శ్వాశ నడిగా నీవెమిటని... గమ్యమెరుగని గాలిని చెరదీసె చెలికాడిని నేనంది
చూపుని అడిగా నీవు ఎవరని...నీవు చూసే ప్రతిరూపు నేనంది
మాటనడిగా నీ పనిఎంటి అని...ఎల్లలేరుగని స్నేహ బంధానికి యజమాని నేనంది
చేతినడిగా నీ గొప్ప ఎంటని...ఊతమడిగిన సహ హృదయానికి చేసె ఉపకారమె నాగొప్పంది
అడుగునడిగా నీ పొగరు అసలేమిటని...ఖ్యాతికెక్కిన జాతిధనుల ననుసరించే భాగ్యం నాది మాత్రమేనని
ఊహనడిగా నీకెందుకంత ఉలుకని...జగతి హృదయాలను ఏలు భారత జాతి ప్రాభవాన్ని ఊహిస్తున్నందుకంది
మనస్సు నడిగా అంబరమంటే సంబరమెందువల్లనని...భరతమాత బిడ్డననే తలపులు నను తాకుతున్నందువల్లనేనంది.
-చింతలపల్లి అనిల్ కుమార్ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి