1.వస్తా వట్టిది... పోతా వట్టిది! ఆశ ఎందుకంటా? చేసిన ధర్మము చెడని పదార్థము... చేరును నీవెంట..2.నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది గర్వించే ఈ నీ బ్రతుకు సమాజమే మలిచింది ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా తెప్ప తగలపెట్టేస్తావా ఏరు దాటగానే...

28, అక్టోబర్ 2010, గురువారం

ఎవరే నీవు...????

ఎవరే నీవు...????

ఎవరే నీవు...
ఉదయభానుని కిరణాలతో
కూడి మెరియు హిమ బిందువువా...

శ్రీనాధుని సరస కవితకు ఉహనిచ్చిన..
వయ్యారి వనితవా..

నా మనస్సును చిలిపి కోరికలతో
కైపెక్కించు మధిరవా..

నను ఉక్కిరి బిక్కిరి చేయు..
మధురోహల తమ్మెరవా.. (తమ్మెర అంటే గాలి)

ఎద పరుదాల చాటున దాగి నయనాలకందని మగువా..
ఎవరే నీవు...ఎవరే నీవు...నీవు ఎవరే ????

 

రచించినది అనిల్ కుమార్ చింతలపల్లి

కామెంట్‌లు లేవు: