1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

18, డిసెంబర్ 2013, బుధవారం

​ విజయానికి మూలం విశ్లేషించుకోండి?-గర్వాన్ని అధిగమించడం ఎలా?

​May be useful for Social Service Volunteers​


​​
విజయానికి మూలం విశ్లేషించుకోండి?

గర్వాన్ని దూరంగా ఉంచడానికి మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోవాలి.  అదేమిటంటే, మీ విజయానికి మూలం ఏమిటి? ఉదాహరణకు సామర్థ్యం అని అవతలి వారు కీర్తించారనుకుందాం.  అప్పుడు ఆ సామర్థ్యానికి మూలమేమిటని కూడా ప్రశ్నించుకోవాలి.  అవతలి వారు మనని రకరకాల పొగడ్తలతో ముంచెత్తి ఉండవచ్చు.  కానీ, అవన్నీ నిజమనే నమ్మకమేమిటి?  ఒకవేళ నిందించారనుకుందాం.  దానిని అంగీకరిస్తామా?  నిందలకు మూలం లేనిపోని కల్పనలైనప్పుడు, పొగడ్తలకు మాత్రం ఎందుకు కాకూడదు?  ఈ భ్రమ నుండి బయటపడాలంటే మనలో మనమే ప్రశ్న వేసుకోవాలి. ​


​మనకు లభించిన అవకాశాలను మనం వినియోగించుకోగలమే కానీ, వాటిని సృష్టించుకోలేము.  ఎంతో ప్రతిభ ఉన్నా, మీ విజయానికి అదొక్కటే కారణం కాలేదు.  ఒక విజయం వెనుక ఎన్నో కారణాలున్నాయి.  అవేవీ మీరు సృష్టించ గలిగినవి కావు.  మీకు సమకూరిన కొన్ని అవకాశాల వల్ల విజయం సాధ్యమయింది.  ఈ రహస్యాన్ని గుర్తించినపుడు మీకున్న సామర్థ్యాన్ని గ్రహించి, ఆనందపడడంతో పాటు మీకు సహకరించిన అనేక ఇతర కారణాలకు మీరు కృతజ్ఞతతో ఒదిగిపోతారు.  ఎవరో మెచ్చుకోవాలన్న తపన కూడా క్రమేపీ మటుమాయమవుతుంది.

గర్వం వెర్రితనమే!
నాలో ఫలానా గొప్పదనం ఉందనీ, దానిని ఇతరులు మెచ్చుకోవాలని ఆరాటపడడం, అలా జరగనప్పుడు సంఘర్షణకు లోను కావడం ఇవన్నీ గర్వానికి మూలమని చెప్పుకున్నాం.  ఏదైనా గొప్పదనం ఉన్నా, దానికి గర్వించాల్సిన పనేమీ లేదు.  ఎందుకంటే, ఆ గొప్పదనానికి కారణం మీరు ఒక్కరే కాదు.  అసలైన కారణాలలోకి వెళ్ళే సరికి మనలో తలెత్తే కృతజ్ఞతా భావం సంఘర్షణలను పారదోలుతుంది.  ఈ భావన మనలోని గర్వాన్ని అధిగమించడానికి మనకు అన్ని విధాలా తోడ్పడుతుంది. ఇక్కడ ఇంకొక రహస్యం కూడా దాగుంది.  అదేమిటంటే, ఎదుటి వారి నుంచి గౌరవాన్ని పొందాలనుకోవడానికి కారణం అది మీకు తృప్తినివ్వడమే.  మీ సామర్థ్యం మీద మీకు పూర్తి నమ్మకం లేనప్పుడే, మీరు ఎదుటి వారి నుంచి పొగడ్తలను ఆశించి, దానివల్ల లభించే తృప్తిని కోరుకుంటారు.  మీ గురించి మీకు తృప్తి ఉన్నప్పుడు, ఇతరులు చేసే సన్మానాల అవసరమే ఉండదు.  ఆత్మ విశ్వాస లోపాన్ని గర్వంతో పెంచి పోషించుకుంటున్నామని పదే పదే గుర్తుచేసుకోవాలి.

సమర్థతకి స్వతః ప్రకాశం:
సామర్థ్యం కలిగి ఉండడం, దానిని వినియోగించుకోగలగడం మంచిదే.  కానీ, అది స్వతస్సిద్ధంగా ప్రకాశించాలి.  సువాసనలను వెదజల్లే అందమైన పువ్వులను విరగబూయించే చెట్టు, తానెక్కడున్నా, ఎవరు చూసినా, చూడకపోయినా,  తన పనిని తాను ఏ గుర్తింపు పొందాలనీ ఆశించకుండా నిర్వర్తిస్తుంది.  నేను విరగబూస్తున్నానొహో అని చాటింపు వేయించదు.  మీలోని ప్రజ్ఞాపాటవాలను, సామర్థ్యాలను మీరూ అలాగే వినియోగించాలి.  అవి మీకే ఎందుకు వచ్చాయి? దీనిపై ఎవ్వరూ సూటిగా సమాధానం చెప్పలేరు.  అందుకే దానిని భగవంతుని అనుగ్రహంగా భావించి, వినియోగించాలి. మీ విలువను గుర్తించిన వాళ్ళు మిమ్మల్ని గౌరవించవచ్చు, లేనివారు పట్టించుకోకపోవచ్చు.  దేనికీ చలించ కూడదు.

ఈ అవగాహనతోనే వ్యక్తి గర్వాన్ని సునాయాసంగా అధిగమించగలడు.  నిగర్వి లో సంఘర్షణలకు తావులేదు.  వెలితి అసలే కానరాదు.  నిర్మలంగా ప్రశాంత చిత్తుడై ఉంటాడు.  ఈ పరిణతి ఆత్మ జ్ఞానానికి ఊతమిస్తుంది. 

ఈ నిర్మలత లేని వ్యక్తిలో దంభం చెలరేగుతుంది.  అది వ్యక్తిని మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది.


ఓం నమో భగవతే వాసుదేవాయ 
సర్వం శ్రీ ఆంజనేయ స్వామి పాదారవిందార్పణమస్తు
కె.బి. నారాయణ శర్మ - నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది
​ ​
అనంతం



4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Chala baga chepparu.. Every one has to read

అజ్ఞాత చెప్పారు...

Brother bagundi andariki applicable avutundi

Guna sekhar చెప్పారు...

Nice Article.....................

Anil kumar K చెప్పారు...

Nice article. This is trule People sometimes tend ignore the circumstances which contributed to the success and claim everything they only did. But we should thank God for providing better oppourtunity to play well in our success game.

Thanks,
Anil K