అవును, జీవితం చాలా అందమైనది. మన జీవితం పలు అంశముల సమ్మేలనం:
ప్రాణం – వెలకట్టలేనిది
భాందవ్యాలు – మనిషి సంఘజీవి, అతనికి ఇవి ఎంతో అవసరం
ప్రేమ - ప్రేమ ఎటువంటిదైనా కావచ్చు; ఆ ప్రేమ మనిషి జీవితానికి రంగులు పులుముతుంది, జీవితం మీద ఆసక్తిని పెంచుతుంది.
ఇంకా మరెన్నో…….
ప్రతి ఒక్కరు తనకున్న అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. వారికందిన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మన కర్మలకు మనమే కారణం. మనకున్నది ఒక్కటే జీవితం, దాన్ని పరిపూర్ణంగా జీవించాలి, అనుభవించాలి… అనుకున్నదాని పొందాలి, ఆశ్వాదించాలి.
“యద్భావం తద్భవతి” అని అన్నారు మన పెద్దలు. పచ్చకామర్ల వాడికి లోకమంత పచ్చగా కనిపించిందంటా. ఇక్కడ లోపం ఈ లోకంలో కాదు, అతని దృష్టిలోనిది. ఆ విధంగానే నిరాశతో-భాదలలో మునిగి-నిస్పృహతో చూస్తే జీవితం ఒక కురూపి వలె కనిపిస్తుంది. అదే ఆశతో-అనందంతో-అనుభవించాలనే తపనతో గనక చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. దాన్ని ఇంకా మనోహరంగా తీర్చిదిద్దుకోవడం మన చేతులలో ఉన్నది.
ఔరా!! అరవైలో వల్లించాల్సిన మాటలు, వీడు ఇవరైలో చేస్తున్నాడేంటి?? అని మీరు అనుకోవచ్చు. నేను అరవైలో కూడా ఇరవై లాగా ఉండాలని అనుకునేవాడిని.
నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఈ అపురూపమైన అవకాశాన్ని అందించిన భగవంతుడికి, నాకు అనుక్షణం తోడుండి సాయపడే నా మిత్రులకు, భవదీయులకు నేను శిరస్సు వంచి ప్రణవిల్లుతున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి