1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

24, మార్చి 2010, బుధవారం

శ్రీరామ నవమి

 
శ్రీ మహావిష్ణువు ఎత్తిన పది అవతారాలలో శ్రీరామావతారం ఏడవది.

శ్రీరాముడు కోసల దేశాధీశ్వరుడైన దశరథునకు కౌసల్య గర్భమున చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగో పాదాన కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పుట్టాడు.

అందుచేత ప్రతీ సంవత్సరం చైత్రశుద్ద నవమి రోజున శ్రీరామజయంతి వేడుకగా జరుపుకుంటాం. ఆంధ్రదేశంలో శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం జరపడం అనాదిగా ఆచారంగా వస్తోంది.

రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద వరాలుపొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు. దేవతల ప్రార్ధనలు మన్నించి శ్రీ మహా విష్ణువు వానిని సంహరించడానికి నరుడై జన్మింపనెంచాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరిగారు.
ఒక సారి శంకరుడు పార్వతీ దేవితో ఇలా అన్నాడట. " రామ" , "రామ", "రామ" అని మూడుసార్లు అంటే వెయ్యిమార్లు రామ నామము చేసినట్లేయని.

ఒక రోజు పార్వతీదేవి పరమశివుని 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి పరమేశ్వరుడు, " పార్వతీ! నేను నిరంతరము ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!" అని క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేసాడు

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
     
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. భక్తులు కాశీలో జీవిస్తూ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన భక్తవశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వార్కి సధ్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

మానవులకు 'రామనామ స్మరణ' జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది. 'రామ' యనగా రమించుట అని అర్ధం.
శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రామ నవమి నాడు రామునికి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు.

భద్రాచలంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేషప్రజానీకం వస్తారు. రాష్ట్రప్రభుత్వం కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టువస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది.

శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు. వీరిలో రఘు ఖచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి తన పినతల్లి కైక కు ఇచ్చిన మాటకోసం పదునాల్గేళ్ళు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలవబడుతుంటాడు.


"
రామ", "రామ", "రామ" అని వ్రాసుకుంటూ పోతే అది కచ్చితంగా ఎదో ఒక శ్లోకమో , పద్యమో అవుతుంది. రెండు అక్షరాలు అంత సుసంపన్నమైనవి. కోకిల కు "కూ, కూ" అని గానము చేయటమే వచ్చు.అలాగే వాల్మీకి కి "రామ రామా" అన్న ధ్వనే వచ్చు. శ్లోకం చూడండి.
కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్ |
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ||


HISTORY OF SRI RAMA NAVAMI* * * * * * * * * * * *
Sri Rama Navami is a Hindu festival, celebrating of the birth of Lord Rama, falls on the Navami, ninth day of the Chaitra month of Hindu lunar year in 'Shukla paksha' or waxing moon, thus named Chaitra Masa Suklapaksha Navami, and marks the end of nine-day Chaitra-Navratri celebrations.The festival commemorates the birth of Rama who is remembered for his prosperous and righteous reign.
Hindus normally perform Kalyanotsavam (marriage celebration) with small murtis of Rama and Sita in their houses, and at the end of the day the deity is taken to a procession on the streets. This day also marks the end of the nine-day utsavam called Chaitra Navaratri (Maharashtra) or Vasanthothsava (Karnataka, Andhra Pradesh & Tamil Nadu) (festival of Spring), which starts with Gudi Padwa (Maharashtra)
Panakam, Vadapappu-chalimidi are the special items we prepare for this festival.

కామెంట్‌లు లేవు: