1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

20, మే 2015, బుధవారం

ఆత్మ - అమ్మ- ఆశ్వ - సేవ - సంకల్పం

సూర్యుని వలె  స్వయం ప్రకాశితం కావాలనుకునే ఈ ఆత్మకు... 

కోరికలను మేఘాలు అడ్డుపడగా... 

సంసారమనే మెరుపులు, స్వార్ధమనే పిడుగులు తోడైన,మాయ అనే జడివానలో, ఎటు పోతానో , ఎక్కడ తేలుతానో తెలియక కొట్టుకొని పోవుచున్నట్టు  భ్రమించు సమయాన.... 

మా "అమ్మ" "అశ్వ" వాహనంపై "సేవా" యుధంతో నన్ను కటాక్షించి, రక్షించ వచ్చుచున్నట్టు, "దృఢ సంకల్పం" అనే తారక మంత్రాన్ని ఉపదేశించినట్టు  తోచుచున్నది..... 

ఆహా!!! నా జన్మ సార్ధకమే కదా... 


నా అనంతరంగం......  
    2.45 AM, 20/5/2015

కామెంట్‌లు లేవు: