నా జీవితాన్ని తీర్చి దిద్దిన మాతృమూర్తికి మరియు నా జీవితంలోని అన్ని మలుపులలోను, లేక ఏదో ఒక సమయంలోనైనా సరే తోడుగా నిలచిన, నిలుస్తున్న, కలిసిన, ప్రవేశించిన అందరి మహిళలకు..అలాగే ఇతరుల కోసం నిస్వార్దమైన సేవను చేస్తూ తమ జీవితాలను అంకితం చేస్తున్న అందరి మహిళలకు ఈ "మహిళా దినోత్సవము" సాకుతో మనస్పూర్తిగా నమస్కరిస్తూ, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ....
రాగంలో అను రాగంలో తరగని పెన్నిది మగువ.
ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి వలపుల వల్లి,
రఘు రామయ్యనే కన్న తల్లి, సకలావనికే కల్ప వల్లి..
సీతగా, ధరణి జాతగా సహన శీలం చాటినది.
రాధగా, మధుర భాధగా ప్రణయ గాధలు మీటినది..
మొల్లగా కవితలల్లగా, తేనె జల్లులు కురిసినది..
లక్ష్మిగా, ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి