1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

గుర్తుకురారా? ప్రేమ మత్తులో??

ఇన్నేళ్ళుగా  కని,పెంచిన  తల్లి తండ్రులు గుర్తుకురారా?
చిన్ననాటి నుంచి  మన అడుగులో అడుగైన చిన్నారి  స్నేహితులు  గుర్తుకురారా?
స్నేహానికి నిజమైన  నిర్వచనం తెలిపేలా మెలిగే కళాశాల,కాలేజీ  స్నేహితులు  గుర్తుకురారా?
తోబుట్టువులుతోటి బంధువులు అసలే గుర్తుకురారా?
సహ ఉద్యోగులు, సన్నిహితులు గుర్తుకురారా?
వీరితో  నీ  సంబంధం, అనుబంధం, ఆనంద క్షణాలు, వీరు నీపై కురిపించన ప్రేమ  గుర్తుకురాదా ?
నువ్వు  అప్పటి దాక నమ్మిన, నిన్ను నడిపించిన దైవం గుర్తుకురాదా ?
నీకు ఎల్లవేళలా తోడుంటే  నీ ఆత్మవిశ్వాశంఆత్మ గౌరవం, నీపై  నీకు  గల  నమ్మకం ఏమి గుర్తుకురావా?

నీ  ఇన్ని సంవత్సరాల, నువ్వు మలుచుకున్న, నీకిష్టమైన  నువ్వు, నీ జీవితం అస్సలేమి  గుర్తుకురావా?
తెలియదా  వీటి విలువ…..మరి ఎందుకు ఎందుకు???…నీలో    నిరాశ నిస్పృహలు, చావలేక  బ్రతకడం కోసం చస్తూ గడుపుతున్న క్షణాలు?
ఇదా జీవితం  అంటే ….ఇదా జీఎవితం అంటే .……????

ఇంత మందిఇన్ని సంవత్సరాలు  మార్చలేని/ప్రభావం చూపలేని  నీ  జీవన  విధానాన్ని, జీవితాన్ని... … …మనతో ఉంటుందో, లేదో  తెలియని  కొన్ని  రోజుల  ఒక  అమ్మాయి  లేక  అబ్బాయి  ప్రేమ  అనే  పరిచయం  ప్రభావం  చూపుతోంది,   జ్ఞాపకాల నుంచి బయటకు రాలేను అంటూ..జీవితాన్ని చీకటి మయం చేసుకుంటూ వెళ్తున్నావ్ అంటే  నమ్మగలవా?  .... నమ్మగలవా ఇది నీ అనుమతి లేకుండా జరగడంలేదు  అంటే ??  ఉంటుందా ఇంతకన్నా  దౌర్భాగ్యం?? …..ఇదేనా  నీపై  నీకు  గల  నియంత్రణ?
కాదా  ఇది  నువ్వు నీ  చేతులారా  చేసుకుంటున్నది, నీవల్ల   కావటం లేదు అని  నిన్ను  నువ్వు  కప్పిపుచ్చుకుంటూ/క్షమించుకుంటూ/మోసగిన్చుకుంటూ  నీ  జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటూ ఉన్నది...... ?

ఇప్పటిదాకా  నువ్వు  అనుభవించిన  కష్ట, నష్టాల అనుభవాల  కన్నా  ఎక్కువ    కొన్ని  రోజుల  పరిచయం? ……
కాదా  నీకై  నువ్వే  తనకి ఇచ్చుకుంటున్న  ప్రాముక్యత ……తెలియడం  లేదా  లేక .తెలుసుకోవాలని లేదా?…
జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని  లేదా?
సంపూర్ణంగా అనుభవించాలని  లేదా??
నీ  జీవిత పరమార్ధాన్ని  గ్రహించాలని  లేదా…..??

వదిలేయ్, తుడిచెయ్, చేరిపేయ్ 
వదిలేయ్    దుఖభరితమైన  ఆలోచనలను,
తుడిచెయ్  నీలోని  పనికిమాలిన  ఆలోచనలను,
చేరిపేయ్ నీ మనసులోని తాత్కాలిక సుఖాలను....

తగ్గించుకో, గుర్తుంచుకో, అందుకో ..
తగ్గించుకో ఆమెకు/అతనికి నువ్వు ఇచ్చే ప్రాముఖ్యతను,
గుర్తుంచుకో నీ తల్లి  తండ్రులను, నీ ప్రతి అడుగులో నీకు  సాయం చేసిన చేతులను వారి ఆశలను, ఆశయాలనునీ జీవిత లక్ష్యాన్ని

తెలుసుకో, మేలుకో, నడుచుకో, మార్చుకో , చేరుకో
తెలుసుకో  ఏది   నీతో కడ దాక  రాదని,
మేలుకో ప్రేమ  అనే  మత్తులోంచి,
నడుచుకో  నీ  జీవిత  లక్ష్యాలవైపుగా,
మార్చుకో  ప్రస్తుత  నీ  మానసిక  స్వబావాన్ని
చేరుకో అంతులేని ఆనంద తీరాలను, అనుభవించు జీవితంలోని ప్రతి క్షణాన్ని......

నువ్వు తప్ప , నీ సహకారంతో తప్ప నిన్ను మార్చే శక్తీ, వ్యక్తి, వైద్యం సృష్టిలో లేదు.... నీకు నువ్వే అన్ని..నీ ప్రతి క్షణం నువ్వు ఆలోచించే, అవలంభించే విధానమే....కష్టమైన, సుఖమైన,బాధైనా, సంతోషమైన మరి ఏదైనా....కారణం నువ్వే....మందు నువ్వే....తెలుసుకో నిజాన్ని మార్చుకో నీ జీవితాన్ని....

నా అనంతరంగం "అమ్మ"శ్రీనివాస్

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Sudarshana rao duttaluri - Srinivas garu, this is excellent, but this massive marketing force and the craving of undeserved in this country , will continue to make these "mohabbat"movies and all younger generation is now addicted. its so sad that all our movies are becoming more erotic in the name of love and maximum time of our people is being wasted criminally by these. Your poem should be affixed in front of all cinema halls. atleast then this hysteric mob will stop thronging to see all these erotic movies. Its disgusting to see these movies anymore....11:16 am

అజ్ఞాత చెప్పారు...

Really Great and Real Insipirative and motivative words