శాస్త్ర ప్రపంచంలో నోబెల్ బహామతికున్న ప్రాముఖ్యత మనకు తెలిసిందే. ఈ ప్రైజ్ తో ముడిపడిన విశేషాలు కూడా చాలా ఆసక్తిని కలిగిస్తాయి. అవేమిటో చూద్దాం!
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నోబెల్ బహామతిని అందుకొని చరిత్ర సృష్టించారు. ఆ కుటుంబం మరెవరిదో కాదు.. రేడియం ఆవిష్కర్త మేడమ్ మేరీక్యూరీ (1867-1934) వాళ్లది. మేరీక్యూరీ ఆమె భర్త పియరీక్యూరీ (1859-1906) 1903లో భౌతికశాస్త్రంలో నోబెల్ గెల్చుకున్నారు. 1911లో మేరీ రసాయనశాస్త్రంలో ఈ ప్రైజ్ ను పొందారు. మేరీ కూతురు, అల్లుడు (ఐరీన్ (1897–1956), ఫ్రెడరిక్ జ్యూలియట్ (1900–1958)) 1935లో రసాయనశాస్త్రంలో నోబెల్ సాధించారు.
మంచి శాస్త్రవేత్త మంచి గురువుగా కూడా ఉంటారు. ఎలక్ట్రాన్ ను కనుక్కున్న జె.జె. ధామ్సస్(1856-1940) జీవితం దీనికి ఒక ఉదాహరణ. 1906లో ధామ్సస్ నోబెల్ ప్రైజ్ ను అందుకున్న తర్వాత.. ఆయన శిష్యులు ఏడుగురు వరుసగా తర్వాత సంవత్సరాల్లో నోబెల్ ప్రైజ్ ను గెలుచుకున్నారు.
ఎలక్ట్రికల్ రంగానికి చేసిన సేవలకుగాను.. అమెరికా శాస్త్రవేత్తలు ధామస్ అల్వా ఎడిసన్ (1847–1931), నికొలా టెల్సా (1856–1943)కు కలిపి 1912లో బహామతినివ్వాలని నోబెల్ కమిటీ భావించింది. కానీ, ఎడిసన్ తో తనకున్న విభేదాల దృష్ట్యా.. ఆయనతో కలిసి బహామతిని తీసుకోనని నికొలా భీష్మించుకు కూచున్నారు. దీనితో.. ఆ ఏడాది వేరే శాస్త్రవేత్తకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు.
జర్మనీ నియంత హిట్లర్ దురాగతాలకు సాధారణప్రజలే కాదు.. శాస్త్రవేత్తలూ బలయ్యారు. వారిలో ఒకరు.. గెర్హార్డ్ డొమాగ్ (1895–1964). వైద్యరంగంలో ఈయన జరిపిన పరిశోధనలకు 1939లో నోబెల్ బహామతి లభించింది. అయితే, ఆ ప్రైజ్ ను డొమాగ్ స్వీకరించకుండా.. హిట్లర్ కట్టడి చేశాడు. హిట్లర్ పాలన అంతరించాకే.. 1947లో డొమాగ్ తన బహామతిని తీసుకోవాల్సి వచ్చింది.
తండ్రీకొడుకులు, గురుశిష్యులు కలిసి నోబెల్ ప్రైజ్ నందుకున్న సంఘుటనలు కూడా ఉన్నాయి. ఎక్స్-రే క్రిస్టలోగ్రఫీకి పునాది వేసిన బ్రిటన్ భౌతికశాస్త్రవేత్తలు, తండ్రీకొడుకులు.. విలియంబ్రాగ్ (1862-1942), లారెన్స్ బ్రాగ్ (1890–1971) 1913లో సంయుక్తంగా నోబెల్ గెలుచుకున్నారు. 1902లో లోరెంజ్, తన శిష్యుడు పీటర్ జీమన్ తో కలిసి నోబెల్ ను అందుకున్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి