1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

6, జూన్ 2009, శనివారం

నిజమైన నాయకుడివి కావాలంటే

నిజమైన నాయకుడివి కావాలంటే

జీవించు కర్తవ్యముకొరకు నిరంతరదీక్షతో
కనిపించు శక్తితోకూడిన దరహాసముతో
సృజించు ఉన్నతమైన ఆలోచనలతో
ప్రయాణించు ప్రస్ఫుటమైన లక్ష్యముతో
కస్టించు నిగూఢమైన పరమార్ధముతో

నిర్మించు నీసాంగత్యాన్ని అద్భుతశక్తితో
దయచూపించు ప్రజలపై ప్రేమానురాగాలతో
కురిపించు నీపరిచయస్తులపై హస్యపుజల్లులతో
మరపించు పారదర్సకమైన వ్యక్తిత్యముతో
కదిలించు కష్టకాలములో ఓర్మిబలముతో

ఈ అద్భుత గుణ సమన్వితమే నాయకత్వము

---------------------------ప్రభాకర రావు కోటపాటి

కామెంట్‌లు లేవు: