1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

17, ఏప్రిల్ 2010, శనివారం

ప్రాణం విలువ


1) ప్రాణం విలువ ప్రతి ప్రాణికి తెలియాలి-మానవత్వం విలువ  ప్రతి మనిషికి తెలియాలి 
ప్రాణం వున్న మనిషిగా పరులకు సాయం చేయాలి 
ఆకలితో అలమటించే అభాగ్యులకు ఆసరా కావాలి 
మహోన్నతమైన మానవ జన్మ మహోజ్వలమై వెలగాలి

2)ప్రేమంటే పరువపు ప్రవాహం కాదు..ప్రేమంటే పరులకు ఆసరా

3)కూడు పెట్టని కులం మనకేలమానవత్వం ఊసెరగని మతం మనకేల 
మానవత్వపు జల్లులతో తడిసిన  నేల.. మరుభూమిగ  మారనేలా ( నెత్తుటి ధారలేల(జాడలేల))..
సస్య శ్యామల సమైక్య భారతాన  కులాల కలుపు మొక్కలేల 
అన్నదాత నీవై  కలుపు రూపు మాపలేవ/మాపవేల

కామెంట్‌లు లేవు: