
ఓ సరస్సు ఒడ్డున కొంతమంది విదేశీ యువకులు నిలబడి తమ చేతిలో ఉన్న తుపాకులతో నీటిమీద తేలుతున్న కోడిగుడ్డు డొల్లలను గురిచూసి కాల్చసాగారు. కాని వారి గురి తప్పుతోంది. ఆ దోవనే వెళుతున్న ఓ కాషాయ వస్త్రధారి అది గమనించి ఓ యువకుడి వద్ద నుండి తుపాకి తీసుకుని వరుసపెట్టి కోడిగుడ్డు డొల్లలను కాల్చాడు. ఆశ్చర్యం! ఒక్కటి కూడా గురి తప్పలేదు. అప్పుడు ఆ విదేశీ యువకులంతా కాషాయ వస్త్రధారితో “షూటింగ్ లో మీకు గొప్ప అనుభవం ఉండి ఉండాలి అవునా?”అనడిగారట. దాని కాయన నవ్వుతూ “లేదు! నాకు షూటింగ్ లో అనుభవం లేదు. అసలు తుపాకీ చేతపట్టుకుంది ఇప్పుడే, ఇదే తొలిసారి. కానీ మీకు నాకు ఒక్కటే తేడా. నేను తుపాకీ చేతపట్టగానే కాల్చగలను అని నాకు నేనే ధైర్యం చెప్పకున్నాను. గురి చూసేటప్పుడు సాధించాలి అనే పట్టుదలను నా చూపుడు వేలిలో ఉంచి, మనస్సును ఏకాగ్రతతో నా లక్ష్యం వైపు గురిచూసాను. నా సర్వశక్తులనూ దాని మీదే కేంద్రీకరించాను. అంతే! సాచించగలిగాను” అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడట ఆయన. విదేశీ యువకులంతా తమకంత దృడనిశ్చయం లేనందుకు సిగ్గుపడుతూ అక్కడి నిండి వెళ్ళిపోయారట. ఇంతకూ ఆ కాషాయ వస్త్రధారి ఎవరో తెలుసా? స్వామి వివేకానంద.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి