1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

25, ఫిబ్రవరి 2010, గురువారం

కలువ

ఈ పుష్పం ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పుష్పంగా గుర్తింపు పొందినది. కలువ పువ్వు  చాలా అందమైనది. కలువపువ్వు అనేది అనేక మెత్తని మృదువైన రేఖలు కలిగి ఉండి, చెరువులలోను, కొన్ని నీటి కుంటలలో, కాలువలలో కనిపిస్తుంది.

"కలువ పువ్వుకు కింద ఉండే కాడను మృణాళం అంటారు.కలువ పువ్వు అందాన్ని అందరు చూస్తారు. కాని దానిని అంత అందంగా నిలబెట్టి, తనను తాను బురదలో దాచుకునే ఆ కాడను ఎవరు గమనించరు.

కాడనుంచి పువ్వును విడదీసిన కాసేపటికే పువ్వు జీవం లేనిది అవుతుంది. ఆ కాడకు ఉన్న ప్రత్యేకత అది.

ప్రకృతిలో నిక్షిప్తమైన ఎన్నో అందాలను అందరం గమనిస్తాం. కాని వాటికే మాట వస్తే? వాటి వెనుక దాగి ఉన్న సునిశిత భావాలను కూడా మనం గమనించగలిగితే.. అవి మరింత రమణీయంగా ఉంటాయో కదా..

అటు వంటి అందాలను సేకరించి వాటికి భావకవుల నోట జాలువారిన పదాల సిరిజల్లులను సమకూర్చితే ప్రకృతిలోని అనిర్వచనీయమైన అందాలన్నీ మనకు అతి చేరువలోకి వచ్చినట్లు కాదా?"

ఈ భావనతోటే కలువ పూవును తలపిస్తూ ఓ తెలుగు బ్లాగరి తన బ్లాగుకు మృణాళం అని పేరు పెట్టుకున్నారు.

లక్షణాలు
భూగర్భ కొమ్ముగల బహువార్షిక గుల్మం.
ఇంచుమించు గుండ్రంగా ఉన్న సరళ పత్రాలు.
ఏకాంతంగా పొడుగాటి వృత్తాలతో ఏర్పడిన తెల్లని పుష్పాలు.
గుండ్రటి పుష్పాసనంలో అమరియున్న అసంయుక్త ఫలదళాలు.

కలువపువ్వు - ఇతర విశేషాలు
కలువ పువ్వును వాటర్ లిల్లీ అని పిలుస్తారు.

కామెంట్‌లు లేవు: