1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

23, ఆగస్టు 2010, సోమవారం

నా మరో ప్రపంచం


కావాలి నాకు మరో ప్రపంచం
మనిషిని మనిషిగా చూసె ప్రపంచం
కుట్రలు, కుళ్ళు లేని ప్రపంచం
స్వార్ధం, వంచన లేని ప్రపంచం
కులాల కక్షలు లేని ప్రపంచం
మతాల మారణ హోమం చూడని ప్రపంచం
ప్రాంతీయత భేదాలు తెలియని ప్రపంచం
కష్టించే వాడే రాజుగా ఉండె ప్రపంచం
ఆకలి కేకలు వినపడని ప్రపంచం
అనాధలు, అభాగ్యులు కనపడని ప్రపంచం
తలితండ్రులే దైవాలుగా సేవించే ప్రపంచం
పడతిని విలాస వస్తువుగా భావించని ప్రపంచం
స్నేహ, సౌహర్ధ భావాలు నిండిన ప్రపంచం
సేవా, సఛ్చీలత లే పదవులకు అర్హతలయ్యే ప్రపంచం
అవినీతి ఆగుపడని ప్రపంచం
అహింసనే వేదంలా భావించే ప్రపంచం
శత్రువుని కూడ మిత్రుడిలా మార్చే ప్రపంచం
కావాలి నాకు మరో ప్రపంచం
....అనిల్

కామెంట్‌లు లేవు: