1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

26, మే 2015, మంగళవారం


మళ్ళీ మళ్ళీ రాదంట ఈ క్షణం ..నచ్చినట్టు నువ్వుండగా
యవ్వనం అంటేనే ఓ వరం ..తప్పు ఒప్పు తేడా లేనే లేదురా
చిన్నమాటనీ చెవిన వెయ్యనీ..నిన్ను నువ్వె నమ్ముకుంటె నింగి వంగదావిన్న మాటనీ విప్పి చెప్పనీ..
బ్రతుకూ బ్రతకనిస్తే నువ్వు దేవుడే
Everybody.. lets work this party..walk your body with me !Everybody.. lets work this party..walk your body with me !!
నాలాగే నేనుంటాను..నా మది మాటే వింటుంటాను
This is the way I amనాతోనే నేనుంటాను..నచ్చిన పనినే చేస్తుంటానుI don’t give a damn !
నవ్వులు రువ్వుతూ..నవ్వులు పంచుతూ..నాలుగు రోజులు ఉన్నా చాలు..అంతే చాలురా
అందని పండుని పొందాలీ..అంతా ఆనందంఅందిన వెంటనె పంచాలీ...ఎంతో సంతోషంఅల్లరి పనులే చెయ్యాలీ..అపుడే ఆరోగ్యంనా సాటి నేనంటాను..పోటీలోనే ముందుంటానుకెరటం నాకే ఆదర్శం .. పడినా లేస్తాగాసమరం నీకే ఆహ్వానం .. గెలుపే నాదేగాకష్టం అంటే ఇష్టం గా .. కష్టం రాదంటనమ్మిందే చేస్తుంటాను..ప్రాణం పెట్టి సాధిస్తానుEverybody.. lets work this party..walk your body with meనవ్వులు రువ్వుతూ..నవ్వులు పంచుతూ..నాలుగు రోజులు ఉన్నా చాలు..అంతే చాలురాOh my love ! I have been taken !Its all about giving..But life means just about living..so I’m just living it..living it..liviing it..living it.I’m listening to him..hey..I have taken the step..hOWant want want..hey I just want to run..i just want to have fun..is that right?చిన్నమాటనీ చెవిన వెయ్యనీ..నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి వంగదావిన్న మాటనీ విప్పి చెప్పనీ..బ్రతుకూ బ్రతకనిస్తే నువ్వు దేవుడే !Everybody.. lets work this party..walk your body with me !Everybody.. lets work this party..walk your body with me !!ఆకాశం నీ సరిహద్దు..అవకాశాన్ని అసలొదలొద్దుసందేహం ఏదీ లేదు..పోయేటప్పుడు ఏదీ రాదుస్వేచ్చగా..మంచిని పంచుతూ..నాలుగు రోజులు ఉన్నా చాలు..జన్మ ధన్యమే !

నీ ప్రశ్నలు నీవే

ఇవి ఒక పాట ప్రారంభపు వాక్యాలు. మొదలే ఇలా ఉంది ఇంక పాట మొత్తం ఎలా ఉంటుందో అనిపిస్తుంది కదా! నిజంగానే చాలా బావుంటుంది. ఈ మధ్యనే విడుదలైన 'కొత్త బంగారు లోకం' అనే సినిమాలో సిరివెన్నెల గారి కలం నుంచి జాలువారిన మరో అమృత బిందువు ఈ పాట. ఈ పాటను SPబాలసుబ్రమణ్యం గారు అత్యద్భుతంగా ఆలపించారు. అసలు ఆయన పాడడం వల్లనే ఆ పాటకి అంత అందమొచ్చింది అనడం సరియైన మాట. మిక్కీ జె మేయర్ సంగీతం కూడా బాలు గారి గాత్రానికి తోడయి ఇంకా వినసొంపుగా ఉంది. సినిమాలో ఏదో సన్నివేశపరంగా ఈ పాట రాసి ఉండవచ్చు. కానీ, ఈ పాట వింటుంటే.. మనలో ప్రతీ ఒక్కళ్ళకీ.. మన మనసును తట్టి చెప్తున్నట్టుగా ఉంటుంది. ఈ పాటలో ప్రతీ ఒక్క వాక్యం ఒక జీవిత సత్యం. నేను చెప్పడం ఎందుకులే గానీ..మీరే ఒకసారి చూడండి పాట సాహిత్యాన్ని.
-->

నీ ప్రశ్నలు నీవే.. ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే.. ఎవ్వరో విడిపించరుగా
ఏ గాలో నిన్ను.. తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో.. తెలియదంటే చెల్లదుగా
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కననూ అంటుందా..!
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో సాగనంపక వుంటుందా..!
బతుకంటే బడి చదువా.. అనుకుంటే అతి సులువా..!
పొరపడినా బడినా.. జాలి పడదే కాలం మనలాగా..!
ఒక నిముషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా..!
అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా..
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా..!
గతముందని గమనించని నడిరేయికి రేపుందా..
గతి తోచని గమనానికి గమ్యం అంటూ వుందా..!
వలపేదో వల వేస్తుంది వయసేమో అటు తోస్తుంది..
గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే ఋజువేముంది..
సుడిలో పడు ప్రతి నావా.. చెబుతున్నది వినలేవా..!
పొరబాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా..
ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా..!
మనకోసమే తనలో తను రగిలే రవి తపనంతా..
కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెబుతుందా..!
కడతేరని పయనాలెన్ని.. పడదోసిన ప్రణయాలెన్ని..
అని తిరగేసాయా చరిత పుటలు.. వెనుచూడక ఉరికే జతలు..
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు..
ఇది కాదే విధి రాతా.. అనుకోదేం ఎదురీతా..!
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కననూ అంటుందా..!
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో సాగానంపక వుంటుందా..!
బతుకంటే బడి చదువా.. అనుకుంటే అతి సులువా..!
పొరపడినా బడినా.. జాలి పడదే కాలం మనలాగా..!
ఒక నిముషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా..!

ప్రేమతో

20, మే 2015, బుధవారం

ఆత్మ - అమ్మ- ఆశ్వ - సేవ - సంకల్పం

సూర్యుని వలె  స్వయం ప్రకాశితం కావాలనుకునే ఈ ఆత్మకు... 

కోరికలను మేఘాలు అడ్డుపడగా... 

సంసారమనే మెరుపులు, స్వార్ధమనే పిడుగులు తోడైన,మాయ అనే జడివానలో, ఎటు పోతానో , ఎక్కడ తేలుతానో తెలియక కొట్టుకొని పోవుచున్నట్టు  భ్రమించు సమయాన.... 

మా "అమ్మ" "అశ్వ" వాహనంపై "సేవా" యుధంతో నన్ను కటాక్షించి, రక్షించ వచ్చుచున్నట్టు, "దృఢ సంకల్పం" అనే తారక మంత్రాన్ని ఉపదేశించినట్టు  తోచుచున్నది..... 

ఆహా!!! నా జన్మ సార్ధకమే కదా... 


నా అనంతరంగం......  
    2.45 AM, 20/5/2015