1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

24, ఫిబ్రవరి 2010, బుధవారం

మనకు మన జీవిత పరమార్ధాన్ని సాధించడానికి అవసరమైన లక్ష్యాలపై గురి, అవగాహనా ఉన్నప్పుడు...

మనకు మన జీవిత పరమార్ధాన్ని సాధించడానికి అవసరమైన లక్ష్యాలపై గురి, అవగాహనా ఉన్నప్పుడు... ఎలాంటి చిన్న ఆకర్షణలకు లోను కాకుండా, జీవితం అంటే ప్రేమ లేదా మరేదో మాత్రమే అనే ఆలోచనలనుంచి బయటపడి..జీవితాన్ని జయిస్తాం,గెలుస్తాం,అర్ధవంతంగా ముగిస్తాం,జీవితమంటే కష్ట -సుఖాల,ఎగుడు -దిగుళ్ళ , గెలుపు-ఓటముల, తీపి-చేదుల,మంచి-చెడుల సంగమం,జీవితం ఒక గొప్ప వరం,కొన్ని మజిలీల గమ్యం. ఏదో ఒక్క మజిలీ దగ్గరే ఆగిపోతే మరి మిగతా వాటిని చేరుకొనే/అనుభవించే అవకాశం కోల్పోతాం...ఏదో ఒక చిన్న దానిని కోల్పోయాం అని విచారిస్తూ కూర్చుంటే (ఆగిపోతే),జీవితంలో పొందాల్సిన ఎన్నో పెద్ద పెద్ద ఆనందాలను కోల్పోతాం. కాబట్టి ఎలాంటి కష్టాలనైనా ఆనందంగా ఎదుర్కొంటూ జీవితాన్ని ప్రతి క్షణం ఆనందంగా అనుభవించు. (24.02.10, 4.10AM)

కామెంట్‌లు లేవు: