1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

14, సెప్టెంబర్ 2020, సోమవారం

జీవితమంటేనే  కష్ట సుఖాల కలయిక.  కానీ కష్టం (చిన్నదైనా / పెద్దదైనా) వచ్చినప్పుడు, తట్టుకొని గుండె నిబ్బరతో పోరాడడం అందరు చెయ్యలేని పని.

చదువుకోవడం కోసం తల్లి తండ్రులకు దూరంగా వుంది బంధువులతో వుండి చదువు కొనసాగించడమే కాకా, కొన్ని సంవత్సరాలు ఒక పూట కూడా సరిగా తినని రోజులు...

_అనారోగ్య పరిస్తితులలో కూడా చలించక, మొక్కవోని ధైర్యంతో కర్మ ఫలాన్ని ఆనందంగా అనుభవించి, ఇంటి పరిస్తితుల దృష్ట్యా పై చదువులు చదువుకోలేక, స్కూల్ లో టీచర్ గా జాబ్ చేస్తూ కుటుంబానికి ఆర్ధిక చేయూతను ఇవ్వడం, ఇప్పుడు కూడా దానిని కొనసాగిస్తూ భర్త కి చేదోడు వాదోడు వుంటూ, సహనం, అణకువతో ఇద్దరు పిల్లలతో ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్న *మా  "శ్రీ లలిత" అక్కకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలతో...*_

నాకు బాగా గుర్తు... మేమిద్దరం (1996-98) రూమ్ లో వున్నప్పుడు చుట్టూ పక్కల వారి న్యూస్ పేపర్ లు తెచ్చుకొని, వాటిని వివిధ సైజు లలో కవర్ లు చేసి స్వీట్ స్టాల్స్ లోనూ, మెడికల్ షాప్స్ లోను వేసుకొని కొంత సంపదించే వాళ్ళం. అపెండిసైటిస్ ఆపరేషన్ అయి. *నడుము నొప్పిగా వున్నా సరే మా చిన్న గదిలో గోడకు అనుకోని కూర్చొని టప టప కవర్ లు చేసి పడేస్తూ వుండేది మా అక్క. అమెది ప్రొడక్షన్ డ్యూటీ,* నాది మార్కెటింగ్ అంటే ప్రతి షాప్ కి వెళ్లి అడిగి కవర్ లు అమ్మడం. వాళ్ళు డబ్బులతో పాటు అప్పుడప్పుడు బోనస్ గా ఎదో స్వీట్ ముక్క లు ఇచ్చే వారు, దానిని ఇంటికి తెచ్చుకొని అపురూపంగా తినేవాళ్ళం.

6 నుంచి 10వ తరగతి  దాకా  నెల్లూరు ములాపేట లో నేను చదివిన ESRM స్కూల్ లో గాని, మాకు ఫ్రీ గా ట్యూషన్ చెప్పిన నాగేంద్ర సర్ ట్యూషన్ లో టీచర్స్  *నన్ను లలిత తమ్ముడుగానే గుర్తుపట్టేవారు.*

అక్క సంపాదించి కొనుకున్న వస్తువల మీద పురుష అహంకారంతో నేను పెత్తనం చెలాయించే తరుణంలో మేమిద్దరం ఎప్పుడు కొట్టుకుంటేనే వుండేవాళ్ళం.  *మా కుటుంబం కోసం నేను చేసిన దానికంటే ఒక పిసరు ఎక్కువే చేసింది మా అక్క.*

ఇలా చెప్తూ పోతూ వుంటే చాలా వున్నాయి లెండి. అందుకే నేను పెద్ద వాడ్ని అయ్యి ఎదో నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను కాబట్టి వారికీ ఎప్పుడు... ఏదీ... లేదు అనకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నా.....  అది నేను తనకి ఇచ్చే బహుమతి.....

*చిన్నపటి నుంచే పరిస్తితులకి అనుగుణంగా సర్దుకుపోయి ఎలా బతకాలో...అలాగే  కష్టాలకి ఎదురొడ్డి ఎలా నిలవాలో చేసి చూపించిన మా అక్క ఎంటే  ఎంతో ప్రేమ, ప్రేరణ...మరొక్కసారి హార్దిక జన్మ దిన శుభాకాంక్షలతో....మీ అమ్మ శ్రీనివాస్*





కామెంట్‌లు లేవు: