1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఒక మంచి ప్రజా సేవకుడు ఎలా వుండాలి అంటే....

​నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఒక మంచి ప్రజా సేవకుడు ఎలా వుండాలి అంటే....

*తను చేసే మంచి పనులు చెప్పడం ద్వార ప్రజలను నమ్మించ గలగాలి, ప్రేరేపించ గలగాలి అంతే గాని అవతలి వాడు వెధవ అని చెప్పడం వాళ్ళ నువ్వు మంచి వాడు అని ప్రజల్ని నమ్మమంటే ఎలా ?

*నువ్వు గెలవకపోయిన నీ నియోజకవర్గంలో విడుదలైన నిధులు సక్రమంగా ఉపయోగిస్తున్నారో లేదో ప్రశ్నిస్తూ, అభివృద్ధి పనులు జరిగేటట్టు చూడాలి

*నీకు అధికారం రాకపోయినా ప్రతి పక్షం లో కూర్చొని అధికార పక్షాన్ని, వారు ధనాన్ని ప్రజలకు ఉపయోగ పడే విధంగా ఖర్చు చెయ్యమని నిలదీయ గలగాలి


మీ పార్టీ గురించి చెప్పండి, మీరు ప్రజలకు ఏమి చేస్తారో చెప్పండి అంటే ఆ పార్టీ వాళ్ళు వెధవలు, మేము పతివ్రతలము అని చెప్పుకోవడానికే సరిపోయే మీ సమయం మొత్తం (హిరణ్య కశిపుడు విష్ణు మూర్తి జపం చేసినట్టు-- కాకపోత అక్కడ చెడు -మంచి... ఇక్కడ చెడు-చెడు). ప్రజా సేవకులు అని చెప్పుకొనే ఎ ఒక్క రాజకీయ నాయకుల సభలలో ఐన ప్రజలను ఉత్తేజ పరిచే, తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చెయ్యాలి అనే మాటలు ఉన్నాయా ? మీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము- ఇంకా సోమరులను చేస్తాం అనే వాగ్ధానాలు తప్ప.

 చదువుకున్న వారు, చదువు కొన్న వారు కూడా
* కుల రాజకీయాలకు
* వారసత్వ రాజకీయాలకు
ప్రాధాన్యత ఇస్తుంటే, ఏమి చెయ్యాలో అర్ధం కాని పరిస్తితి...

మార్పు కోసం ముందు వుండే వారికీ మాత్రం ఒకటే అవకాసం, నిరూపించుకోలేకపోతే ఇంకో అవకాసం ఇవ్వరు సరికదా.... మార్పు కోరుకొనే వారిని ఎవ్వరిని ఇక అసలు పట్టించుకోరు, అవకాసం ఇవ్వరు.... అదే దేశాన్ని దోచుకొనే వారికో ఎన్ని అవకాశాలైన ఇస్తాము కాని......

ఇక నా మరో సందేహం అసలు పార్టీ ఎందుకు ? ఎక్కడ ఎ నాయకుడు మంచి సేవ చేస్తాడో, ప్రజలకు అండగా ఉంటాడో వాడిని గెలిపిద్దాం.
కలసి పని చెయ్యడం మంచి వాళ్ళకు సాధ్యం కాదు అని మరో సరి రుజువు చేస్తున్నారు.

హృదయలోతుల్లోంచి, జీవిత అనుభవాల్లోంచి...మదిలో మెదిలే భావాల సంపుటి....నా అంతంలేని ఆలోచనల తరంగం....అదే....నా అనంతరంగం...అమ్మ శ్రీనివాస్ http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20%E0%B0%A8%E0%B0%BE%20%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81%20-%E0%B0%A8%E0%B0%BE%20%E0%B0%85%E0%B0%82%28%E0%B0%85%E0%B0%A8%E0%B0%82%29%E0%B0%A4%E0%B0%B0%E0%B0%82%E0%B0%97%E0%B0%82%20-Straight%20from%20My%20Heart%20and%20Experiences

కామెంట్‌లు లేవు: