ఎందుకు నీకై నువ్వే నీ జీవితాన్ని... అనవసరమైన ఆలోచనలతో దుఖమయం చేసుకుంటావు ?
ఎందుకు నీకై నువ్వే నీ జీవితాన్ని....సంతోషానికి దూరం చేసుకుంటావు ?
ఎందుకు నీకై నువ్వే నీ జీవితాన్ని...వ్యర్ధం చేసుకుంటావు ఆశల ఊయలలో వూగులాడుతూ ?
ఎందుకు నీకై నువ్వే నీ జీవితాన్ని.... ఏడుస్తూ ఈడుస్తావు తాత్కాలికమైన వాటికోసం ?
ఎందుకు పదే పదే జ్ఞప్తికి తెచ్చుకుంటావు మార్చలేని, మారిపోని బాధాకర సంఘటలను ?
ఎందుకు సంతోషాన్ని నాశనం చేసే విషయాలకు ప్రాధన్యతనిస్తావు … ?
ప్రాముఖ్యతనిస్తావు ?
ఎందుకు సంతోషభరితమైన క్షణాలను, సంగతులను, మనుషులను, పరిసరాలను గుర్తుకు తెచ్చుకోవు?
నీ జీవిత లక్ష్యం ఆనందకర జీవనమా? లేక భాధాకర ప్రయాణమా?
నీ చివరి వరకు నీకు తోడుగా ఉండేది ఏదైనా ఉందా? ఎవరైనా ఉన్నారా? లేరు కదా....
నీకు నువ్వే చివరి మజిలి,
నువ్వే నీకు చివరి వరకు తోడుంటే స్నేహం,
నువ్వే.. నిన్ను నడుపుకొనే ఇంధనం....
నీకు నువ్వే శక్తి, యుక్తి...సంతోషం, భాధ, ఆనందం, ఉత్సాహం, ఊపిరి ......
మరి ఎందుకు మనతో కలకాలంరాని /ఉండలేని (మనుసులు,మనసులు, వస్తువులు), మనల్ని వదిలి ఎప్పుడో ఒకప్పుడు వదిలి వెళ్ళిపోయేవి... ఇప్పుడు వెల్లిపోయాయని పదే పదే భాదపడుతూ…నీ జీవితాన్ని నీ చేతులారా దుఖభరితం చేసుకుంటావ్ …..?
ఏదైనా /ఎప్పటికైనా వాటి మజిలీ పూర్తవగానే, గమ్యం చేరుకోగానే వెళ్ళిపోయేవే అని నీకు తేలీదా??? ఏది నీతో శాశ్వతంగా రాదనీ నీకు తెలుసుగా?
మరి అలాంటి వాటి గురించి ఎందుకంత బాధ పడుతావ్ ..అలాంటివాటిని ఎందుకంత ప్రేమిస్తావ్, ఇష్టపడతావ్ ....కావాలనుకుంటావ్ .....నీ సర్వం అనుకుంటావ్ ....
అన్నిటిని నీకిష్టం వచ్చినంత, అవధులు లేనంత ఇష్టపడు, ప్రేమించు. ... కాని వాటి కంటే నిన్ను నువ్వు ఎక్కువగా ప్రేమించుకో,ఇష్టపడు.. ..అప్పుడు జీవితంలో ఏది నిన్ను శాశ్వతంగా బాధించలేదు.....నీ ఆనందాన్ని హరించలేదు.......
ఇవ్వన్ని మనకు, మనసుకు తెలియని విషయాలా?
కానే కాదు ....మరి ఎందుకు... నీకు ఈ కన్నీళ్ళ సావాసం…..బాధల బంధుత్వం.... నీ జీవితం కావాలి రంగుల హరి విల్లు ……ఆనందాల ముంగిళ్ళు …….సంతోషంతో సహగమనం చెయ్యి….నవ్వుల పందిళ్ళలో నాట్యం చెయ్యి… జీవితాన్ని అర్ధవంతంచెయ్యి...
ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ప్రేరణను ఇచ్చే విసయాన్ని ఎంతసేపైనా తలచుకో, ఆలోచించు ….ఇంకా ఆ ఆనందాన్ని రెట్టింపు చేసుకో …..
కానీ బాధపడే విసయాన్ని ఎక్కువగా నెమరు వేసుకోకు …బాధను రెట్టింపు చేసుకోకు…….
అందువల్ల మనకి వరిగేది ఏమిలేదు, జీవితం దుఖమయం కావడం తప్ప ……
ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించు, బాధపడు …..తప్పులేదు …కానీ అది రమణి మహర్షి చెప్పినట్టు ఉండాలి .... అంటే ఆ విషయం వల్ల వచ్చే ఫలితాలను ఊహించుకొని /విశ్లేషించుకోవాలి...దాని వల్ల మనకు విషయ పరిజ్ఞానం పెరిగి అన్ని పలితాలు క్షనికాలు, ఆశాశ్వతాలు అని తెలుసుకుంటాం, అప్పుడు దానిని గురించి ఎక్కువగా ఆలోచించడం మానేస్తాం... తద్వారా మనం దుఖానికి దూరంగా రాగలం...….సంతోషాన్ని వడిసి పట్టుకోగలం...మన కౌగిళ్ళలో బంధించగలం.....
నీ జీవితానికి, నీకు అర్ధవంతమైన ఒక లక్ష్యం నిర్ణయించుకో....దానిని ప్రేమించు, ప్రతి నిమిషం శ్వాసించు, ఆలోచించు...
.అంతే...
ఇక నిన్ను ఏ విధమైన తాత్కాలికమైన, ఆశాస్వతమైన శక్తులు, భావాలూ, భావనలు, ఆలోచనలు, పరిచయాలు, ప్రేమలు, బంధాలు, బంధుత్వాలు,స్నేహాలు, కోరికలు ఆపలేవు....
నీకు నింగే సరిహద్దు...నిన్ను ఆపే ఏ శక్తి ఈ భువిపై లేదు, ఉండదు, రాబోదు....
నీ సంకల్ప బలాన్ని నిరోధించగలిగే ఏ అవరోధాలు ఈ భూమిపై సృష్టించపడలేదు....
లే....సాగిపో... ఉన్నత లక్ష్యాలను ఆనందంగా చేరుకో....జీవితాన్ని అర్ధవంతం చేసుకో..... చరిత్ర పుటలలో, అందరి హృదయాలలో శాశ్వతంగా నిలచిపో .....
"జననం ఒక సుప్రభాతం, మరణం ఒక సంధ్యా రాగం... రెండిటి మధ్య జీవితం సుఖదుఖాల సంగమం... అందులో నీ ప్రస్తానం కావాలి ఒక అమృతకావ్యం"
....హృదయలోతుల్లోంచి, జీవిత అనుభవాల్లోంచి...మదిలో మెదిలే భావాల సంపుటి....నా అంతంలేని ఆలోచనల తరంగం....అదే....నా అనంతరంగం...అమ్మ శ్రీనివాస్
3 కామెంట్‌లు:
nice post
chalaa baagundi
Suprb srinivas garu...
కామెంట్‌ను పోస్ట్ చేయండి