ఠాగూర్ గీతాంజలిలోని ఓ పద్యాన్ని చూద్దాం. స్వర్గీయ ఇందిరాగాంధీ సైతం తన బల్ల మీద ఆ కవితా పంక్తులను పట్టం(frame) కట్టించుకొని పెట్టుకుందట. ఆ కవితా పంక్తులు…తెలుగులో…..
ఒక్కరైనా నీ కేకవిని
ఓ యని రాకున్నా…
ఒక్కడవే బయలుదేరు
ఒక్కడవే, ఒక్కడవే, ఒక్కడవే
ఒక్కడవే బయలుదేరు.
జీవితం ప్రయాణంలో గమ్యాన్ని చేరుకోవడామే ముఖ్యం కాదు…అప్పటికి ముసలివాళ్లమో, సాధించినదాన్ని మనసారా ఆశ్వాధించలేని పెద్దవాళ్లమో అయిపోవచ్చు కూడా. అందుకే ప్రయాణం మొత్తాన్ని ఆశ్వాధించడం నేర్చుకోండి.
సంతోషమైనా, విషాదమైనా…
ప్రశ్న అయినా, జవాబైనా…
మీకు మీరే!
అలాంటి మనస్తత్వం మీలోఎంతగా పెంపొందితే అంతగా మీరు మిగతా ప్రపంచంలో మమేకమవుతున్నట్టు. కాని ఒక్కటి మాత్రం మరవకండి.
Being independent is not enough, be interdependent.
మీ గురుంచి కొన్ని విషయాలు:
౨. మీకు మీరే ‘ఆప్త మిత్రుడు’. మీకు మేరే ‘బద్ద శత్రువు’.
౩. చాలా సందర్భాలలో మీకు మీరే సాయం చేసుకోవాల్సి వుంటుంది. మీకు మీరే ధైర్యం చెప్పుకోవల్సి వుంటుంది. మీకు మీరే ఉత్సాహం కల్పించుకోవాల్సి వుంటుంది.
౪. అసలు మీకు మీరెంతగా తెలుసు? కష్టసుఖాల్లో… సమస్యల్లో …మీమీద, మీ ఆలోచనా శక్తి మీదే మీరేమేరకు ఆధారపడవచ్చో సరైన అంచనాకు రండి.
౫. మీ జీవన ప్రయాణంలో అనుభవాల ‘పదనిసలు’ మీవే. గెలుపు, ఓటముల మజిలీల దగ్గర మీ మానసికస్థాయి ఎప్పుడూ పొంగిపొర్లిపోయే వృధా వాగునీరు కాకూడదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి