1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

28, అక్టోబర్ 2010, గురువారం

ఒకరు..మరొకరు

 

ఒకరు..మరొకరు

హృదయం ఒకరైతే..దానిని నడిపే ఊపిరి మరొకరు
దారిని చూపే నయనం ఒకరైతే..దానిని కాచే కనురెప్ప మరొకరు
సేద దీర్చె చల్లని నీడ ఒకరైతే..స్వేదం తుడిచే చల్లని గాలి మరొకరు
బాధ గొన్న హృదయానికి ఆత్మీయ శ్వాంతన ఒకరైతతే...అనురాగ స్పర్శ మరొకరు
విజయంలో అభినందించె నేస్తం ఒకరైతే..ఇది అంతం కాదు ఆరంభం అని చెప్పే మార్గదర్శి మరొకరు

ఒకరు...మరొకరు.... ఇంకెవరు???

పెనవేసిన పేగు బంధం...
పలికితేనె తెనెలొలుకు తీయని పదం
ఊటలూరు అమృత భాండం...అమ్మ

ముడివేసిన వివాహ బంధం..
అతను తనుగా భావించే అనురాగ మోహం
ఆత్మీయ బంధం.. సహధర్మచారిణి

వారు కాక ఇంకెవరు... ఒకరు..మరొకరు.

అనిల్ కుమార్ చింతలపల్లి

 

కామెంట్‌లు లేవు: