మన/మనిషి జీవితానికి, మనుగడకు మూలాధారం ప్రకృతి..... మన మనుగడకు అవసరమైన ప్రతి దానిని కాపాడుకోవడం/రక్షించుకోవడం అనేది మన భాద్యత, హక్కు. కాని మనం ఈ రోజు కూర్చున్న కొమ్మనే నరుకొంటున్న విధంగా,మనం బ్రతకడానికి ఆధారభూతమైన పంచభూతాలను (ఆకాశం, భూమి, అగ్ని, వాయు, నీరు) కలిగి ఉన్న ప్రకృతిని మనమే చేతులారా, తెలిసి తెలియని అవివేకంతో, అజ్ఞానంతో నాశనం చేసుకుంటూ పోతు....మన వినాశనానికి మనమే కారణం అవుతున్నాము.....
పర్యావరణం అంటే మనం.పర్యావరణ పరిరక్షణ అంటే మనం మనల్నీ,మనపరిసరాలనూ,చెట్టూ,పుట్ టా,గాలీ,నీరు,కొండాకోనా,వాగూవం కా,పిట్టాపిచికా, అన్నిటినీ ముఖ్యంగా మనరేపును,మనభవిష్యత్తును,సం రక్షించుకునేందుకూ నిరంతరం చేయాల్సిన ఒక వ్రతం.దానికి ఏవ్రతకల్పాలూ,వ్రతఫలాలూ ప్రత్యేకంగా ఉండవు.మన జీవన శైలీ,వినిమయవిధానాలూ,అందరూ పచ్చగా ఉండాలని కోరుకునే చల్లని,మంచిమనసు చాలు
మాట కల్తి మనసు కల్తి
నీరు కల్తి బీరు కల్తి
మానవ ప్రాణంబు నిలిపె
మందులలో మరీ కల్తి
బియ్యంలో రాళ్ళాయె
పాలల్లో నీళ్ళాయె
అన్నంలో సున్నమాయె
అన్నిట అనుకరణలాయె
నీడనిచ్చె చెట్టుగొట్టి
గోడకు దిగ్గొట్టినావు
అడవంతా నరికివేసి
కాలుష్యం బెంచినావు
జనాలుండె ఇళ్ళల్లో
రసాయనాల పొగలాయె
భూగర్భ జలమందున
మందుల వ్వర్ధంబులాయె
భూమాత గుండెల్లో
బోరులెన్నొ గుచ్చి గుచ్చి
జలమంతా లాగినావు
భూకంపం దెచ్చినావు
లెక్కలేని వాహనాలు
ఒక్కసారి రోడ్డునెక్కి
గుప్పు గుప్పుమను పొగలతొ
కాలుష్యం చిమ్ముచుండె
ఉత్తచేతులు ఊపుకుంటు
సరుకులకై సంతకెల్లి
పలు ప్లాస్టిక్ సంచులతో
పరుగులెత్తి ఇంటికొచ్చి
పర్యావరణం పాడుజేసి
పాపం మూటగట్టినావు
కాబట్టి మిత్రులారా,పెద్దలారా మనకోసం మనభవిష్యత్తు కోసం ఒక్క చిన్న అడుగు వేద్దాం.రండి
· అనవసర విద్యుత్ ఆదా చేపట్టు - ఆహ్లాదకర జీవితానికి ఇదే తొలి మెట్టు
· యూనిట్ విద్యుత్ ఉత్పత్తికన్న- యూనిట్ విద్యుత్ ఆదా మిన్న
· నేటి పచ్చదనమే - భావితరాల భవితవ్యం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి