1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

22, ఆగస్టు 2015, శనివారం

ఊర్లు ఎడారులుగా మారకుండా ఒంటిచేత్తో పోరాటం చేస్తున్న రాణారాం బిష్ణోయ్

ఊర్లు ఎడారులుగా మారకుండా ఒంటిచేత్తో పోరాటం చేస్తున్న రాణారాం బిష్ణోయ్

వందల ఏళ్లక్రితం బిష్ణోయ్ పోరాటమే స్పూర్తి
అడవులను పెంచడమే లక్ష్యంగా రాణారాం ఉద్యమం
రాజస్తాన్ లో రాణారాం పేరుతో మొక్కల పెంచే కర్యక్రమాలు
పర్యావరణ సమతుల్యతకు నేను సైతం అంటున్న 75 ఏళ్ల యువకుడు
  •  16 Views
  •  
  •  0 comments
చెట్టంత పొడుగ్గా ఉండే వ్యక్తి.. చెట్లను పెంచడాన్నే ఇష్టంగా మార్చుకున్నారు. చెట్లు నరకడంపై ఉద్యమాన్ని వారసత్వంగా తెచ్చుకున్న ఆ 75ఏళ్ల యువకుడి కథే ఇది. అతని పేరే రాణారాం బిష్ణోయ్. 
జోధ్‌పూర్‌ నుంచి సరిగ్గా వందకిలోమీటర్ల దూరంలో ఉంది ఎకల్కోరి. కానీ అక్కడికి వెళ్లాలంటే ఐదు గంటల సమయం పడుతుంది. తొందరగా చీకటి పడుతుంది. కానీ అది రాజస్తాన్ రాష్ట్రంలోని అంతర్భాగమే. చింకారా ప్రాంతం ద్వారా ప్రయాణిస్తే మాత్రం ఆగుతూ మెల్లిా వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఉడుతలు ఇతర చిన్న చిన్న జీవులు హైవేపైనుంచి పరుగులు తీస్తుంటాయి.
బిష్ణోయ్ టైగర్ ఫోర్స్ వాలంటీర్లు అయిన తాము వెనక సీట్లో కూర్చొని ఉన్నాం. వీటన్నింటి చూస్తూ ప్రయాణించామని వాలంటీర్లు వివరించారు. రాత్రి అయితే గన్ కంపల్సరీ. ఉదయం సమయంలో కూడా ఈ ప్రాంతంలో మసలాలంటే గుండె ధైర్యం ఉండాలి. రాజస్తాన్ మైదానాల్లో తాము ఎవరి ప్రోద్బలంతో ఇక్కడి వరకూ వచ్చామో .. తాను కూడా మాతో ప్రయాణం చేస్తున్నారు. 70ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి చూడటానికి చక్కగా ఉన్నారు. బాగా ఎత్తుగా ఆర్మిలో కెప్టెన్‌లా కనిపిస్తారు. ఇప్పటి వరకూ 27వేల చెట్లను ఆయన నాటారంటే నమ్ముతారా ? ఎడారిగా మారిపోతుంది అనుకున్న ఆ ప్రాంతాన్ని ఒంటిచేత్తో ఆపుచేశారాయన. రాణారామ్ నాటిన చెట్లతో ఆ ప్రాంతం ఓ కారడవిలా మారిందనడంలో అతిశయోక్తి కాదేమో. తాను నాటిన మొక్కల్లో వేప, బబూల్ లాంటి చెట్లతోపాటు మరెన్నో ఆయుర్వేద గుణాలు కల్గినవి ఉన్నాయి.
చాలా ఏళ్లుగా వీటిని నాటుకుంటూ వస్తున్నారు రాణారాం. దగ్గర్లో ఉన్న బావుల నుంచి నీటిని తోడి వాటికి పోస్తున్నారు. రాణారాం ..బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. చిప్కోఉద్యమానికి ఆజ్యం పోసింది బిష్ణోయ్ వారే. చెట్ల నరకడాన్ని వ్యతిరేకించిన ఉద్యమం చిప్కో ఉద్యమం. 1730లో మూడువందల అరవై మూడు మంది బిష్ణోయ్‌కి చెందిన వ్యక్తులు స్థానిక రాజుల మారణకాండలో చనిపోయారు. ఇందులో చిన్నారులు , మహిళలు కూడా ఉన్నారు. చెట్లను నరకవద్దంటూ వారంతా పోరాటం చేశారు. రాజు నిర్ణయానికి వ్యతిరేకించారని వారిని అతి కిరాతకంగా చంపేశారు. గతంలో ఇలాంటి గొప్ప పోరాటం నుంచి స్పూర్తి పొందిన రాణారాం ఇప్పుడు తన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఆ పోరాటానికి వారసత్వంగా రాణారాం తెచ్చుకున్నారని స్థానికులంటారు. రాజస్తాన్ దాటితే బిష్ణోయ్ కమ్యూనిటీని పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో మనం చూడొచ్చు. ప్రతిచోటా పర్యావరణానికి సంబంధించిన ఉద్యమాన్ని కొనసాగిస్తోందీ సమూహం. 29మంది సభ్యులు మొదట జంబేశ్వర్ గురువు దగ్గర నుంచి ఉద్యమ ఊపిరిని పుణికి పుచ్చుకున్నారు. పర్యావరణ రక్షణార్థం దీన్ని కొనసాగిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 1998లో ఈ ప్రాంతానికి సినిమా షూటింగ్ పనిమీద వచ్చారు. అదే సమయంలో జోధ్‌పూర్ గ్రామంలో ఓ నల్ల జింకను వేటాడారు . దాన్ని తీవ్రంగా ప్రతిఘటించిన బిష్ణోయ్ స్థానిక జోధ్‌పూర్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణ జరుగుతునే ఉంది.
కొండలపైకి ఎక్కి .. అక్కడి నుంచి గ్రామాలను చూస్తుంటే.. పచ్చని తోటల మధ్యలో ఎంతో రమణీయంగా కనిపిస్తాయి. దీంతో పాటు సాయంకాలం కావడంతో సూర్యాస్తమయం అవుతుండే సమయంలో ఆకాశంలో నారింజరంగు వెలుగు నయనానందాన్నిస్తుంది. ఈ ప్రాంతంలో ఆ చెట్లను నాటింది రాణారామేనట. తాను చిన్ననాటి నుంచి మొక్కలపై, చెట్లపై మమకారం పెంచుకున్నారు. సహజ సిద్ధంగా కనిపించే అందానికి మించిన సౌందర్యం ఎక్కడా లేందంటారాయన. ఇదే ఆయన్ను ఇక్కడ వరకూ తీసుకొచ్చింది. వర్షాభావం ఏర్పడి ఎడారిగా మారిపోతుందనుకున్న ఈ ప్రాంతం ఇప్పుడిలా పచ్చని పూదోటగా మారింది.
తాను కొన్ని మొక్కలను మాత్రమే నాటానని.. మిగిలినవి వాటంతట అవే పుట్టుకొచ్చాయని ఎంతో వినమ్రంగా చెబుతారు రాణారాం. సంకల్పానికి మించిన గొప్ప విషయం మరొకటి ఉంటుందా. ఇంత చేసినా తాను చేయాల్సింది చాలా ఉందని.. ఇప్పటికీ ఏమీ చేయలేదని చెప్పే రాణారాం గొప్పతనాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. గతంలో ఇక్కడ గొప్ప అడవులుండేవి. తర్వాత అవసరాలకు వాటిని నాశం చేశాం. వాటినెలాగూ తీసుకురాలేం. కనీసం ఉన్న వాటిని రక్షించుకుందామనేది రాణారాం అభిప్రాయం.
మొక్కలు పెంచితే.. అవి చెట్లుగా మారుతాయి.. చెట్లు చాలా రకాలైన పక్షులకు ఆవాసాన్నిస్తాయి. దీంతోపాటు సరైన టైంలో వర్షాలు కురుస్తాయి. పంటలు పండుతాయి. మనకే మేలు జరుగుతుందని రాణారాం వివరిస్తారు. పర్యావరణ సమతుల్యం లేకపోవడమే ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ కారణమని అంటారాయన. అడవులను పెంచడంతో పశుపక్షాదులకు ఆశ్రయం కలిగించిన వారవుతాం. అటవీ సంపదను నాశనం చేసుకుంటూ పోతే భవిష్యత్ లో మరింత సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుందని రాణారాం అంటారు. మానవులు స్వార్థానికి అంతులేదా? ఇప్పటికైనా మన పర్యావరణం కోసం నడుకట్టాలని సందేశాన్నిస్తూ ముగించారు రాణారాం.

​​
Love all - Serve all
Srinivas
​ @ 9177999263​



SERVICE     
COW PRODUCTS       
JOB UPDATES    
    INFO STUFF



Smiling, Sharing, Loving, Caring and Helping are my five main weaknesses

కామెంట్‌లు లేవు: