1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

7, జులై 2015, మంగళవారం

​అబ్బో నా అంతరంగం అవధులు లేని అనంతరంగం

నేను చిన్న తనంలో పడిన కొద్దిపాటి కష్టాలు,
చేయూతనిచ్చి సాయం చేసిన సహ్రుదయాలు,
నా తల్లితండ్రుల పెంపకంలోని విలువలు,
నాకు జీవిత పాటలు నేర్పిన గురువులు,
నా లోని ఈ "ఇతరులకు సేవ చెయ్యాలనే" ఆలోచనకి బీజాలు...

మనసు నిండా ఎన్నో మంచి పనులు చెయ్యాలనే తలపులు,
ఆదర్శమైన వ్యక్తిగా ఎదగాలనే ఆశయాలు,
నన్ను నేను మార్చుకుంటూ ప్రపంచాన్ని మర్చగలననె ఆలోచనలు,
ఏదైనా సాధించగలను అనే నమ్మకం,
అసాధ్యం అంటూ ఏది లేదనే అఖండ విశ్వాసం,
పని మీద తప్ప ఫలితాల మీద లేని వ్యామోహం,
వంద శాతం ప్రయత్నిస్తే విజయం నీదే అన్న ధీమా,  ఊహల్లో ప్రతి క్షణం ఊరిస్తున్న లక్ష్యాలు,
బాధ్యతను ఆనందంగా స్వీకరించే నైజం,
ఎంతటి సమస్యనైనా ఆనందంగా స్వీకరించి ఎదురు నిలబడే తత్త్వం,
తప్పులను వొప్పుకొని, సరిదిద్దుకోగల ధైర్యం,
జగమంత  కుటుంబం నాది అనుకొనే విశాల హృదయం,
నా జీవిత అనుభావలలోని సారం, 
ఇవన్నినా జీవిత పయనానికి మూలాధారాలు....  

ఒక పక్క ఇంకా ఏదో చెయ్యాలనే తపన,
మరో పక్క వయసు పరిగేడుతోందన్న ఆలాపన,
మంచి పనిలోనూ వెనక్కిలాగే వాళ్ళను చూసి ఆవేదన,
వారి అజ్ఞానాన్ని ఎలా తరిమి కొట్టాలనే ఆలోచన,
వీరికి వీలైనంత దూరంగా ఉండాలనే నేర్పు,
కాని వారికి మనమే అర్ధమయ్యే విధంగా చెప్పి, మనలో కలుపుకు కోవాలనే వోర్పు,
వెన్ను తట్టి ప్రోత్సహించి, మేమున్నామంటూ తోడుగా నిలచె వారిని చూస్తే కలిగే ఉరిమే ఉత్సాహం,
వారితో ఎక్కువ గడపడానికి గల కారణం......

క్షణం తీరిక లేకపోవచ్చు, దమ్మిడి ఆదాయము లేకపోవచ్చు, 
ఎంతో మంది భ్రమ పడుతున్నట్టు సినిమాలు, షికార్లు లాంటి తాత్కాలిక ఆనందాలకి నేను దూరము అయ్యి వుండవోచ్చు. 
కాని  వీటన్నిటిని మించి ప్రతి క్షణం ఏదో సాదిస్తున్నాననే మానసిక తృప్తి, 
నా జీవితం వ్యర్ధం కాదు, దీనికొక పరమార్ధం ఉంది అనే అంతులేని ఆనందం,
 నాకు ప్రతి క్షణం ప్రేరణను, ఉత్సాహాన్నిఅందిస్తూ ఉంటాయి...

పొట్ట కూటి/జీవనోపాధి  కోసం కార్యాలయంలో 9 గంటలపాటు  కసరత్తులు ఒక ప్రక్క,
ప్రతి ఘడియ ప్రజల సేవలో ఎలా గడపాలో అనే ప్రణాళికలు మరో పక్క,
ప్రకృతిలో మమేకం అవుతూ ప్రపంచం మొత్తం చుట్టివేయ్యాలనే ఆశ,
జీవితంలో ప్రతి క్షణం, ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవాలనే ఆరాటం,
నాకు తెలిసింది పంచుకోవాలనే పోరాటం,
అబ్బో నా అంతరంగం అవధులు లేని అనంతరంగం.....

గెలుపు వోటములు, ఎత్తు పల్లాలు, వొడి దుడుకులు జీవన పయనంలో సహజం; 
కాని ఆగదు గమ్యం వైపు నా పయనం;
దృఢ సంకల్పమే నా ఆయుధం;
ప్రజా సేవకే అంకితం ఈ నా జీవితం ....  


 
హృదయలోతుల్లోంచి, జీవిత అనుభవాల్లోంచి...మదిలో మెదిలే భావాల సంపుటి....నా అంతంలేని ఆలోచనల తరంగం....అదే....నా అనంతరంగం...అమ్మ శ్రీనివాస్ ... 4/16/14

4 కామెంట్‌లు:

శ్రీనివాస చక్రవర్తి చెప్పారు...

మీ మనసు నిండా మంచి భావాలు,
నెరవేరను మీ ఆశయాలు.......

Unknown చెప్పారు...

నాలో మెదిలే తలంపులకు ప్రతి రూపం మీ అంతరంగం
దారి తెలియక నిర్వాణ దశకు అడుగులేస్తున్న నా ఆశయాలను మరల్చే మేఘ సందేశం మీ అంతరంగం
మీలాగా నన్ను మర్చగాలరని అంటుంది నా అంతరంగం
ఆ లక్షం కష్టం కాదని నా నమ్మకం
ఇది సంభవన్ అని మీరు సెలవిస్తే
అదే నా మొదటి విజయం
"సాయిరాం"

Unknown చెప్పారు...

నాలో మెదిలే తలంపులకు ప్రతి రూపం మీ అంతరంగం
దారి తెలియక నిర్వాణ దశకు అడుగులేస్తున్న నా ఆశయాలను మరల్చే మేఘ సందేశం మీ అంతరంగం
మీలాగా నన్ను మర్చగాలరని అంటుంది నా అంతరంగం
ఆ లక్షం కష్టం కాదని నా నమ్మకం
ఇది సంభవన్ అని మీరు సెలవిస్తే
అదే నా మొదటి విజయం
"సాయిరాం"

Unknown చెప్పారు...

నాలో మెదిలే తలంపులకు ప్రతి రూపం మీ అంతరంగం
దారి తెలియక నిర్వాణ దశకు అడుగులేస్తున్న నా ఆశయాలను మరల్చే మేఘ సందేశం మీ అంతరంగం
మీలాగా నన్ను మర్చగాలరని అంటుంది నా అంతరంగం
ఆ లక్షం కష్టం కాదని నా నమ్మకం
ఇది సంభవన్ అని మీరు సెలవిస్తే
అదే నా మొదటి విజయం
"సాయిరాం"