భారతీయుడా రక్షించు నీ ఘన కీర్తిని
సనాతన యుక్తము శక్తి యుక్తము సాంప్రదాయ యుక్తము ఈ భారతావని
యోగ భూమి ధర్మ భూమి త్యాగ భూమి నిర్మల భూమి ఈ ద్రుమదళ శోబిని
ఓ భారతీయుడా తెలుసుకో రక్షించు నీ అద్భత ఘన కీర్తిని
చతుసహస్ర వత్సరముల వెనుక ఉద్భవించినది యోగ శాస్త్రము ఈ మలయజ శీతల ప్రదేశమందు
రోగ నివారణమైన యోగ సాధన మరచి బానిసగా మారితివి నక్షత్ర వైద్యశాల యందు
విశ్వాస యుక్తుడవై యోగ విద్యను నిత్యము అవలంభించి మునిగి తేలు ఆనందమందు
నిగ్రహమూర్తులకు, విలక్షనవిసారధులకు ఏకాగ్రత సంపన్నులకు నిలయము ఈ భూవలయ దేవాలయము
గర్భగుడి లోనికి ప్రవేశించి వికృత ఘీంకార విన్యాసాలతో నర్తిస్తున్నాయి ధూమపానము మరియు మద్యపానము
ఈ జంట భూతాలను తుత్తునియలు గావించి వాటిపై ఆదిక్యతను సంపాదించి పెంపొందించు ఆరోగ్య శరీరము
ప్రకృతి జీవనము పాటించి ఆనంద సమేతముగా శాతాదిక్యము గా జీవించిరి ఈ సస్యశామలమందు
రోగ కారక బక్ష్యాలతో, అసహజ సంయుక్త ఆహారముతో, శక్తి నసించిపోవు చున్నది నీ దేహమందు
అమృతాహారము, సహజాహారము యుక్తాహారము సేవించి పెంపొందించు అమృత శక్తీ జీవనమందు
సుస్వరాల సంగీతము, సంబ్రమాశ్చర్యకారక నృత్య హేలలకు, సంఖ్యకు అందని కళలకు కాణాచి ఈ రస రంజని
విపరీత ధోరణితో, వికృత చేష్టలతో, అర్దరహితముతో, కర్ణ కఠోర విదేశీ సంగీతముతో నాసనమైనది నీ శ్రవణ భంజని
శాస్త్రీయ సంగీతముతో, నయనానందకర నటరాజ కదంబము తో చిగురింప చేయి నీ మనో రంజని
సిరి సంపదలతో ధన దాన్యములతో అనంత ఆహార దాన్యములతో విలసిల్లినది ఈ అన్నపూర్ణ
కూడు లేక గుడ్డ లేక గూడు లేక విద్య లేక విజ్ఞానము లేక అలమటించు చుంటిరి నీ సోదర పూర్ణ
మానవత్వాన్ని ప్రదర్శించి సమగ్ర సంస్కరణలకు శ్రీకారము చుట్టి నెలకొల్పు సమ సమాజ పరిపూర్ణ
విజ్ఞాన శాస్త్రవేత్తలతో నిర్మాణ నిపుణులతో సృజనాత్మక సుప్రసిద్దులతో ప్రసిద్ది చెందినది మహోజ్వలమూర్తి
పాశాత్య ఉత్పత్తులకు బానిసలై ఆత్మాభిమానము నశించి క్రొత్త దనము లేక సోమరులైరి అఖిల జనావర్తి
ఉత్తేజాన్ని నింపి ఆలోచన నెలకొల్పి పరిశోధనలు చేసి శోధించి సాధించు పారిశ్రామిక ప్రపంచ కీర్తి
ధర్మదక్షులు నిజాయితీ నిబద్దులు ప్రజారంజక ప్రభువులు పాలించిరి ఈ భాగ్యవిధాత ను
సుద్ద సుంఠలు నిరక్షర నిరర్దకులు కర్కోటకులు కొందరు ఆక్రమించిరి అధికారము ను
విశ్లేషనాత్మక విజ్ఞానముతో ప్రజ్వలించే ప్రజాస్వామ్యము తో ఎంపిక చేయి భారత నాయకత్వమును
సకలకళా సంసిద్దులను వివేక విదురులను సరస్వతీ స్వరూపులను కన్నది ఈ జగజ్జనని
విచక్షణా విహీనులకు అక్షర శూన్యులకు మానసిక వికలాంగులకు నిలయమైనది ఈ సుందరావని
అక్షర దీపము వెలిగించి సర్వోదయ విద్యను ప్రోత్సాహించి నిర్మించు జన రంజక భారతావని
స్వీయ సాదికారత్వముతో పాడిపంటలతో ఐకమత్యబలము తో నడిచినది ఈ ఉచ్చల జలధి తరంగ
కీచులాట పోరాటములకు స్వార్ధపరుల అసూయలకు అసాంఘీక శక్తులకు ఆశ్రయమైనది ఘోరము గా
దేశ క్షేమమే పరమావధి గా స్వార్ద రాజకీయాలకు అతీతంగా రూపొందించు భారత దేశాన్ని విశ్వ విఖ్యాత అధినేత గా
ప్రభాకర్ రావు కోటపాటి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి