ఒక మంచి లక్ష్యంతో మనం పనిచేస్తునప్పుడు మనం చేసే పనికి దేవుడే సమయానికి కావలసిన వనరులను ఏర్పాటు చేస్తూ వుంటాడు అనేది నేను బలంగా నమ్మే మరియు ఎప్పుడూ చెప్పే సత్యం.
ఇలా మనకు చాలా మంది అనుకోకుండా అవసరమైన సమయంలో వచ్చి అతుక్కుపోతారు, మనకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే కొన్ని సందర్భాలలో అలా తలలో నాలుకై అతుక్కుపోయారనుకున్న వారు కూడా అనుకోకుండా వెళ్లిపోతారు.
ఇంతకీ అసలు ఎందుకిలా రావడం, పోవడం అంటే...? ఒక్కొక్కరి ప్రాధాన్యతలు ఒక్కో రకంగా ఉంటాయి, అవి కాలాన్ని, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. సహాయం చేయడానికి వచ్చిన వారి ఆలోచనలు మారే ఆవకాసం ఉంది, కానీ పని ప్రారంభించిన వారి ఆలోచనలు సహజంగా లక్ష్యం మీద నుంచి మారవు.
మొదట నాయకుడు చేసే పని వ్యక్తిగత స్వార్ధం కోసం కాకుండా, నలుగురికి ఉపయోగపడేదిగా ఉండాలి. రెండు, అలా మొదలెట్టిన పనిలో ఎప్పుడు వ్యక్తిగతం అనే మాట రానీయక, లక్ష్యం కోసం / సంస్థ అభివృద్ధి కోసం (మంచి / కఠిన) నిర్ణయాలు తీసుకునేలా చూసుకోవాలి.
చేతులు కలిపి సాయం చెయ్యడానికి వచ్చిన వారు వ్యక్తిగత ప్రయోజనాల ఆశించకుండా ఉంటే ఖచ్చితంగా ఈ పరిస్థితి ఉండదు. కానీ వారి దృష్టి ఎప్పుడైతే స్వంత ప్రయోజనాల వైపు మారుతుందో అప్పుడు వీరి వల్ల సంస్థలకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఇక్కడ పని మొదలెట్టిన వ్యక్తి చూపు లక్ష్యం వైపు మాత్రమే మరియు చేసే పని ఎవరినో సంతృప్తి పరచడానికో, ఏదో ఆశించో కాదు కాబట్టి ఇలాంటి విషయాలు ఇతని దృష్టిని పెద్దగా ఆకర్షించవు. చెయ్యవలసిన ప్రయత్నం చేసి, ఇక లాభం లేకపోతే, మార్పు రాకపోతే మళ్ళీ తిరిగి తన పనిలో తాను నిమగ్నమైపోతారు. ఎందుకంటే లక్ష్య సాధ్యనలో వచ్చిన అందరిని కలుపుకొని పోవడం వీరి నైజం, అంతే కాని వారి కోసం లక్ష్యాన్ని పక్కనపెట్టడం కాదు కదా. కాబట్టి అవసరమైతే నెగటివిటీ కి, తన పని నుంచి వెనక్కి లాగే వారికి, వెనక్కి లాగే వాటికి దూరంగా ఉంటారు అంతే కాని పోగొట్టుకోవాలని చూడరు.
ఇతనేమో ఎన్ని ఆటంకాల నడుమ అయినా అవకాశం చూస్తారు, వారేమో ఎన్ని అవకాశాల నడుమ అయిన ఇబ్బందులను చూస్తారు.. వీరి ఆలోచనా స్థాయి, మానసిక స్టైర్యం కొంచెం (చాలా) ఎక్కువగా ఉంటాయి. వారికేమో చేసే పనులలో ఇది ఒక పని మాత్రమే.. కానీ ఇతనికి ఈ ఒక్క పనే జీవితం, సర్వస్వం. అందుకే పని మొదలెత్తినవాళ్ళని కొంతమంది పని రాక్షశులు అని, ఇంకొంత మంది మొండి ఘటాలు అని, గొప్పోళ్ళు అని రకరకాలుగా కీర్తిస్తారు. ఎవరు ఎలా అనుకుంటారో అన్న దాన్నిబట్టి వారి ఆలోచనా విధానం, పరిపక్వత చెప్పేయ్యొచ్చు.
ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే లక్ష్య సాధకుని దృష్టి మొత్తం లక్ష్యం పైనే, 23.55 నిముషాలు లక్ష్యం కోసం పని చేసి మిగతా 5 నిముషాలు చేయకపోయినా, వారికి మనసులో ఏదో వెలితి ఉంటుంది. మాములుగా చేసే వారికి రోజూ 5 నిముషాలు ఈ పని చేస్తేనే జీవితం మొత్తం దీనికి కేటాయించినట్టు అనిపించడం మానవ సహజం.
*హృదయలోతుల్లోంచి, జీవిత అనుభవాల్లోంచి...మదిలో మెదిలే భావాల సంపుటి....నా అంతంలేని ఆలోచనల తరంగం....అదే....నా అనంతరంగం...అమ్మ శ్రీనివాస్...*
2018/01/12 14:10
http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి