నీకు నచ్చిన వ్యక్తి/వ్యక్తులతో నీకు వచ్చిన ఒక సమస్యను పంచుకోవడం ద్వారా నీకు ఎంతోకొంత ఉపసమనం కలుగుతుంది. నీవు చెప్పినది విన్న వ్యక్తి దాని పరిష్కారానికి తగిన సూచనలు, సలహాలు కూడా చేస్తాడు.అవి ఉపయోగించి నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోవచ్చు. అది ఒక సులభమైన మార్గం,,,,,
కాని ఒక్కసారి ఆలోచించు....
నీవు పరిష్కరించుకోలేని, నీకు పరిష్కారం, సమాధానం దొరకని ప్రశ్నలను మాత్రమే మనం సమస్య అంటాము. కాని ఈ మానవ జీవితంలో, ఈ విశాల విశ్వంలో పరిష్కరించుకోలేనిది ఏది లేదు. ప్రతి సంఘటనకు, ప్రశ్నకు, ఎవరో ఒకరు, ఎపుడోకపుడు, ఎలాగో ఒకలాగా సమాధానం, పరిష్కారం కనుగొన్నారు, కనుగొంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ 'సమస్య ' అనే సమస్యే లేదు. అన్నిటికి పరిష్కారం ఉంది...
నీవు సమస్య అనుకొనే ప్రశ్నకు పరిష్కారం వేరే వారు సూచించడం ఏమిటి?
వారు అనుభవించని ఒక సమస్యకు నీవు చెప్పిన దానిని విని, ఆకళింపు చేసుకొని వారు ఒక పరిష్కారం చూపిన్చకలిగినపుదు, నీ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగినపుడు..అ సంఘటనను అనుభవించి, వాస్తవంగా దాని పూర్వాపరాలు, లోతుపాతులు పూర్తిగా తెలిసిన, అవగాహనా కలిగిన, దానిని అనుభవిస్తూ ఉన్న, నీవు అ సమస్యకు పరిష్కారమార్గం కనుగోనలేవా?
ఆలోచించు, ఆధారపడు... నీ సామర్ధ్యం మీద, నీ బలాబలాల మీద, నీ ఆత్మ విశ్వాసం మీద , నీ ఆలోచన పద్దతుల మీద, నీ దృక్పదం మీద, నీ మనస్సాక్షి మీద, నీ మానసిక పరిపక్వత మీద, నీ ధైర్యం మీద, , నీ మీద నమ్మకం ఉంచు.........ఇప్పుడు ఆ సంఘటన/సమస్య/ప్రశ్న గురించి పూర్తిగా ఆలోచించు, అవకాసాలను పరిశీలించు, ఆలోచనలకూ పదునుపెట్టు, తప్పు, ఒప్పులను బేరీజు వేసుకో.....నీకు నువ్వే....సరైన, మంచి, సులభమైన పరిష్కారం కనుగోనగలవు, కనుగోంటావు.
ఎందుకంటే నీ సమస్య గురించి, నీ గురించి, సమస్య సృష్టించిన వ్యక్తి లేదా పరిస్థితుల గురించి నీ కన్నా తెలిసిన వారు ఎవ్వరు లేరు, వుండరు....వుండబోరు కూడా......
సమస్య నీది....పరిష్కారం కూడా నీదే/నువ్వే కావాలి... అవతలి వ్యక్తుల మీద, వారి అనుభవాల మీద కచ్చితంగా ఆధారపడు... వారి సలహాలు, సూచనలు పాటించు కాదనను....కాని నువ్వు నిజంగా ఆలోచించగలిగితే ....వారిచ్చిన సలహాలు, సూచించిన పరిష్కారాలు నీకు ముందే తెలిసినవే...లేక నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించలేకపోయినవే.....
లే...నిన్ను నువ్వు నమ్ముకో ....నీ సమస్యలకు నీవే పరిష్కారం కనుక్కో....అసలు నీకు తెలియని పరిష్కారం లేనే లేదు....
కాకపోతే అనుకోని సంఘటనల వల్ల, అనవసరపు ఆలోచనల వలన, పరిస్థితుల వలన, మనుషులు వారి మనస్తత్వాల వలన, నీలోను, నీ మనసులోనూ, నీ గుండె లోతుల్లోను కలిగిన అనవసరపు ఆందోళనల అలజడులనే అశాంతి నీకు మాత్రమే ఉండే అతీంద్ర, అతి సామాన్యమైన, అ సామాన్య శక్తులను చిన్నాభిన్నం చేసింది, విచ్చిన్నం చేసింది..........ఆ అలజడుల సవ్వడులకు బయపడి ఆగిపోకు, నీరసించి నిరాశ, నిష్ప్రుహలకు లోనయి..నీ శక్తిని తక్కువ చేసుకొంటూ....నిన్ను నువ్వు క్రుంగదీసుకోకు ....
లే...నీలో ఉన్న,నీకు మాత్రమే ఉండే అతీంద్ర, అతి సామాన్యమైన, అ సామాన్య శక్తులను (ఒక్కటిగ చెయ్యి) ఏకీకృతం చెయ్యి, నీ మనసును కేంద్రీకృతం చెయ్యి .....నీకు మామూలు పరిస్థితులలో ఉండే విచక్షణ జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని, మొక్కవోని ధైర్యాన్ని,కష్టాలను కడతేర్చుకొనే యుక్తిని...ఇలాంటి విపత్కర పరిస్తితులలోను కూడ తీసుకో కలిగితే....చాలు... నీకు ఇనేకేమి అవసరం లేదు....ఏ/ఎవ్వరి సహాయం అక్కరలేదు........అవసరములేదు... ..సమస్య చిన్నదైన, పెద్దదైన, పాతదైన, కొత్తదైన,నీకు సంభంధం ఉన్న లేకపోయినా, నీ ప్రమేయం ఉన్న లేకపోయినా...అది ఏదైనా..ఎలాగైనా....నీ తప్పు లేనప్పుడు ....నిర్భయంగా పరిష్కార మార్గాలను ఆచరించు.....మంచి, ప్రేమ, దయ, జాలి అనే మాటల ముసుగులో ఎప్పుడు చెడును (చెడు సమస్యలను) ప్రోత్సహించకు , సహించకు, పెంచి పోషించకు...... ఏ సమస్య గురించి ఎక్కువ ఆలోచిస్తూ సమయం వృధా చేసుకోకు.....ఆనందాన్ని దూరం చేసుకోకు.......నిన్ను నువ్వు క్రుంగ దీసుకోకు....
నీకు నువ్వే ఎన్నో రకాలైన పరిష్కారాలు కనుగోనగలవు...
ఎలాంటి సమస్యనైన పరిష్కరించుకోగాలవు......
ఎలాంటి సందర్భానైనా ఎదుర్కోగలవు...
ఎవ్వరినైన ధైర్యంగా ఎదిరించగలవు..
కావాల్సిందల్ల...సమస్యపై లోతైన పరిశీలన..........
చేయవలసిందల్లా.....తర్వాత నీ శక్తులన్నింటి ఏకీకరణ....
తర్వాత చెడు పై నీ పరిష్కారాల ఆచరణ....
నీ కంటే బలమైన ఏ శక్తి ఈ ప్రపంచంలో లేదు......నువ్వే అత్యంత బలమైన శక్తివి, యుక్తివి.....నీ సమస్యకు - నీవే పరిష్కారం ఆలోచించగల వ్యక్తివి...
అమ్మ శ్రీనివాస్ "అనంతరంగం....Straight from the Heart" 03 .05 .2010 3.05AM
Love all - Serve all
"Amma" Srinivas
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి