పాడవోయి భారతీయుడా.. ఆడిపాడవోయి విజయగీతికా
నేడే స్వాతంత్ర్యదినం.. వీరుల త్యాగఫలం..
నేడే నవోదయం నీదే ఆనందం..
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి..
సాధించినదానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే సరిపోదోయి.
ఆగకోయి భారతీయుడా కదిలి సాగవోయి ప్రగతిదారులా..
ఆకాశమందుకునే ధరలొకవైపు.. అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ..
అవినీతి బంధుప్రీతి,
ఈ దేశమెటు దిగజారూ.. కాంచవోయి నేటి దిస్థితి..
ఎదిరించవోయి ఈ పరీస్థితి..
పదవీవ్యామోహాలూ కులమతభేదాలూ.. భాషాద్వేషాలూ చెలరేగే నేడూ.. ప్రతిమినిషీ మరియొకని దోచుకునేవాడే.. తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే..
స్వార్థమే అనర్థకారణం..అది చంపుకొనుటే క్షేమదాయకం..
సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం.. సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం.. ఏకదీక్షతో గమ్యం చేరిననాడే.. లోకానికి మన భారతదేశం అందించునులే శుభసంకేతం..
1 కామెంట్:
శ్రీనివస్,
మీ ఆలొచన చాలా బాగుంది, ఎంథొ మందికి ఆదర్సంగా కూడ వుంది.
తెలుగు వారు గర్వ పడేల మీ ఆశయం దాని ఆచరణ తీరు మమ్మల్ని ఆకర్షించాయి.
మీ శ్రేయూభిలాషి
కల
కామెంట్‌ను పోస్ట్ చేయండి