే దేవతలకి అనుమానం కలిగింది! ఇదేంట్రా బాబు మనం సంహరిస్తుంటే మల్లి బ్రతికి వస్తున్నారు! అసలేం జరుగుతుంది అని ఆరా తీస్తే రాక్షస గురువు శుక్రాచార్యుడు సంజీవిని మంత్రంతో బ్రతికిస్తున్నాడని తెలిసింది! అప్పుడు దేవతలు వెళ్లి బ్రహ్మకి మొరపెట్టుకుంటే బాగా అలోచించి దీనికి ఒకటే విరుగుడు ఉంది! మీలో ఎవరైనా శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్లి సంజీవని మంత్రం నేర్చుకోండి.. అనగానే దేవతలు భయపడి అయ్యబాబోయి శుక్రాచార్యుడ రాక్షస గురువు అయన! మనమంటే నేర్పడు! కాబట్టి ఇంకో మార్గం అలోచించి చెప్పండి అన్నారు! అయితే మీరు వెళ్లి బృహస్పతిని కలిసి విషయం నేను చెప్పానని చెప్పండి అనగానే దేవతలంత వెళ్లి బృహస్పతిని కలిసి విషయం చెప్పారు! బృహస్పతి అలోచించి తన కొడుకుని పంపిస్తానన్నాడు! దేవతలు సంతోషించి వెళ్ళిపోయారు! తరువాత బృహస్పతి తనకోడుకుని శుక్రాచార్యుడు దగ్గరికి వెళ్లి విద్య అభ్యసించి రమ్మన్నాడు! కొడుకు తన తండ్రికి వినయంతో నమస్కరించి వీడ్కొని శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు! గుమ్మం దగ్గర శుక్రాచార్యుడు కుమార్తె దమయంతి కుర్చుని ఉంది! ఇతనిని చూడగానే కళ్ళు రెపరెపలాడిస్తూ అందం చూసి మురిసిపోయి సిగ్గుపడి కుడికాలి బొటనవ్రేలు నేలపై రాస్తూఉంది! అది గమనించి నేను గురువుగారిని చూడటానికి వచ్చాను! ఎక్కడున్నారో తెలుపండి! దమయంతి సిగ్గుపడి లోపలున్నాడని చెప్పి సిగ్గుపడుతూ చెంగు చెంగు మంటూ ఎగురుకుంటూ వెళ్లి తండ్రి చాటున దాగి ఇతనినే చూస్తూ ఉంది! ఇదేమి పట్టించుకోకుండా వెళ్ళగానే గురువుగారిని చూసి వినయంగా నమస్కరించి నేను బృహస్పతి తనయుడిని, మీ వద్ద విద్య అభ్యసించాలనే అభిలాషతో మీ దగ్గరికి వచ్చాను! మాట విన్న శుక్రాచార్యుడు ఓహో నువ్వు బృహస్పతి కొడుకువా! మీ తండ్రి గారు ఉత్తములు! గొప్పవాడు! ఆపైన దేవతలకి గురువు అలాంటి బృహస్పతి కొడుకు నాదగ్గర విద్య కోసం వచ్చినందుకు సంతోషం నాయానా! తప్పకుండా నేర్పిస్తాను!

ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏంటంటే? శత్రువుని అయిన తన దగ్గరికి ఆదరించాలి! విద్య అనేది తన పర భేదం లేకుండా నేర్పించాలి! శత్రువు ఎంతటి వాడైన తన గుణ గణములు పొగడవలసిందే! అలాగే నిజం దాచకుండా ఎక్కడ నుంచి ఎందుకు వచ్చామో అన్ని చెప్పడం వల్ల మనమీద అభిమానం ఇంకా పెరుగుతుంది! అలాగే అవసరం అనుకుంటే ఎవరినైనా (మనకంటే ఎక్కువా కావచ్చు, తక్కువా కావచ్చు) ఆశ్రయించాల్సిందే!

 

అలా ఒక 1000 సంవత్సరాలు పాటు గురు సుశ్రుష చేసుకుంటూ విద్యలు అభ్యసిస్తూ ఉన్నాడు! మరి రాక్షసులు ఊరుకుంటారా? (మనలోనే కొందరు బాగుపడుతున్నారంటే కొందరు చూసి ఓర్వలేక ఎలాగైనా పడుచేయాలని చుస్తున్నారుకదా! వారుకూడా రాక్షస జాతిలోని వారే).. అప్పట్లో ఒక నియమం ఉండేది! విద్య నేర్చుకోవాలంటే గురువు చెప్పిన పని ఏదైనా సరే చేయాలి ఆరోజుకి విద్య చెప్తారు! ఎందుకంటే గురువు దగ్గరే ఉంటారు శిష్యులు! అన్ని పనులు పూర్తీ చేశాక విద్యాబ్యాసం మొదలు పెడతారు! ఉదయం అవులని మేపడానికి అడవికి వెళ్ళాడు! అక్కడ రాక్షసులు వీడిని పట్టుకొని చంపి శవాన్ని చెట్టుకి కట్టేశారు! సాయంత్రం అయ్యింది! దమయంతి గుమ్మం దగ్గర కుర్చుని వస్తాడు నారాజు అని ఎదురు చూస్తుంది! ఆవులు వచ్చాయి కానీ ఇతను రాలేదు! చాలాసేపు ఎదురుచూసింది చీకటి పడుతుంది కానీ రావడంలేదు! అప్పటికే రాక్షసులమీద దమయంతికి ఏదైనా చేస్తారేమో అని అనుమానం ఉంది! ఏడ్చుకుంటూ వెళ్లి నన్నారు ఆయన రాలేదు అని ఏడుస్తుంది! వస్తాడులేమ్మ అని ఒదారుస్తుంటే! ఆవులు అన్ని వచ్చేశాయి కానీ అయన రాలేదు! వీళ్ళు ఆయన్ని ఏదైనా చేశారేమో నాన్న అని మళ్ళి మళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తుంటే చూడలేక శుక్రాచార్యుడు కళ్ళు మూసుకొని మొత్తం వెతికాడు! అడవిలో ఒకచోట రాక్షసులు వీడిని చంపడం, చంపి చెట్టుకి కట్టేయడం అంతా తన మనోనేత్రం తో చూసి ఎంతపని చేశారు అని సంజీవనిని పిలిచి బ్రతికించి తీసుకుని రామన్నాడు! సంజీవని స్త్రీ రూపు దాల్చి చంపి చెట్టుకి కట్టేసిన చోటికి వెళ్లి బ్రతికించి తీసుకొచ్చింది! దమయంతి తండ్రిని కౌగలించుకుని కృతజ్ఞతలు చెప్పి ఇతనిని చూసి సిగ్గుపడుతూ లోపలి వెళ్ళింది! శుక్రాచార్యుడు జాగ్రత్త నాయన వీళ్ళు అసలే మంచోళ్ళు కాదు ఎంత చెప్పినా రాక్షస బుద్ది ఎక్కడికి పోతుంది! బయటకి వెళ్ళినపుడు జాగ్రత్తగా ఉండు అని అయన పనిలో అయన మునిగిపోయాడు! ఇలా ఇంకొన్నాళ్ళు గడచిన తరువాత రాక్షసులు అరేయ్ వీడు అసాధ్యుడిలా ఉన్నాడు! గురువుగారిని వదిలిపెట్టడంలేదు! ఎలాగైనా సంజీవని మంత్రం నేర్చుకోకుండా వెళ్ళేల లేడు! అని బాగా అలోచించి ఒకనాడు ఇతను అవులని తీసుకొని అడవిలోకి వెళ్ళినప్పుడు రాక్షసులు అంతా ఒరేయ్ వీడిని చంపి వదిలేస్తే మళ్లి బ్రతికిస్తున్నాడు కాబట్టి ఈసారి కాల్చి బూడిద చేద్దాం అని చంపి భూడిద చేశారు! మళ్లి రాక్షసులకి ఒక సందేహం వచ్చింది ఒరేయ్ ఇలాకాదు కానీ బూడిద తీసుకొని గురువు గారు తాగే సురలో కలిపేద్దాం అని బూడిద తీసుకెళ్ళి సురాపానం ఉన్న పీపాలో సురలో కలిపేశారు! సాయంత్రం అయ్యింది ఆరోజు శుక్రాచార్యుడు రోజు తాగే సురకంటే ఎక్కువ తాగి ఊగిపోతున్నాడు! రోజు ఒక పీపా తాగితే ఆరోజు 6పీపాలు తాగాడు! దాంతో మైకం ఎక్కువ కమ్మింది! మళ్లి అదే సంఘటన! దమయంతి తండ్రి దగ్గరికి వచ్చింది నన్నారు అయన రాలేదు! అని వలవలా ఏడ్చింది! శుక్రాచార్యుడు ఊగిపోతూ వస్తాడులేమ్మా అని తూలిపోతూ మాట్లాడుతున్నాడు! దమయంతి కూడా ఇంకా ఎక్కువగా ఏడవడం మొదలెట్టింది! శుక్రాచార్యుడు తూలిపోతూనే అంతా వెతకడం ప్రారంబించాడు! అడవిలో ఎక్కడ కనపడలేదు! ఎక్కడా కనపడలేదని అన్ని లోకాలు గాలించాడు అయిన కనపడలేదు! శుక్రాచార్యుడుకి క్రమంగా మైకం తగ్గడం మొదలయ్యింది! ఏంటి వీడు ఎక్కడ వెతికినా కనపడలేదు అని సందేహం వచ్చి తన ఉదరంలో చూశాడు! ఇంకేముంది బూడిద రూపంలో కడుపులోకి వెళ్ళిపోయాడు! మైకం దెబ్బకి దిగింది! ఒక్క క్షణం పాటు ఆశ్చర్యపోయాడు! జరిగిందంతా మనోనేత్రంతో చూసాడు! ఎంతపని చేసారు అనుకున్నాడు!దమయంతికి విషయం చెప్పాడు! భోరు భోరున ఏడ్చి ఎలాగైనా బ్రతికించమని ప్రదేయపడింది! కుదరదు అన్న వినలేదు! పట్టుపట్టింది! సరే అని తన ఉదరంలో ఉన్న శిష్యుడిని బ్రతికించాడు కానీ బయటకి తీసుకురావాలంటే కుదరదు ఎలా? బాగా అలోచించి శిష్యుడితో నాయనా నీకు ఇలా జరిగి ఉండకపోతే నీకు జీవితంలో ఎప్పటికి మృత సంజీవనిని నేర్పించేవాడిని కాదు! కాని తప్పడంలేదు! నువ్వు రాకపోతే మా అమ్మాయి ఊరుకోదు! విద్య తెలియకుండా నువ్వు బయటికి వచ్చావా నేను చచ్చి పోతాను! కాబట్టి నువ్వు బయటికి వచ్చిన వెంటనే నన్ను బ్రతికించు అని మృత సంజీవని విద్య విద్య నేర్పించాడు! అది నేర్చుకుని శుక్రాచార్యుడు ఉదరం చీల్చి బయటకి వచ్చి గురువు గారిని బ్రతికించాడు!

శుక్రాచార్యుడు శిష్యుడిని మెచ్చుకుని దీనికంతటికి కారణం అయిన మద్యాన్ని(సుర) ఎవరు సేవిస్తారో (త్రాగుతారో) వాళ్ళకి ఘోరమైన నరకం ప్రాప్తిన్చుగాక! సకల పాతకాలు (బ్రహ్మ హత్య పతకం, బ్రూణ హత్య ఇలాంటి పాతకాలు) ఇలా సకల పాతకాలు చుట్టుకొను గాక అని ఘోరమైన శాపం పెట్టాడు! ఆనతి నుండి సుర తగినవారికి మనో నిగ్రహం కోల్పోయి ఏమి మాట్లాడతారో, ఏమి చేస్తారో కూడా తెలియని స్థితికి వెళ్ళిపోతున్నారు! కొందరు తాగిన వంక పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు! ఇవన్ని శాప ప్రభావమే!

ఇక వచ్చిన పని అయిపొయింది కాబట్టి వెళ్లి వస్తాను గురువుగారు అని నమస్కారం పెట్టి బయలుదేరాడు! దమయంతి చూసి నన్నారు నేను ఇతనిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను! అంటే శిష్యుడు మాట విని గురు పుత్రి సోదరితో సమానం, పోనీ అలాకాదు అనుకున్న నేను మీ తండ్రి గర్బమ్ నుంచి మళ్లి జన్మ ఎత్తి వచ్చాను అల చూసుకున్నా నువ్వు నాకు సోదరివి అవుతావ్ కనుక వివాహం మీద ఆశ వదులుకో అని వెళ్తుంటే దమయంతికి విపరీతమైన కోపం వచ్చి నా మాట తిరస్కరిస్తావా? నువ్వు నేర్చుకున్న విద్య నీకు ఉపయోగ పడకుండుగాక! అని శాపం పెట్టింది! దానికి ప్రతి శాపంగా నాకు తప్ప అన్యులకి ఎవరికైన ఉపయోగపడు గాక అని ప్రతిశాపం పెట్టి వెళ్ళిపోయాడు!

అలా సుర తగిన వారికీ సకల పాతకాలు చుట్టుకోవాలనే శాపం,

దమయంతి శాపం,ఇతని ప్రతిశాపం మూలంగా దేవతలందరికీ సంజీవని విద్య వచ్చింది!

 

 

క్రుతఘ్నుడి మాంసం కుక్కలు కూడా ముట్టవ్ - 2

కొనసాగింపు...

తెల్లారిన తరువాత నడిజంగుడు వచ్చి బ్రాహ్మణుడితో ఇక్కడికి దగ్గరలో మిత్రుడు విరూపాక్షుడు అనే రాక్షస రాజు ఉన్నాడు! అతను ఎంతో ఉత్తముడు, నియమ నిష్టలతో యజ్ఞ యగాదులతో, దానధర్మలలో ఆయనకి ఆయనే సాటి!! ప్రతి కార్తిక పౌర్ణమి నాడు వచ్చిన బ్రాహ్మణులందరికీ బంగారపు కంచాల్లో భోజనాలు పెడతాడు! మళ్లి అతిధి సత్కారాలు ఆచరిస్తాడు! నాకు మంచి మిత్రుడు! నేను పంపానని చెప్పు! నిన్ను గౌరవించి సత్కరించి పంపుతాడు! వాటితో నువ్వు హాయిగా బ్రతకొచ్చు! ఇదిగో దారిలో వెళ్ళు అని దారి కూడా చూపించింది! మర్గంగుండా చాల దూరం వెళ్ళాక నాడిజంగుడు చెప్పిన విరుపాక్షుడు రాజ్యం వచ్చింది! రాజ్యంలోకి ప్రవేసిస్తుండగానే విరుపాక్షుడు ఇతడి రూపం చూసి ఇతడిని చుస్తే ఏదో కొంత కుటిల స్వభావం కలిగినవాడు అని సందేహం కలుగుతుంది! విషయం ఏంటో తెలుసుకుని రమ్మని భటుడిని పంపించాడు! బటుడికి నాడిజంగుడు పంపిన విషయం చెప్పగానే వార్త విరుపక్షుడికి చెప్తాడు! విరూపాక్షుడునాడిజంగుడు పంపించడా? అయితే ఎంతటి పనికిమాలినవాడు అయిన పర్వాలేదు ప్రవేశపెట్టు అన్నాడు! బ్రాహ్మణుడు రాగానే ఎవరు నువ్వు ఏమిటి నీ చరిత్ర! దానికి బ్రాహ్మణుడు నాపేరు గౌతముడు! పరమ పవిత్రమైన గౌతమ మహర్షి వంశంలో పుట్టిన నీచుడిని! నాకు లేని వ్యసనం లేదు తాగుడు, స్త్రీ వ్యామోహం, పొగ పీల్చడం, ఇలా అన్ని వ్యసనాలు ఉన్నాయి అని జరిగింది చెప్పి వచ్చిన విషయం కూడా చెప్పాడు! విరుపాక్షుడు కనుబొమ్మలు విరిచి సరే నువ్వు ఎవరివైన కావచ్చు నాడిజంగుడు పంపించావ్ కనుక నిన్ను సత్కరించాలి! అని వచ్చిన బ్రాహ్మణులతో పాటు ఇతనికి కూడా భోజనం పెట్టి పెట్టిన పళ్ళెంతో సహా మోయలేనంత వెండి, బంగారం, ధనం ఇచ్చాడు! దానికి గౌతముడు ఎంతో సంతోషించి మూటలన్నీ మోపు మీద పెట్టుకొని మోయలేక మోయలేక నాడిజంగుడు ఉన్న వృక్షం దగ్గరికి చేరుకున్నాడు! నాడిజంగుడు అలసిన మిత్రుడిని చూసి తన రెక్కలతో సేదతీర్చి అతిధి సత్కారం చేసి తన గూటికి వెళ్లి నిద్రించింది!

 

విశ్వాసమున్నవానికికదా విలువ అర్ధమయ్యేది

 

ఒక గురువుగారివద్దకు ఒకాయన శిష్యరికం చెయ్యాలని చేరాడు. గురువుని సేవించుకుని వారి అనుగ్రహం కలిగినదాకా వేచివుండే ఓపికలేదాయనకు. తరచుగా గురువుగారూ నా కేదన్నా మంత్రముపదేశించండి, దానిని జపించి ధ్న్యమవుతాను అని రోజూ వేధించటం మొదలు పెట్తాడు. సరే ఈయన పోడుపడలేక సరే రేపు నీకు ఉపదేశం చేస్తాను రమ్మని చెప్పాడు గురువు గారు. యనకు సంతోషం పట్టరానిదయింది. రాత్రంతా ద్దనిగురించే ఆలో చించి, నేను మిగతావారి కంటే యోగ్యున్ని కనుకనే ఎప్పటినుంచో వున్నవాళ్ళకంటే నాకే గురువుగారు మంత్రోపదేశం చేస్తున్నారు,అని పొంగిపోయాడు. తలతలవారుతుండగనే శుచిగా గురువుగారి సన్నిధానానికి వెళ్ళాడు.

ఏదో గొప్ప మంత్రం తనకు లభిస్తున్నదని ఆయనకు పరమానందంగా ఉన్నది.

 

గురువుగారుఆయనను దగ్గరకు పిలచి నాయనా ఇది పరమపవిత్రమయిన మంత్రం ,దీనిని జపించి తరించుఅని చెవిలో హరేరామ హరేరామ రామరామ హరెహరె ,హరెకృష్ణ హరెకృష్ణ కృష్ణ కృష్ణ హరెహరె అనే నామ మంత్రాన్ని ఉపదేశించారు. అంతే శిష్యుని ముఖం లో ఒక్కసారి వుత్సాహం తుస్సుమని జారిపోయింది. నిరుత్సాహంగా వున్న శిష్యుని ముఖంచూసిన గురువుగారు ,ఏమ్ నాయనా అలా వున్నావేమి అని అడిగాడు. స్వామీ మీరేదో గొప్ప మంత్రం ఉపదేశిస్తారని ఆశపడివస్తే మీరిదా చెప్పేది. ఇదినాకు తెలుసు ,మాయిట్లో అందరికీ వచ్చు ,మాఊరి రామాలయమ్లో ప్రతిరోజు భజనగ పాడతారు తెలుసా? దీనిలో పెద్ద మహిమేమిఉంటుంది గురువుగారూ ? అని విచార పడ్డాడు. గురువుగారునవ్వి దగ్గరగూట్లోవున్న ,మసిగొట్టుక పోయిన ఒక రంగురాయిని తెచ్చి ఇచ్చి, నాయనా దీనిని తీసుకెళ్ళి అమ్మటానికి ప్రయత్నించు ,కానీ పదిమందికి అమ్మచూపి దీనివిలువ ఎంతుంటుందో తెలుసుకో ,అన్నిటికంటే ఎక్కడ ఎక్కువ ధర పలికితే అక్కడ అమ్ముదాము. ఆశ్రమ ఖర్చులకు కావాలి. పనిచేసి పెట్టు, తరువాత నీకు మంచిమంత్రం ఉపదేశిస్తాను అని చెప్పాడు.

శిష్యుడు దానిని తీసుకువెళ్ళి సరకులదుకాణం లో వున్న తనకు తెలిసిన ఒక వ్యాపారికి చూపాడు. ఆయన దీనిని చూసి, ఇదేదో పాత రంగురాయి. కాసిని వుల్లిగడ్దలువస్తాయి అదే ఎక్కువ ఇవ్వమంటావా? అన్నాడు. అక్కడనుండి దానిని తీసికెళ్ళి కంసాలికి చూపాడు. ఇది రంగురాయి మహా అయితే ఒక 50 రూపాయలువస్తాయన్నాడు. దానిని ఇతను బంగారపు వ్యాపారివద్దకు తీసుకెల్లాడు. అక్కడ వాళ్ళు దీనిని ముక్కలగా చేసి వుంగరాలకు వేయవచ్చు నాలుగువందలిస్తామన్నారు. ఇలాకాదని దానిని ర్త్నాల వ్యాపారం చేసేవారివద్దకు తీసుక వెళ్ళగా వాళ్ళు అయ్యా ఇదిజాతిరత్నం పదివేల రూపాయలిస్తాం ఇస్తారా? అని అడిగారు. అబ్బో ఇదేదో విలువగలదానిలాగా వుందే ,అని పెద్దపట్టణానికి చేరుకుని అక్కడ వ్యాపారులకు చూపాడు. వాళ్లు ఆశ్చర్యపడి అయ్యా దీనికి లక్షరూపాయలదాకా విలువ చెల్లిస్తాం ఇస్తారా? అనిఅడిగారు. దాంతో ఇతనికి దీనివిలువ ఇంకా చాలాఉండవచ్చునని అనుమానం పెరిగి ఆరాజ్య రాజుగారివద్దకు దీనిని తీసుకెళ్ళి దర్శించుకుని రత్నాన్ని చూపించాడు.

రాజుగారు దానిని అక్కడున్న రత్న పరీక్షకులకిచ్చి దీనివిలువ లెక్క కట్టమన్నాడు. వారు అనేకపరీక్షలు చేసి అత్యంత ఆశ్చర్యంతో, మహాప్రభూ భూమిమీద అత్యంత దుర్లభమయిన రత్నమిది దీని విలువను మనం లెక్కకట్టలేము . మన రాజ్యం మొత్తం ఇచ్చినా దీని విలువకు సరిపోదు అని వివరించారు.

దానితో విపరీతమయిన ఆశ్చర్యానికి గురయిన శిష్యుడు, దానిని మాగురువుగారు అమ్మవద్దన్నారనిచెప్పి మహారాజు వద్ద సెలవుతీసుకుని గురువుగారివద్ద పరుగుపరుగున చేరాడు.. గురువుగారూ మీరెంత అమాయకులండి మీరిచ్చినది సామాన్య రాయికాదండీ అమూల్య మయినది. మీరెంత పిచ్చివారండి ,ఇంతవిలువయిన రత్నం దగ్గరున్నా దీని విలువ తెలుసుకోలేకపోయారు. అని లబలబలాడాడు. ఎక్కడెక్కడ

ఎవరెవరు రత్నానికి ఎంతవెల నిర్ణయించారో వారి అమాయకత్వమేమిటో వివరించాడు.

అప్పుడు గురువుగారన్నారు. చూసావా నాయనా ఈరత్నం విలువను ఎవరిస్తాయిని బట్టి వారు నిర్ణయించారు. పూర్తిగా తెలిసినవారే దీని అసలు విలువ తెలుసుకో గలిగారు. లేకుంటే వుల్లిగడ్డలకే దీని విలువ భావించబడేది. అలాగే నీకు కూడా వుపదేశించబడిన నామం విలువ తెలియలేదు. దానివిలువ తెలియాలంటె సాధించిననాడుగాని నీకు అర్ధం కాదు. అని వివరించాడు

కామెంట్‌లు లేవు: