1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

8, జనవరి 2010, శుక్రవారం

సచిన్ టెండూల్కర్ లా ఆలోచిస్తే ఇంతటి విధ్వంసాలు జరుగుతాయా


సచిన్ టెండూల్కర్ లా ఆలోచిస్తే ఇంతటి విధ్వంసాలు జరుగుతాయా?


సచిన్ ఆట గురించి మనకు తెలుసు. క్రింది సంఘటన చూస్తే మన ప్రవర్తనతో ఎదుటివారి మనసులను ఎలా గెలుచుకోవచ్చో తెలుస్తుంది.

ఆ మధ్య ముంబాయిలో ఒక కొత్త ఇల్లు కట్టుకొన్నాడు. అతను అలా కట్టుకోవడం వలన తమ ప్రాంతంలో ఇళ్ళ ధరలు పెరిగాయని ,సచిన్ అంతటివాడు తమ మధ్యకు వస్తున్నాడని అందరూ ఆనందించారు. కాని సచిన్ ఇల్లు కట్టుకొనేప్పుడు ఎదుటివారికి కలిగే అసౌకర్యం గురించి ఎంత ఆలోచించాడంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటి వారికీ స్వయంగా ఉత్తరాలు వ్రాశాడు. ఆ ఉత్తరం లోని విషయం ఇది.

" నేను మీ ప్రాంతములో ఇల్లు కట్టుకొంటున్నానుఅది పెద్ద ఇల్లు ఇంటినిర్మాణమప్పుడు ఎన్నో లారీలు పగలు,రాత్రీ తిరగవలసి వస్తుందిఇంకా ఇంటినిర్మాణంలో బండలు పగలగొట్టవలసి వస్తుందిచిన్నచిన్న డైనమెట్లు కూడాఅందుకు ఉపయోగించవలసి వస్తుందిఎవరికీ దెబ్బలు తగులకుండాఏర్పాటుచేసాముకాని శబ్దం చాలా ఎక్కువగా ఉంటుందిపగలురాత్రీ అని తేడాలేకుండా పని చేయాల్సి ఉండడం వలన మీకు చాలా అసౌకర్యంగా ఉంటుంది.నన్ను మన్నించగలరు ప్రాంతంలోకి నేను చేరిన తర్వాత నేను మీ కాలనీఅనే కుటుంబంలో ఒక సభ్యుడను అవుతాను కదా.

ఒక కుటుంబములో ఒక కొత్త సభ్యుడు రావడం అనేది ఒక తల్లికి బిడ్డ పుట్టడంలాంటిదితల్లి నవమాసాలూ మోసేటప్పుడు చాలా కష్టాలు పడవలసి వస్తుంది.అప్పుడే బిడ్డ రాగలడుఅలానే మీ కాలనీ అనే కుటుంబములోనికి నేను కొత్తగావస్తున్నాను కాబట్టి అందుకు మీరు కొంత కష్టం పడవలసిఉంటుంది అని తెలుపడానికి బాధపడుతున్నాను.నన్ను మీ కుటుంబములోనికిచేర్చుకుంటారని ఆశిస్తున్నాను."

అసలు సచిన్ రావడమే తమకు ఎంతో గొప్పగా, ఆనందముగా భావించారు ఆ ప్రాంతవాసులు. ఐనా వారు ఏమీ అనలేదని సచిన్ ఊరుకోలేదు. వారి అసౌకర్యం ఊహించి ఎంత గొప్పగా వ్రాశాడో కదా.

ఇలా ఎదుటివారికి కలిగే బాధను మన విధ్వంసకారులూ (చీటికీమాటికీ ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్తులను తగులబెడుతున్నవారు) తెలుసుకొంటే బాగుంటుంది కదా

కామెంట్‌లు లేవు: