నన్నెంతగానో ప్రభావితం చేసిన సినిమా రుద్రవీణ ముఖ్యంగా సినిమా లోని పాటలు: సంగీతము మరియు సాహిత్య పరంగా.
ఒంటరిగా దిగులు బరువు మోయ బోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనేగద గుండెబలం తెలిసేది
దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది
మంచైన చెడ్డైనా పంచుకోను నేలేనా
ఆమాత్రం అత్మీయతకైన పనికిరాన
ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలు లేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండి
పై పల్లవిలో మొదటి నాలుగు వాక్యాలు చదివినా విన్నా మననం చేసుకున్నా దుఃఖ తప్త హృదయానికి సేద తీర్చి బుద్ధికి పదును పెడుతుంది.దుఃఖించడం వల్లనో బాధపడటం వల్లనో మన సమస్య(లు) తీరేవైతే ఈ ప్రపంచంలో అందరూ అట్లాగే చేసుకుని తమకంటూ ఏ సమస్య(లు) లేకుండా ఉండేవారు. మనకొచ్చిన సమస్యలను తీర్చుకునే ప్రయత్నం చెయ్యాలి ..ఆ దిశగా సాగిపొవాలి…ఈ పయనం మన వ్యక్తిత్వ వికాసంలో ఒక అధ్యాయం అవుతుంది…అంతే కాని దాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు.మనస్సులోని దుఃఖమును సన్నిహితులతోను,శ్రేయోభిలాషులతోను చెప్పుకొనక మనలోనే దాచుకుంటే కొన్నాళ్ళకు గుండెకు సంబంధించి మరియు ఇతర అరోగ్యపరమైన సమస్యలు వస్తాయే తప్పితే వున్న సమస్యలు పొవు పైగా సంతోషమనే మంచిని పంచుకుంటే పెరుగుతుంది.దుఃఖమనే చేడుని పంచుకుంటే తరుగుతుంది అన్న నిజాన్ని చాటే ఈ పాట నాకెంతో ప్రియమైనది.
వసంతాల అందం విరబూసే ఆనందం
తేటి తేనె పాట పంచవన్నెల విరి తోట(2)
బతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాట(2)
ప్రకృతిలో మనకి ఆరు ఋతువులు వున్నయి..వసంతమొక్కటే లేదు కదా!మనకు అన్నింటికన్న వసంత ౠతువే అందంగా ఆకర్షణియంగా కనపడవచ్చు.కాని మిగితా కాలాల్లోని అందం/ఆనందం చూడగలిగితే అవన్నీ కూడ మనకు రమణీయంగానే కనపడతాయి.కాని ఎప్పుడూ వసంత కాలం వుంటే నిత్యం variety కోరుకునే మనిషికది విసుగు పుట్టవచ్చు..విసుగు సంగతి పక్కన పెడ్తే…ప్రతీ జీవి మనుగడకు వసంత కాలమొక్కటే కాదు మిగితా ఋతువులు కూడ అవసరం…
పైన ప్రస్తావించిన విషయం మన సమజాంలో నేడు చదువు,ఉద్యోగం,పెళ్ళీ లాంటి అన్ని విషయాలకు కూడా వర్తిస్తుంది.ప్రస్తుత కాలంలో అన్ని విషయాలలోను competition నుంచి cut-throat competition వరకు వెళ్ళిపోయింది..ఫలితం ఇంజినీరింగ్,మెడిసెన్ చదువులు చదివితేనే అందులోను అధిక శాతంతో ఉత్తీర్ణులవుతేనే గాని సుఖవంతముగా జీవితం గడపటానికి కావల్సిన ఉద్యోగాలు,పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మంచి సంబంధాలు రావటం లేదు.దీనికి MNC’S లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ప్రోత్సహాన్నిస్తున్నయి. ఫలితం..ba,bsc,b.com లాంటి చదువుల విలువ చివరకు పడిపోయింది.
మనిషి తన జీవితమును సుఖమయముగా చేసుకోవడానికి సాంకేతిక విఙ్ఙానమును ఆశ్రయించి శ్రమ తగ్గించికుని,వినోదం పెంచుకుని ఎంతో లాభం పొందాడు.మనిషి ఎంత ఘనమైన అభివృద్ధిని సాధించినా అతని కంటూ ఒక బలమైన వ్యక్తిత్వం లేకపోతే అతను సాధించిన విజయాలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.మరి బలమైన వ్యక్తిత్వం ఏర్పరుచుకోవాలంటే ఎలా? మనం పుట్టీ పెరిగిన పిదప ప్రస్తుతముంటున్న వాతరవరణము కాకుండా మనపై మన తల్లి తండ్రులు ఇతర పెద్దలు,గురువులు, సన్నిహితులు,స్నేహితుల ప్రభావము,ఆపై జీవితంలొ ఎదురయ్యే పరిస్థితులు-అనుభావలు ఇలా ఎన్నో విషయాలు మనపై ప్రభావం చూపించి మన వ్యక్తిత్వాన్ని ఏర్పరచడంలో దాహోదం చేస్తాయి.ఇవి అంతా ఒక ఎత్తైతే,మన సంస్కృతి సాంప్రదాయలు అంటే ఎమిటో,వాటి వెనుకనున్న అర్ధము-పరమార్ధము,ఏది తప్పు-ఏది ఒప్పు అయితే అవి ఎందుకు తప్పు ఎందుకు ఒప్పు లాంటివి ఉదాహరణ సహితంగా వివరంగా తెలిపి మనలో నైతిక విలువలను పెంచే సాహీతీ సంపద(literature),అలాగే మన పూర్వీకుల కాలం నాటి విశేషాలు నాటి పద్దతులు,వారి అనుభవ సారన్ని అలాగే వాల్రి చేసిన తప్పొప్పులను నిష్కర్షంగాను చెప్పి మన కళ్ళముందుంచి మనను ఆలోచించేలా చెయ్యగలిగే చరిత్ర(history),అర్ధికంగా అభివృద్ధి చెందెదుకు అర్ధిక శాస్త్రం(Economics), సమాజికంగా ఎటువంటి కొట్లాటలు గొడవలు లేకుండా అందరూ సామరస్యంగా ఎలా సుఖంగా వుండాలో తెలిపేటువంటి సాంఘిక శాస్త్రం(civics) లాంటి మానవతవపు విలువలు గల చదువులకు(arts and humanities studies) నేడు ఈ దుస్థితి ఎమిటీ? వాతీకి మనమే సరైన ఆదరణ లేదని చిన్న చూపు చూసి నిరాదరించి నిరుత్సాహ పరచటం ఎంత వరకు సమంజసం?
ఒక పక్షి ఆకాశంలో ఎగారాలనంటే దానికి రెండు రెక్కలూ కావలి. మనిషికి చూపు బాగుండాలంటే ఒక కన్ను సరిపొదు.రెండు కళ్ళూ కావలి.అలాగే మనిషి అరోగ్యంగా వుండాలంటే ఏ కొద్ది భాగమో సరిగ్గా పనిచేస్తే సరిపోదు అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలి..ఆలగే దేశం సంపూర్ణ అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాలలోను అభివృద్ధి చెందాలి.ఏ ఒక్క రంగంలొనే విజయం సాధిస్తున్నదయితే అది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం క్రిందకి పరిగణలోకి వస్తుందే తప్ప అభివృద్ద్ధి చెందిన కేటగరి క్రింద కాదు.
ఇదే విషయాన్ని మరింత అందంగా చెప్తున్నారు మన సీతారామశాస్త్రిగారు ఈ క్రింది పంక్తులలొ…
ఏటి పొడుగున వసంతం ఒకటేనా కాలం
ఏది మరి మిగతా కాలాలకు తాళం
నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు
కంటి నీటి కుంబవృష్టి జడిలో ఇంకొకడు
అలాగే….
ఎడారి బ్రుతుకున నిత్యం చస్తూ సాగె బాధల బిడారు
దిక్కూ మొక్కూ తెలియని దీనుల వ్యదార్థ జీవన స్వరాలు
నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి
ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరిచెయ్యాలి
జనజీవిని ఒద్దనుకుంటూ నాకు నేనే పెద్దనుకుంటూ
కలలో జీవించను నేను కలవరింత కోరను నేను
మన అభివృద్ధిని ఒక్కటే చూసుకోకుండా..అప్పుడప్పుడు మన పక్కనే వున్న అవసరములో నున్న వాడిని కూడ గమనించి సాయం చెయ్యమని కవి చెప్తున్న తీరు రమణీయం.మనం సహాయం చెసెటప్పుడు అవరోధాలు రావచ్చు అయినా వాటిని అధిగమించి ముందుకెళ్ళగలగాలి..అదె ధైర్యవంతుల లక్షణం.మనలని మనము సరి దిద్దుకుంటూ మనం వుంటున్న సమాజం కోసం మనము ఏదో ఒకటి చెయ్యాలి…అన్న స్పూర్తిని కలిగించే ఈ పాట సినీ వినీలాకాశంలో ఒక ధృవ నక్షత్రం.
ఇప్పుడు మరో పాట
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం
తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం
గగనాల దాక అలసాగకుంటె మేఘాల రాగం ఇల చేరుకోదా
ఈ పాట వింటున్నప్పుడల్లా నాకు బానే అనిపిస్తుంది.కాని సాహిత్యంలోనున్నా భావమేమిటి?
కవి వుద్దేశమేమిటన్న ప్రశ్నకు రకరకాల ఆలోచనలుప్పొంగ్గాయి.మొత్తం పాట అంతా గమనిస్తే సమాజాన్ని ఉద్దేశించి రాసినట్లుగా అర్ధం అవుతుంది.తన దగ్గరకు రాకపోయినా వనాల దగ్గరకు వసంతం ఎలా వస్తుందో పిల్లలు తమను ఆదరించకపోయినా,ప్రేమగా చూసుకోకపోయినా నిస్వార్ధంగా ప్రేమిస్తూనే మరింత దగ్గరకు వస్తూంటారు (కనీసం రావడానికి ప్రయత్నిస్తూంటారు) తల్లితండ్రులు.అలాగే సముద్రపు నీరును తీసుకోకుండా మేఘమెట్లా వర్షించదో తల్లితండ్రుల ప్రమేయం లేకుండా పిల్లలు అభివృధ్ధి పధాన నడిచి విజయ పతాకమును ఎగురవేయలేరు.కుటుంబ పరంగా అంతర్లీనంగానున్న అర్ధం తీసుకున్నాం.సామజికంగా కూడ చూడవచ్చూ!మనం సరిగ్గ చూసినా చూడకపొయీన న్యాయమైన ధర ఇచ్చినా ఇవ్వక పోయినా పల్లెల్లో మన కోసం రైతులు పంటలు పండిస్తూనే వున్నరు.అలాగే జీవనం గడపడానికి చిన్న చిన్న జీతాలకే పేదలు వుద్యోగం చేస్తున్నరు. ఎంతో శ్రమ పడి రాత్రి తెల్లవారుఝాములలో నగర వీధులలో వూడ్చి రోడ్లను శుభ్రం చేసిన తరువాత కూడా విద్యావంతులు,నిరక్షరాస్యులు,ధనవంతులు,పేదవారు, తమ తమ స్థాయిని,దేశ సౌభాగ్యాన్ని,పరిశుభ్రతను మరిచి,కిళ్ళీలను బాగ నమిలి ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేయ్యడం, మూత్రవిసర్జానాది కార్యాలను నిర్లజ్జులై, విచక్షనారహితులై చేస్తుంటే దేశం పరిశుభ్రంగా ఆరొగ్యంగా అభివృధ్ధి పధాన నడిచేదెపుడు? మేమింత చేస్తున్నా ఈ ప్రజలు ఇంతే నని వీరు శుభ్రపరచకుండా వుంటే అప్పుడు మన పరిస్థితి మన దేశ పరిస్థితి ఎలా వుంటుందో నన్న ఊహే భయం కలిగిస్తోంది.మనం ఇలా వున్నా
మంటే ఆ క్రెడిట్(ఉదాహరణకి దేశాన్ని శుభ్రంగా వుంచడం వుంచకపోవడం) ఈ సమాజలోంనున్న కొంతమందికే కాకుండా ప్రతి యొక్క వ్యక్తికీ చెందుతుంది
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా
ఎల్లలులేని చల్లని గాలి అందరికోసం అందునుకాదా
ప్రతి మదినిలేపే ప్రభాత రాగం
పదే పదే చూపే ప్రధాన మార్గం
ఏవి సొంతం కోసం కాదను సందేశం
మంచినే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కధ దిశనెరుగై గమనము కద
భగవంతునిలో సృష్టిలో ప్రతీ జీవి మానవుడు తప్ప జీవరాశులన్నీ అందరికోసం పాటుపడుతున్నాయి. పంచభూతాలైన ఆకాశం,భూమి,నీరు,నిప్పు,వాయువు జీవురాశులన్నిటికి ప్రాణాధారమై సేవిస్తున్నయి. వృక్షాలు అనేక రాకాలుగా సేవించి మనిషి,జంతువుల ప్రాణాలు నిలబెడ్తున్నాయి.మరి మనిషి ఎందుకు తన స్వార్ధానికి తాను ఉపయోగించుకుంటున్నడే తప్ప ఇతరులకు ఎందుకు ఉపయోగపడటంలేదు?ఎ దశాబ్దానికో శతాబ్దానికో ఒకరో ఇద్దరో మహా అయితే పది మంది కన్నా ఎక్కువ ఉండరు.
చెట్లు వల్ల లాభాలు ఎమిటి?చెట్లను నాటి పెంచడం వల్ల లాభమేమిటి?అవి మనకు ఎట్లా సేవిస్తున్నయి?మనకు ప్రాణవాయువును ఎట్లా అందిస్తున్నాయి?భూగర్భంలో నుండే నీటీని నిర్మలంగా ఎలా వుంచుతున్నాయి?మేఘాలు కురిపించే వర్షాన్ని నీటి నిలువలను పరిశుభ్రంగా వుంచడంలో ఎలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నయి?తాగే నీటిని,సముద్రపు నీరుని కాలుష్యం చెస్తే ఆపై జరిగే పరిణామాలేమిటి? ఈ శబ్ధ,నీరు,వాతవరణ కాలుష్యం వల్ల ప్రజా జీవనానికి,ఇతర జీవుల మనుగడకు ఎంత కష్టమవుతుందన్న ఆలోచనా లేకుండా ప్రజలు తమ తమ స్వార్ధం కొద్ది నిర్లక్ష్యంగా,బాధ్యతారహితంగా ప్రవర్తించడం ఎంత వరకు సబబు?అలాగే పశుపక్ష్యాదుల జాతులలో ఒక్కటి మిగలకుండ వినోదం పేరుతో సంహరించడం,భక్షించడం ఎంతవరకు న్యాయం?మన కోసమున్న ఈ ప్రకృతిని మనొక్కరిదేనన్న భావనతో మంచిగా వుంచుతాన్నొ మాలిన్యపరచుతానో నా ఇష్టం అన్న వైఖరిని వీడినాడి ఈ ప్రకృతి మన అనదరిది మన స్వార్ధం కొద్ది పాదుచెసుకున్నం..ఇప్పటికన్న మేల్కొని మన ప్రకృతిని బాగు పరచి మనం బాగుపది భవిష్యత్ తరానికి బంగారు భవిష్యత్తునిద్దం అన్న వైఖరిని పెంచుకుని ఇక నుంచి అయినా బాధ్యతాయుతంగా ప్రవర్తించుదాం అని శపధం చేసి అందుకు పాటు పడదాం. మనిషిగా మన వాతావరణాన్ని కాపాడుకునే బాధ్యతతో పాటు సాటి మనిషికి సహాయపడటం మన విధి.భాస్కరుడు ఉదయాన్నే తన కిరణాల ద్వారా సకల జీవకోటిని మేల్కొలిపి దారి చూపే మార్గదర్శకుడు ఎలా అవుతాడో, మనము అదే విధంగా మన ఒక్కరికోసమే కాకుండా నలుగురికోసం బ్రతకాలి.మంచి తనమే లేకపొతే మన జీవితాలు వ్యర్ధము.మంచినెరుగని మనుగడ దిశ నెరుగని మనుగడ అని కవి వాఖ్యానించారు.
బ్రతుకున లేని శ్రుతి కలదా ఎదసడిలోనే లయలేదా
బ్రతుకున లేని శ్రుతి కలదా ఎదసడిలోనే లయలేదా
ఏ కళకైన ఏ కలకైన జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వ్రుధా వికాసం
కూసే కోయిల పోటే కాలం ఆగిందా
మారే ఏరే పారే మరో పదం రాదా
మురళికి గల స్వరమున కళ పెదవిని విడి పలకదుకద
ఈ సినిమా సంగీత ప్రధానమైనది కాబట్టీ సంగీతము గురించి కూడ కొంచెం చెప్పుకుంటే బావుంటుంది..!ప్రకృతి లాగే సంగీతం కూడ అందరిదే ఏ ఒక్కరిదో కాదు!ఆస్వాదించే మనసు,సకల కళలకు ఆది దేవత అయిన సరస్వతీ కటాక్షం వున్న ప్రతి ఒక్కరిది!అటువంటి సంగీతం మన ఒక్కరిదే అని చెప్పి మన ఆనందం కోసం ఏటువంటీ ప్రయోజనం లేకుండా చేయ్యడం మనకు తగని పని.ఇదే విషయాన్ని మనకు పై పంక్తులలో రమణీయంగా చెప్పారు మన సిరివెన్నెల గారు.
మనసులో అనుభూతులను నలుగురితో పంచుకోవాలి అన్న ఆకాంక్షకు రూపం ఈ నా ప్రయత్నం.నాకు మన దేశం గురించి,మన సంప్రదాయాలు,అలవాట్లు, ఆచారాలూ,పద్దతులు మరియు మనం ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానం అన్న,దాని గురించి తెలుసుకోవడం అన్న,చెప్పడం అన్న చాలా ఇష్టం.అందుకే నా అంతరంగాన్ని,భావాలను,నాకు తెలిసిన,నేను సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గర చేర్చాలనే ఈ బ్లాగ్ స్టార్ట్ చెయ్యడం జరిగింది.నేను ఎక్కడైనా చదివిన,చూసిన,నాకు తెలిసిన మంచి సమాచారాన్ని ఇందులోపొందుపరచి అందరికి ఒక బ్లాగ్ లో ఇవ్వాలని ఆసిస్తూ మీ శ్రేయోభిలాషి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి