1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

23, ఆగస్టు 2010, సోమవారం

జాతి వైరము మరచి

జాతి వైరము మరచి శునక మార్జాలములు ఆటలాడుచున్నవి

తెలుగు జాతికి మచ్చ తెచ్చునట్లు మనము వైరమాడుచుంటిమి

జాతి నెంచక శునక రాజము వరాహ బిడ్డలకు స్తన్యమిచ్చున్నది

తెలుగు తల్లికి గుండె కోత పేడుతు మనము వైరమడుచుంటిమి

మాతృమూర్తి మనస్సు నెంచక గుంట నక్కల పాలుపడుతుంటిమి
-అనిల్ కుమార్ చింతలపల్లి

కామెంట్‌లు లేవు: