1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

23, ఆగస్టు 2010, సోమవారం

మల్లెలకు చెల్లెలవా...

మల్లెలకు చెల్లెలవా...అవ్వకపోతె నీ వాలుజడ సువాసన వాటికి ఎలా వచ్చింది

తేనె నీ తొబుట్టువా...కాకపోతె నీ అధరాల తీయదనం దానికి ఎక్కడిది

హంసలకు నడకలు నేర్పవా...నేర్పుంటావు లేకపోతె వాటి నడకకు నీ వయ్యారం ఎక్కడిది

కోయిలలు నీవు కవలలు అయివుంటారు...లేకపోతె వాటి కంఠానికి నీ స్వర మాధుర్యం ఎలావస్తుంది

మందారానికి ఆ ఎరుపుల మెరుపు ఎక్కడిది నీ మేనిని తాకకపోతె

నెమలికి నాట్యం ఎలా వచ్చేది నడకలో కదిలె నీ నడుమును చూడకపోతె
-అనిల్ కుమార్ చింతలపల్లి

కామెంట్‌లు లేవు: