1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

19, ఆగస్టు 2009, బుధవారం

రామకృష్ణ పరమహంస వర్థంతి సందర్భంగా

  • రామకృష్ణ పరమహంస ఎప్పుడు జన్మించారు--1836 (ఫిబ్రవరి 18).
  • రామకృష్ణ పరమహంస అసలుపేరు--గధాధర చటోపాధ్యాయ.
  • రామకృష్ణ పరమహంస ఎక్కడ జన్మించారు--కామర్పుకూర్ (పశ్చిమ బెంగాల్).
  • రామకృష్ణ పరమహంస తల్లిదండ్రుల పేర్లు--ఖుదీరామ్, చంద్రమణిదేవి.
  • రామకృష్ణ పరమహంస భార్య పేరు--శారదాదేవి.
  • రామకృష్ణ పరమహంస సందేశాలను పాశ్చాత్య దేశాలకు వ్యాపింపచేసినది--స్వామి వివేకానందుడు.
  • రామకృష్ణ పరమహంస బోధనలను ప్రచారం చేయడానికి స్వామి వివేకానందుడు స్థాపించిన సంస్థ--రామకృష్ణ మిషన్.
  • రామకృష్ణ మిషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది--1897.
  • రామకృష్ణ పరమహంస ఏ దేవాలయంలో పూజారిగా పనిచేశారు--కోల్‌కత లోని దక్షిణేశ్వర కాళి దేవాలయంలో.
  • రామకృష్ణ పరమహంస ఎప్పుడు మరణించారు--1886 (ఆగస్టు 16).

కామెంట్‌లు లేవు: