1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

6, జూన్ 2020, శనివారం

సేవ అంటే సమస్యను నిర్మూలించడం కోసం పనిచెయ్యడమేనా?

మనం అందరం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. ఏదైనా సంఘటనను లేదా ఎవరైనా వ్యక్తులను వివిధ పరిస్థితులలో చూసి, చలించి వెంటనే మనకు చేతనైన సాయం చేస్తాం, ఆ సాయం ఎంతో గొప్పది, సాయం అందుకున్న వారిని తాత్కాలికంగా (కొన్ని క్షణాలు/ గంటలు/ రోజులు/సంవత్సరాలు) నిలబెడుతుంది. కొంత కాలం తరువాత వారి పరిస్థితి మళ్లీ మాములే. *ఆ పరిస్థితిని చూడగానే మనలో కలిగే భావోద్వేగాల (Emotional Connect) వలన మనం చేస్తుంటాము.* చాలా వరకు స్వచ్చంద సంస్థలు, సేవా భావం కల వ్యక్తులు ఇదే పని చేస్తున్నారు. ఇది చాలా అవసరం కూడా.

ఇప్పుడు మనందరం చేయాల్సింది... *మనం మరో మెట్టు పైకి ఎక్కి పని చెయ్యాలి. అలా చెయ్యాలంటే, మనం భావోద్వేగాల దగ్గర ఆగిపోకుండా, ఆ సమస్య మన మనసుకు హత్తుకోవాలి (Connecting to the Cause).* ఎప్పుడైతే ఆ వ్యక్తిని కాక, సమస్యను చూస్తామో, అప్పుడు మనం ఆ సమస్య మొదట ఆ వ్యక్తికికే రాకుండా...తర్వాత ఎవ్వరికీ, ఎప్పటికి రాకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయుడమే కాదు, అసలు ఆ సమస్య కోసం పని చేస్తున్న వారితో కలసి ఆ సమస్యను సమూలంగా నిర్మూలించే విధంగా పనిచేస్తాం. ఇదే అసలు మనం చెయ్యాల్సిన పని. అలా చెయ్యలేక పోవడం వలననే ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది కష్టపడుతున్నా కానీ సమస్య అక్కడే ఉంటోంది, దానికి ఎంతో మనిషి బలైపోతున్నారు.

*కాబట్టి*
1. *సమస్యను గుర్తించడం*
2. *సమస్యను ప్రచారం చెయ్యడం*
3. *సమస్యను నిర్మూలించడం*

కాకపోతే ఎక్కువ శాతం, వ్యక్తిగత లేదా సంస్థ లకి ప్రచారం చేసుకోవడం దగ్గరే ఆగిపోతున్నాం. అది ఏమి తప్పు కాదు, అది కూడా అవసరమే.

మరి.... మన ప్రయాణం *మొదటి దశను*(సమస్యను గుర్తించడం) ఎప్పుడు దాటుతుందో... *చివర దశను* (సమస్య నిర్మూలన) ఎప్పుడు చేరుకుంటుందో చూడాలి..

*మనం చివరి దశ చేరుకోక పోయినా పర్లేదు...*
సమస్యను నిర్మూలించలేకపోయినా పర్లేదు.... *కానీ... మన పయనం, మన ప్రయత్నం మాత్రం మన లక్ష్యం ("సమస్య నిర్మూలన")  వైపు చెక్కు చెదరక ఉంటే చాలు...*

మీ అమ్మ శ్రీనివాస్...
జూన్ 6, 2020 12.10am

*అప్పుడప్పుడు నా అనంతరంగం యొక్క ఆవిష్కరణ జరుగుతూ ఉంటుంది, అవన్నీ ఈ బ్లాగ్లో ఆవిష్కరించటం జరిగింది. మీకు ఇంకా తనివి తీరకపోతే, నా మరిన్ని రాతల కోసం సందర్శించండి* http://ammasrinivas4u.blogspot.com/

కామెంట్‌లు లేవు: