1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

23, ఆగస్టు 2010, సోమవారం

అంటారు ప్రేమిస్తే...

అంటారు ప్రేమిస్తే కవి కాని వాడికి కూడ కవిత్వం వస్తుందని...

ఎలా వస్తుందో నాకు తెలియడం లేదు

ఎదుకంటే నాకు నీ పేరు తప్ప మరో పదమే గుర్తు రావట్లేదు

చేప్పారు పున్నమి రేయిలో చల్లని వెలుగులు చిందించె జాబిలి చుస్తే ప్రేయసి వదనం కనిపిస్తుందని

కాని గుర్తించలేకుంది నీ రూపం నిండిన నా మస్తిష్కం...వెలుగులు నిండిన పున్నమి రేయి ఎదో కారుచీకటి కమ్మిన అమావాస్య నిసి ఎదో.

రాసారు కవులు ప్రేయసి నిండిన హృదయం చేసె సవ్వడి ఆమె పెరే అని..

కాని నాచేవులకు నీవు పలికిన తీయని మాటలుతప్ప మరేమి వినిపించుట లేదు.

తెలిపారు ప్రేమికులు ప్రేయసి ప్రియులకు వారిద్దరే లోకంలో ఉన్నట్లుంటుందని..

కాని నాకేంటో నువ్వే లోకమైపోయావు...నేను ఉన్నట్లు నాకే తెలియట్లేదు..

తెలియట్లేదు...

చింతలపల్లి అనిల్ కుమార్ శర్మ

కామెంట్‌లు లేవు: