1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

23, ఆగస్టు 2010, సోమవారం

నా తెలుగు

నందనందనుని చైతన్య శంఖారావం నా తెలుగు

ముక్కంటి ఢమ ఢమ ఢంఖా నాదం నా తెలుగు

అసుర భయంకర శ్రీరాముని ధనుష్టాంకార నాదం నా తెలుగు

హంస వాహన శ్వేతాంభర ధారిణి వీణా నాదం నా తెలుగు

హరి పదాన జనియించిన గంగమ్మ గల గలల సజీవ ప్రవాహం నా తెలుగు
-అనిల్ కుమార్ చింతలపల్లి

కామెంట్‌లు లేవు: