1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

22, నవంబర్ 2013, శుక్రవారం

రుద్రాక్షలను ధరించేందుకు నియమాలున్నాయా

రుద్రాక్ష మాల విశిష్టతను వివరించగలరు?
రుద్రాక్ష ఈశ్వరునికి ప్రతీక. ఇది ధరిస్తే భక్తీ, జ్ఞాన వైరాగ్యాలు వృద్ధి చెందుతాయి. మనస్సు స్వాంతన పొందుతుంది. తద్వారా ఆలోచనలు సవ్యదిశలో ప్రయాణించి జీవనవిధానం, ఆరోగ్యం మెరుగుపడుతుంది. రుద్రాక్షలలో ఏకముఖి, ద్విముఖి ...... ఇలా 18 ముఖాల వరకు ఉన్న రుద్రాక్షలు లభిస్తాయి.


రుద్రాక్షలను ధరించేందుకు నియమాలున్నాయా?

ఋతుసమయంలో ఉన్న స్త్రీలు తప్ప, ఎవరైనా సరే ఈ రుద్రాక్ష మాలను మేడలోనే ధరించాలి. వస్త్రం మీద పైకి కనిపించేలా ఆడంబరంగా యితరుల కోసం వేసుకునే ఆభరణం కాదు. ఇది శరీరానికి తగులుతూ ఉంటే మంచి ఫలితాలను పొందవచ్చు. మకుటంలోని రుద్రాక్ష గుండెభాగానికి తగిలి వుంటే మంచిది. వీటిని నిదురించే సమయం లోను, కాలకృత్యాలు తీర్చుకునే సమయంలోను ధరించరాదు. అయితే ఏకముఖి రుద్రాక్షకు ఈ నియమములు వర్తించవు.


More related stuff @

https://www.facebook.com/vidya.sagar.79274089




విషయము మీద కాంక్ష ఉంటే రజోగుణము
విషయము మీద కాంక్ష లేకపోతే సత్వగుణము
విషయము మీద కాంక్ష బలపడిపొతే తమోగుణము



http://ammasrinivas4u.blogspot.in/


కామెంట్‌లు లేవు: