1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

26, ఫిబ్రవరి 2018, సోమవారం

వ్యవస్థల్లో వ్యక్తులు తరచూ మరచిపోయే విషయం....

*వ్యవస్థల్లో వ్యక్తులు తరచూ మరచిపోయే విషయం....* వ్యవస్థలో వ్యక్తులు కొంచెం ఇబ్బంది పడ్డా (అది కూడా  వ్యక్తిగతంగా కాక, సంస్థాగతంగా ఆలోచించి, అర్దం చేసుకునే పరిపక్వత లేకపోవడం వల్లనే వస్తుంది) పర్వాలేదు కానీ, వ్యవస్థకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలి

*ఎందుకంటే ఈ వ్యక్తి పోతే, మరో వ్యక్తి వస్తాడు... కానీ వ్యవస్థ పోతే దాని కోసం తన సర్వస్వం పణంగా పెట్టి, రాయి రాయి కూడగట్టి, నిర్మించడం, దానిని ముందుకు తీసుకెళ్లే దమున్న నాయకుడు దొరకడం చాలా కష్టం...*

వ్యక్తి ముఖ్యమా, వ్యవస్థ ముఖ్యమా అంటే ...వ్యక్తులు లేని వ్యవస్థలు ఉండవు, లేవు...కానీ ఎంతోమంది నిర్మించిన వ్యవస్థకు భంగం కలిగించే ఎవరైనా వ్యవస్థకు భారమే, కాబట్టి వారిని అక్కడ వదిలెయ్యడమే మంచిది, ఎందుకంటే వీరు చేసిన / చేస్తున్న సాయం కంటే, వీరి కారణంగా నెలకొన్న వాతావరణాన్ని సరిచేసుకోవడానికి సంస్థ ప్రత్యేక దృష్టి సారించాలి. కాబట్టి వ్యవస్థల్లో వ్యక్తులు, ఆ వ్యవస్థను అర్ధంచేసుకోని, గౌరవించే మానసిక పరిపక్వత కలిగేవుండడం చాలా ముఖ్యం.... ఇదే ఈ సమస్యకు పరిష్కారం..

నా అనంతరంగం
అమ్మ శ్రీనివాస్
2018/02/26 09:41

9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

రైతుల పాలిట కల్ప వృక్షం – వేస్ట్ డికంపోసర్


నమస్కారం,

రైతులు యూరియా, పోటాష్, DAP కి బదులుగా 20/- మాత్రమే విలువైన దీనిని (మదర్ కల్చర్ / వేస్ట్ డికంపోజర్) ను వాడండి వేల రూపాయలు ఆదా చేసుకోండి. ఇది అన్ని రకాల పంటల ఎదుగుదలకు, పురుగులు, తెగుళ్లు నివారణకు ఉపయోగపడుతుంది.

వేస్ట్ డీకంపోసర్ గురించి సందేహాలు వ్యక్తం చేస్తున్న మిత్రుల కోసం! వాడడం మొదలు పెడితే మీకే తెలుస్తుంది. ఇక శాస్త్రీయత అంటారా! ఘజియాబాద్ యూనివర్సిటీ సైంటిస్ట్స్ విడుదలచేసిన వీడియోలలో స్పష్టంగా చెప్పడం జరిగింది, దేశవాళీ ఆవు పేడనుంచి సేకరించబడిన బాక్టీరియా అని. వారిచ్చిన document లో ఫోన్ నంబర్లు ఉన్నాయి. సంప్రదించొచ్చు. ఇందులో మాఫియాకు అవకాశం ఎక్కడిది.

కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతులకు అందిస్తోంది. నేను కొన్ని వేలమందికి పంచగలిగా. స్వయంగా దాదాపు 100 ఎకరాల్లో వాడుతున్నాను. జీవామృతం తయారు చేసుకోలేని రైతులకు ఇది వరం లాంటిది. కేవలం 20 రూపాయల ఖర్చుతో ఒక ఊరిలో ఉన్న రైతాంగాన్ని మొత్తంగా రసాయనిక ఎరువులు మాన్పించగల అద్భుత అస్త్రాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది ఎరువుల వాడకం తగ్గినపుడు పురుగు మందులు అవసరం సహజంగానే 80% వరకు తగ్గుతుంది అని నా అభిప్రాయం. ముఖ్యంగా ముల్చింగ్ మరియు మిశ్రమ పంటల పై అవగాహన పెంచుకోగలిగితే పూర్తిగా ప్రకృతి వ్యవసాయం లో పట్టుసాధించ వచ్చు అని అంటున్నారు శ్రీ రాంబాబు గారు.

ఈ ద్రావణం ఒక సారి తెచ్చుకుంటే, కొన్ని సంవత్సరాల వరకు పాలలో పెరుగు (చేమిరి) తోడేసినట్టు మనమే సులభంగా తయరు చేసుకోవచ్చును.

చాలా మంది దీని గురించి తెలుసుకొని తీసుకెళ్తున్నారు, కానీ పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు వారి కోసమే ఈ పోస్ట్. 


ఉపయోగాలు (Telugu & English)
https://drive.google.com/open?id=18MzJw2vG5Z8peYVfvLFJL0tfYgw_hkkX

https://drive.google.com/open?id=1hsXJKjSdBDztbDkC3n9dmwp04IEqDgmd


YouTube Videos







ఇందులో నా పాత్ర సేకరించి అందించడమే సుమీ.....

అమ్మ శ్రీనివాస్
9948885111
http://ammasocialwelfareassociation.blogspot.in/

12, జనవరి 2018, శుక్రవారం

లక్ష్య సాధకుని దృష్టి మొత్తం లక్ష్యం పైనే

ఒక మంచి లక్ష్యంతో మనం పనిచేస్తునప్పుడు మనం చేసే పనికి దేవుడే సమయానికి కావలసిన వనరులను ఏర్పాటు చేస్తూ వుంటాడు అనేది నేను బలంగా నమ్మే మరియు ఎప్పుడూ చెప్పే సత్యం.

ఇలా మనకు చాలా మంది అనుకోకుండా అవసరమైన సమయంలో వచ్చి అతుక్కుపోతారు, మనకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే కొన్ని సందర్భాలలో అలా తలలో నాలుకై అతుక్కుపోయారనుకున్న వారు కూడా అనుకోకుండా వెళ్లిపోతారు.

ఇంతకీ అసలు ఎందుకిలా రావడం, పోవడం అంటే...? ఒక్కొక్కరి ప్రాధాన్యతలు ఒక్కో రకంగా ఉంటాయి, అవి కాలాన్ని, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. సహాయం చేయడానికి వచ్చిన వారి ఆలోచనలు మారే ఆవకాసం ఉంది, కానీ పని ప్రారంభించిన వారి ఆలోచనలు సహజంగా లక్ష్యం మీద నుంచి మారవు.

మొదట నాయకుడు చేసే పని వ్యక్తిగత స్వార్ధం కోసం కాకుండా, నలుగురికి ఉపయోగపడేదిగా ఉండాలి. రెండు, అలా మొదలెట్టిన పనిలో ఎప్పుడు వ్యక్తిగతం అనే మాట రానీయక, లక్ష్యం కోసం / సంస్థ అభివృద్ధి కోసం (మంచి / కఠిన) నిర్ణయాలు తీసుకునేలా చూసుకోవాలి.

చేతులు కలిపి సాయం చెయ్యడానికి వచ్చిన వారు వ్యక్తిగత ప్రయోజనాల ఆశించకుండా ఉంటే ఖచ్చితంగా ఈ పరిస్థితి ఉండదు. కానీ వారి దృష్టి ఎప్పుడైతే స్వంత ప్రయోజనాల వైపు మారుతుందో అప్పుడు వీరి వల్ల సంస్థలకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఇక్కడ పని మొదలెట్టిన వ్యక్తి చూపు లక్ష్యం వైపు మాత్రమే మరియు చేసే పని ఎవరినో సంతృప్తి పరచడానికో, ఏదో ఆశించో కాదు కాబట్టి ఇలాంటి విషయాలు ఇతని దృష్టిని పెద్దగా ఆకర్షించవు. చెయ్యవలసిన ప్రయత్నం చేసి, ఇక లాభం లేకపోతే, మార్పు రాకపోతే మళ్ళీ తిరిగి తన పనిలో తాను నిమగ్నమైపోతారు. ఎందుకంటే లక్ష్య సాధ్యనలో వచ్చిన అందరిని కలుపుకొని పోవడం వీరి నైజం, అంతే కాని వారి కోసం లక్ష్యాన్ని  పక్కనపెట్టడం కాదు కదా. కాబట్టి అవసరమైతే నెగటివిటీ కి, తన పని నుంచి వెనక్కి లాగే వారికి, వెనక్కి లాగే వాటికి దూరంగా ఉంటారు అంతే కాని పోగొట్టుకోవాలని చూడరు.

ఇతనేమో ఎన్ని ఆటంకాల నడుమ అయినా అవకాశం చూస్తారు, వారేమో ఎన్ని అవకాశాల నడుమ అయిన ఇబ్బందులను చూస్తారు.. వీరి ఆలోచనా స్థాయి, మానసిక స్టైర్యం కొంచెం (చాలా) ఎక్కువగా ఉంటాయి. వారికేమో చేసే పనులలో ఇది ఒక పని మాత్రమే.. కానీ ఇతనికి ఈ ఒక్క పనే జీవితం, సర్వస్వం. అందుకే పని మొదలెత్తినవాళ్ళని కొంతమంది పని రాక్షశులు అని, ఇంకొంత మంది మొండి ఘటాలు అని, గొప్పోళ్ళు అని రకరకాలుగా కీర్తిస్తారు. ఎవరు ఎలా అనుకుంటారో అన్న దాన్నిబట్టి వారి ఆలోచనా విధానం, పరిపక్వత చెప్పేయ్యొచ్చు.

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే లక్ష్య సాధకుని దృష్టి మొత్తం లక్ష్యం పైనే, 23.55 నిముషాలు లక్ష్యం కోసం పని చేసి మిగతా 5 నిముషాలు చేయకపోయినా, వారికి మనసులో ఏదో వెలితి ఉంటుంది. మాములుగా చేసే వారికి రోజూ 5 నిముషాలు ఈ పని చేస్తేనే జీవితం మొత్తం దీనికి కేటాయించినట్టు అనిపించడం మానవ సహజం.

*హృదయలోతుల్లోంచి, జీవిత అనుభవాల్లోంచి...మదిలో మెదిలే భావాల సంపుటి....నా అంతంలేని ఆలోచనల తరంగం....అదే....నా అనంతరంగం...అమ్మ శ్రీనివాస్...*
2018/01/12 14:10

http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0

5, నవంబర్ 2017, ఆదివారం

ఈ రోజు నేను, నా పుస్తకం కథ...

నేనే కాదు...మనం అందరం బుక్స్ కొంటాం....  కానీ ఎన్ని చదువుతాం, ఎలా చదువుతాం లాంటి ఎన్నో ప్రశ్నలను పక్కన పెడితే, అసలు ఎలా భద్రపరుస్తాం అనేది మరో ముఖ్య ప్రశ్న? .... అసలు కొంటూ ఉండడం వల్ల మన దగ్గర ఏమి బుక్స్ ఉన్నాయో కూడా మనకు తెలీదు... కారణం భద్రంగా లోపల దాచిపెట్టడం వలన... దీనికి తోడు పాడైపోతాయేమో? అనే ఒక భావన... పుస్తకం తెచ్చుకొంది చదవడానికే కదా? మాసిపోకుండా దాచుకోవడానికా?..

నేనూ చదవాలి, రోజూ చదవాలి, అన్ని పుస్తకాలు చదివేయాలి, నాతో వుండే వాళ్లకి కొన్నాళ్ళకైనా ఎదో ఒక బుక్ చదవాలి అనిపించాలి... అందుకు ఏవేమి ఉన్నాయో అందరికి తెలియాలి..

ఇల్లు అలంకరణలో మనకు ఉపయోగపడనివి అన్ని అందరి మెప్పు కోసం ఉంచుతాం ? కానీ మన జీవితాల్ని ప్రభావితం చేసే వాటిని మనకీ, మన ఇంట్లో అందరికి, నలుగురికీ  తెలిసే విధంగా, కనపడే విధంగా పెట్టుకోవాలి కదా సుమీ, ఎందుకు సంకోచం.... అందుకే యుద్ధ ప్రాతిపదికన ఇది నిన్న కొని, ఈ రోజు మొత్తం సర్దుకున్నా...మనసుకు ఎంతో హాయిగా ఉంది.

మా అమ్మ, మా చరిత, మా చరణ్ అప్పుడప్పుడు చదివినా నా పంట పండినట్టే....నాతో, మా ఆవిడతో పాటు..గా...

ఆర్డర్లో పెట్టాను....అప్పుడే అర్ధమైంది ఇంకా కథల పుస్తకాలు చాలానే కొనాలని...

ఇది.... ఈ రోజు నేను, నా పుస్తకం కథ...

2017/11/05 22:40
నా అనంతరంగం అమ్మ శ్రీనివాస్
http://ammasrinivas4u.blogspot.in/search/label/1.%20నా%20రాతలు%20%2F%20My%20Writtings?m=0